Ram Mandir Inauguration: రాముడి ప్రాణప్రతిష్ఠ చేసేందుకే దేవుడు నన్ను పుట్టించాడేమో - ప్రధాని మోదీ భావోద్వేగం
Ram Mandir Inauguration: రాముడి ప్రాణప్రతిష్ఠ చేసేందుకే దేవుడు తనను పుట్టించాడేమోనంటూ ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు.
![Ram Mandir Inauguration: రాముడి ప్రాణప్రతిష్ఠ చేసేందుకే దేవుడు నన్ను పుట్టించాడేమో - ప్రధాని మోదీ భావోద్వేగం Ayodhya Ram Mandir Inauguration PM Modi starts 11-day ritual ahead of Ram Mandir inauguration Ram Mandir Inauguration: రాముడి ప్రాణప్రతిష్ఠ చేసేందుకే దేవుడు నన్ను పుట్టించాడేమో - ప్రధాని మోదీ భావోద్వేగం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/12/3200a9a496a0623d23f55adb208d041d1705037621040517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ramlala Pran Pratishtha:
ప్రధాని మోదీ భావోద్వేగం..
ఈ నెల 22వ తేదీన అయోధ్య ఉత్సవాన్ని (Ram Mandir Inauguration) వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకకు ముందుగా దాదాపు 11 రోజుల పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ క్రమంలోనే "అనుష్ఠానం" కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (Ram Mandir Pran Pratishtha) ప్రారంభించారు. ఈ మేరకు స్వయంగా మోదీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో వాయిస్ మెసేజ్‌ని అప్‌లోడ్ చేశారు. ఇలాంటి గొప్ప ఉత్సవాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఇదో చారిత్రక ఘటన (Ayodhya News) అంటూ ఆనందం వ్యక్తం చేశారు. దేశ ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని కోరారు.
"అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మరో 11 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ వేడుకను నా చేతుల మీదుగా జరగాలనే ఆ దేవుడు నాకీ జన్మ ఇచ్చినట్టున్నాడు. దేశ ప్రజలందరికీ ప్రతినిధిగా నేనీ ప్రాణప్రతిష్ఠ చేస్తాను. ఇవాళ్టి నుంచి 11 రోజుల పాటు పలు కీలక కార్యక్రమాలు జరుగుతాయి. అసలు ఈ ఘట్టాన్ని తలుచుకుంటేనే నేను భావోద్వేగానికి లోనవుతున్నాను. నా జీవితంలో ఇలాంటి అనుభూతి కలగడం ఇదే తొలిసారి"
- ప్రధాని నరేంద్ర మోదీ
జీవితంలో ఇలాంటి క్షణాలు చాలా అరుదుగా వస్తాయని, ఇదంతా ఆ దైవ సంకల్పమే అని భావోద్వేగానికి లోనయ్యారు ప్రధాని మోదీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులంతా ఉప్పొంగిపోయే సందర్భమని అన్నారు. ప్రతి చోటా రాముడే కనిపిస్తున్నాడని చెప్పారు.
అయోధ్య ఆలయం ఎత్తు సుమారు 161 అడుగులు. మొత్తం 28000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు మందిరం డిజైన్‌ను రూపొందించి సొంపుర కుటుంబం వెల్లడించింది. ఈ కుటుంబీకులు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 100 ఆలయాలను రూపొందించాట. సోమనాథ ఆలయం, చంద్రకాంత్ సోంపురా ఆలయాల ప్రధాన వాస్తు శిల్పి, అతడి ఇద్దరు కుమారులు ఆశిష్, నిఖిల్ సొంపురాకు సహాయకులుగా పనిచేశారు. ఈ మందిర నిర్మాణ పునాదుల్లో దేశంలోని 2587 ప్రాంతాల నుంచి పవిత్రమైన మట్టిని సేకరించి ఉపయోగించారట. ఝాన్సి, బిథూరి, యమునోత్రి, హల్దీఘటి, ఛత్తోరోర్ఘడ్, గోల్డెన్ టెంపుల్ ఇలా రకరకాల పవిత్ర ప్రాంతాల నుంచి సేకరించిన మట్టిని ఈ మందిర పునాదిలో ఉపయోగించారు. ఆలయ నిర్మాణంలో ఎక్కడా కాంక్రీటు కానీ, ఇనుము కానీ ఉపయోగించలేదు. రాళ్లు మాత్రమే వినియోగించి పూర్తి ఆలయ నిర్మాణం సాగింది. మరో వెయ్యి సంవత్సరాల పాటు ఈ ఆలయానికి మరమత్తులు అవసరం పడకపోవచ్చని నిపుణుల అంచనా.
రామ మందిర వేడుక నేపథ్యంలో ఈ నెల 22న పలు రాష్ట్రాలు 'డ్రై డే'గా (Dry Day) ప్రకటించాయి. ఆ రోజున అయోధ్యతో సహా రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలను మూసివేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు. అలాగే, మాంసం దుకాణాలు సైతం మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక కార్యక్రమం నేపథ్యంలో ఆ రోజున రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అదే బాటలో ఛత్తీస్ గఢ్, అసోం సైతం ఆ రోజును 'డ్రై డే'గా పాటించనున్నారు.
Also Read: Passport: వీసా లేకుండా 62 దేశాలు చుట్టిరావొచ్చు, ఇండియన్ పాస్‌పోర్ట్ ఉంటే చాలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)