అన్వేషించండి

బిడ్డకి జన్మనిచ్చిన 9వ తరగతి విద్యార్థిని, హాస్టల్‌ వార్డెన్ సస్పెండ్

Student Gives Birth: కర్ణాటకలో 9వ తరగతి విద్యార్థిని బిడ్డకి జన్మనిచ్చిన ఘటన సంచలనమైంది.

Class 9 Student Gives Birth: 

కర్ణాటకలో ఘటన..

కర్ణాటకలోని చిక్కబల్లాపూర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 9వ తరగతి విద్యార్థిని ఓ బిడ్డకి జన్మనిచ్చింది. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది.  సమాచారం తెలుసుకున్న అధికారులు వెంటనే హాస్టల్ వార్డెన్‌ని సస్పెండ్ చేశారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సాంఘిక సంక్షేమ హాస్టల్‌లోని బాలిక కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతోంది. తరచూ బంధువుల ఇంటికి వెళ్తోంది. గతేడాగి ఆగస్టులో బంధువులు ఆమెకి మెడికల్ చెకప్ చేయించారు. కానీ ఆ సమయంలో ఆమె గర్భం దాల్చినట్టు రిపోర్ట్‌లో వెల్లడి కాలేదు. బాధిత బాలిక గతేడాది హాస్టల్‌లో చేరినట్టు అధికారులు వెల్లడించారు. అయితే...ఆమెతో పదోతరగతి విద్యార్థి సన్నిహితంగా ఉండేవాడని ఇద్దరిదీ ఒకే స్కూల్‌ అని సమాచారం. అయితే..పదోతరగతి పూర్తైన తరవాత ఆ యువకుడు స్కూల్ నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారులు స్పందించారు. కడుపు నొప్పితో హాస్పిటల్‌లో చేరితే ఆమె గర్భం దాల్చినట్టు తేలిందని వివరించారు. 

"చాలా రోజులుగా బాలిక హాస్టల్‌కి రావడం లేదు. తరచూ కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేది. ట్రీట్‌మెంట్‌ కోసం హాస్పిటల్‌కి వెళ్లింది. అప్పుడే ఆమె గర్భం దాల్చినట్టు తెలిసింది. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నాం. ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక అందిస్తాం. ఆ బాలుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు"

- అధికారులు 

ఈ ఘటనపై పోలీసులు కూడా స్పందించారు. బాలిక తల్లిదండ్రులు తమకు సహకరించడం లేదని,ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదని వెల్లడించారు. ప్రస్తుతానికి బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని తెలిపారు. 

"ప్రస్తుతానికి ఈ ఘటనపై కేసు నమోదు చేశాం. ఎవరినీ అరెస్ట్ చేయలేదు. బాలిక, ఆమె తల్లిదండ్రులు నోరు మెదపడం లేదు. వాళ్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నాం. బాధితురాలు ఒక్కోసారి ఒక్కో మాట చెబుతోంది. ఓ సీనియర్ విద్యార్థి పేరు మాత్రం చెప్పింది. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తరవాతే బాధ్యులను అరెస్ట్ చేస్తాం"

- పోలీసులు 

Also Read: Ram Mandir Inauguration: రాముడి ప్రాణప్రతిష్ఠ చేసేందుకే దేవుడు నన్ను పుట్టించాడేమో - ప్రధాని మోదీ భావోద్వేగం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget