By: Ram Manohar | Updated at : 20 May 2023 01:26 PM (IST)
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, డిప్యుటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. (Image Credits: ANI)
Karnataka Swear In Ceremony:
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, డిప్యుటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎప్పుడెప్పుడా అని కాంగ్రెస్ అభిమానులంతా ఎదురు చూసిన ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. కంఠీరవ స్టేడియం వేలాది మంది కార్యకర్తలతో నిండిపోయింది. సిద్దరామయ్య, శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఒక్కసారిగా జనమంతా కేరింతలు కొట్టారు. చాలా సేపటి వరకూ ఆ ప్రాంతం వాళ్ల అరుపులతో మారుమోగింది. ఈ కార్యక్రమానికి కీలక నేతలు హాజరయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా వేదికపై సందడి చేశారు. ప్రముఖ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ కూడా వేదికపై కనిపించారు. అయితే...ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కనిపించలేదు. సిద్దరామయ్య, డీకేతో పాటు 8 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు.
Senior Congress leader Siddaramaiah takes oath as the Chief Minister of Karnataka in Bengaluru. pic.twitter.com/9VUBNNsuv2
— ANI (@ANI) May 20, 2023
DK Shivakumar takes oath as the Deputy Chief Minister of Karnataka in Bengaluru. pic.twitter.com/OSGc7ck4tV
— ANI (@ANI) May 20, 2023
మే 13న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 135 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. మరుసటి రోజు ఆదివారం (మే 14) సాయంత్రం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావేశమై నాయకుడిని ఎన్నుకోవడానికి బదులు ఓ తీర్మానం చేసి అధినాయకత్వానికి పంపింది. ఏకవాక్య తీర్మానం చేసి శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే హక్కును కాంగ్రెస్ అధ్యక్షుడికి అప్పగించారు.
నంబర్ వన్ పొజిషన్లో ఉండాలనుకున్న డీకే శివకుమార్..నంబర్ 2కి పరిమితమయ్యారు. దీనిపై ఆయన అసహనంగా ఉన్నారంటూ పుకార్లు వినిపించాయి. సిద్దరామయ్య, శివకుమార్ మధ్య విభేదాలున్నాయనీ కొందరు ప్రచారం చేశారు. అయితే...అధిష్ఠానం నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు డీకే. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టులో జడ్జ్ తీర్పుని గౌరవించినట్టే..హైకమాండ్ డిసిషన్ని గౌరవిస్తున్నానని వెల్లడించారు. సోనియా గాంధీతో భేటీ అవ్వనంత వరకూ వెనక్కి తగ్గని శివకుమార్..ఆ తరవాత మనసు మార్చుకున్నారు. పార్టీ అవసరం మేరకు త్యాగం చేయక తప్పలేదని స్పష్టం చేశారు.
"నిర్ణయం తీసుకునే అధికారాన్ని అధిష్ఠానానికే కట్టబెట్టినప్పుడు ఆ తీర్పు ఎలా ఉన్నా గౌరవించాలి. కోర్టులో చాలా మంది తమ వాదనలు వినిపిస్తుండొచ్చు. కానీ...అల్టిమేట్‌గా జడ్జ్ చెప్పిన తీర్పుకి కట్టుబడి ఉండాలి. మా విషయంలోనూ 135 ఎమ్మెల్యేలూ ఒకేమాటపై నిలబడ్డారు. హైకమాండ్‌కే నిర్ణయాన్ని వదిలేశారు"
- డీకే శివకుమార్, కర్ణాటక డిప్యుటీ సీఎం
Also Read: Karnataka CM Swearing-In: కర్ణాటక సీఎం పట్టాభిషేకానికి విపక్ష నేతల తరలిరావడం వెనుక అసలు కారణం అదేనా?
Karnataka Cabinet: కర్ణాటకలో ఇకపై ఉచిత విద్యుత్, అప్పటి నుంచే అమలు - మిగతా హామీలకూ గ్రీన్ సిగ్నల్
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు
Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం
Education Loan: సిబిల్ స్కోర్ తక్కువైనా ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది, హైకోర్ట్ కీలక నిర్దేశం
Pawan Kalyan Varahi: ఈనెల నుంచే రోడ్లపైకి వారాహి, రూట్ మ్యాప్ సిద్ధం చేసిన పవన్ కళ్యాణ్!
MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని టాప్-5 కార్ కలెక్షన్ - ఆర్మీ స్పెషల్ కారు కూడా గ్యారేజ్‌లో!
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
GVL : పోలవరం ఎత్తు 41.15 మీటర్ల వరకేనా ? - ఆ మేరకే కేంద్రం నిధులిస్తుందన్న జీవీఎల్ !
Nenu Student Sir Review: నేను స్టూడెంట్ సర్ రివ్యూ: ఈ స్టూడెంట్ను థియేటర్లలో చూడవచ్చా? ఆకట్టుకున్నాడా?