అన్వేషించండి

Passport: వీసా లేకుండా 62 దేశాలు చుట్టిరావొచ్చు, ఇండియన్ పాస్‌పోర్ట్ ఉంటే చాలు

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో, 2023లో భారత పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ 83గా ఉంది. 2024లో 80కి మెరుగుపడింది.

Most Powerful Passports in 2024: భారతీయ పాస్‌పోర్ట్ బలం మరోసారి పెరిగింది. ఈ ఏడాది, గ్లోబల్‌ ర్యాంక్‌ల్లో ఇండియన్ పాస్‌పోర్ట్ 3 స్థానాలు ఎగబాకింది, ప్రపంచంలోనే 80వ అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌గా నిలిచింది. 

వీసా లేకుండా 62 దేశాలకు వెళ్లొచ్చు (Visa-free access for 62 countries)
హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ‍‌(Henley Passport Index) తాజా ఎడిషన్‌లో, ఉజ్బెకిస్తాన్‌తో పాటు భారత్‌ 80వ స్థానంలో (India has the 80th most powerful passport in the world) నిలిచింది. మన పాస్‌పోర్ట్‌తో భారతదేశ ప్రజలు 62 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు. ఆ దేశాల్లో.. భూటాన్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌, బార్బడోస్, థాయిలాండ్, జోర్డాన్, మలేషియా, మాల్దీవులు, శ్రీలంక, మారిషస్, ఇండోనేషియా వంటివి ఉన్నాయి.

ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) నుంచి తీసుకున్న ప్రత్యేక సమాచారం ఆధారంగా, లండన్‌కు చెందిన హెన్లీ & పార్ట్‌నర్స్ ఈ సూచీని రూపొందించింద. గ్లోబల్ మొబిలిటీలో ఇటీవలి మార్పులను ఈ ఇండెక్స్‌ ప్రతిబింబిస్తుంది.

ఈ దేశాలకు వెళ్లిన తర్వాత వీసా తీసుకోవచ్చు
భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు 'వీసా ఆన్ అరైవల్' (Visa on arrival) సౌకర్యం కూడా ఉంది. అంటే.. వీసా లేకుండా విదేశానికి వెళ్లిన తర్వాత, అక్కడి విమానాశ్రయంలో వీసా కోసం అప్లై చేసుకోవచ్చు. అక్కడికక్కడే, విమానాశ్రయంలోనే ఆ దేశ వీసా లభిస్తుంది. దీనినే 'వీసా ఆన్ అరైవల్' అంటారు. ఈ దేశాల లిస్ట్‌లో.. కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మయన్మార్, తైమూర్-లెస్టే, ఇరాన్, బొలీవియా, బురుండి, కేప్ వెర్డే ఐలాండ్స్‌, కొమొరో ఐలాండ్స్‌, జిబౌటీ, గాబన్, మడగాస్కర్, సీషెల్స్, మారిషస్, మొజాంబిక్, సియెర్రా లియోన్, సోమాలియా, టాంజానియా, జింబాబ్వే ఉన్నాయి.

భారతదేశం తర్వాత ఉన్న దేశాలు
హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో, 2023లో భారత పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ 83గా ఉంది. 2024లో 80కి మెరుగుపడింది. భారత్‌ తర్వాత... భూటాన్, చాద్, ఈజిప్ట్, జోర్డాన్, వియత్నాం, మయన్మార్, అంగోలా, మంగోలియా, మొజాంబిక్, తజికిస్తాన్, మడగాస్కర్, బుర్కినా ఫాసో, కోట్ డి ఐవరీ, ఈక్వటోరియల్ గినియా, సెనెగల్, అల్జీరియా, కంబోడియా, మాలి దేశాలకు హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో ర్యాంక్‌లు దక్కాయి.

ప్రపంచంలో అత్యంత పవర్‌ఫుల్‌ పాస్‌పోర్ట్‌లు
ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల విషయానికి వస్తే... ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ ఉమ్మడిగా టాప్‌ ర్యాంక్‌లో ఉన్నాయి. ఈ దేశాల ప్రజలు వీసా లేకుండా 194 దేశాలను సందర్శించవచ్చు. వీటి తర్వాత... ఫిన్‌లాండ్, స్వీడన్, దక్షిణ కొరియా 2వ స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పార్ట్‌తో ప్రపంచంలోని 193 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌ ఉంది. ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ పాస్‌పోర్ట్‌లు సంయుక్తంగా థర్డ్‌ ర్యాంక్‌లో ఉన్నాయి, ఈ పాస్‌పోర్ట్‌లతో 192 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు.

అత్యంత బలహీనంగా పాకిస్థాన్ పాస్‌పోర్ట్
డొమినికా, హైతీ, మైక్రోనేషియా, ఖతార్, సెయింట్ విన్సెంట్, ట్రినిడాడ్, టొబాగో, వనాటు పాస్‌పోర్ట్‌లు అత్యంత బలహీన పాస్‌పోర్ట్‌లుగా నిలిచాయి. పొరుగు దేశం పాకిస్థాన్‌ పాస్‌పోర్ట్‌ది ప్రపంచంలోనే నాలుగో బలహీనమైన పాస్‌పోర్ట్. ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ పాస్‌పోర్ట్‌లు కూడా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో అథమ స్థానంలో ఉన్నాయి.

మరో ఆసక్తికర కథనం: బ్యాంక్‌లకు వరుసగా 5 రోజులు సెలవులు, శనివారం నుంచి ప్రారంభం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Happinest : అమరావతి హ్యాపీనెస్ట్ పునరుజ్జీవం – జనవరి నుంచి పనులు ప్రారంభం - సీఆర్‌డీఏ కీలక ప్రకటన
అమరావతి హ్యాపీనెస్ట్ పునరుజ్జీవం – జనవరి నుంచి పనులు ప్రారంభం - సీఆర్‌డీఏ కీలక ప్రకటన
Maoist encounter: ఎన్‌కౌంటర్ అయిన వారిలో దేవ్‌జీ, ఆజాద్ లేరు - లొంగిపోవాలని ఇంటలిజెన్స్ చీఫ్ పిలుపు
ఎన్‌కౌంటర్ అయిన వారిలో దేవ్‌జీ, ఆజాద్ లేరు - లొంగిపోవాలని ఇంటలిజెన్స్ చీఫ్ పిలుపు
AP 10th Class Exam Schedule: ఆంధ్రప్రదేశ్ పదోతరగతి పరీక్ష షెడ్యూల్ రెడీ! పూర్తి సాంకేతికతతో ప్రక్రియ చేపడుతున్న ప్రభుత్వం 
ఆంధ్రప్రదేశ్ పదోతరగతి పరీక్ష షెడ్యూల్ రెడీ! పూర్తి సాంకేతికతతో ప్రక్రియ చేపడుతున్న ప్రభుత్వం 
NRI murder case: అమెరికాలో శశికళ హత్య - భర్తపై అనుమానం - ఎనిమిదిన్నరేళ్లకు దొరికిన అసలు హంతకుడు!
అమెరికాలో శశికళ హత్య - భర్తపై అనుమానం - ఎనిమిదిన్నరేళ్లకు దొరికిన అసలు హంతకుడు!
Advertisement

వీడియోలు

Suma about Her Retirement in Premiste Event | రిటైర్మెంట్ పై సుమ కామెంట్స్ | ABP Desam
BJP Madhavi Latha on SS Rajamouli : రాజమౌళి హనుమాన్ కామెంట్స్ పై మాధవీలత రియాక్షన్ | ABP Desam
WTC Final India | టీమిండియా టెస్ట్ చాంపియన్‌ షిప్ ఫైనల్ చేరాలంటే ఇదొక్కటే దారి
Ind vs SA Shubman Gill | రెండు టెస్ట్‌‌లో గిల్ ఆడటంపై అనుమానాలు.. అతడి ప్లేస్‌లో మరొకరు?
Dinesh Karthik Comments on Gambhir | గంభీర్.. అతడి కెరీర్ నాశనం చేస్తున్నావ్!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Happinest : అమరావతి హ్యాపీనెస్ట్ పునరుజ్జీవం – జనవరి నుంచి పనులు ప్రారంభం - సీఆర్‌డీఏ కీలక ప్రకటన
అమరావతి హ్యాపీనెస్ట్ పునరుజ్జీవం – జనవరి నుంచి పనులు ప్రారంభం - సీఆర్‌డీఏ కీలక ప్రకటన
Maoist encounter: ఎన్‌కౌంటర్ అయిన వారిలో దేవ్‌జీ, ఆజాద్ లేరు - లొంగిపోవాలని ఇంటలిజెన్స్ చీఫ్ పిలుపు
ఎన్‌కౌంటర్ అయిన వారిలో దేవ్‌జీ, ఆజాద్ లేరు - లొంగిపోవాలని ఇంటలిజెన్స్ చీఫ్ పిలుపు
AP 10th Class Exam Schedule: ఆంధ్రప్రదేశ్ పదోతరగతి పరీక్ష షెడ్యూల్ రెడీ! పూర్తి సాంకేతికతతో ప్రక్రియ చేపడుతున్న ప్రభుత్వం 
ఆంధ్రప్రదేశ్ పదోతరగతి పరీక్ష షెడ్యూల్ రెడీ! పూర్తి సాంకేతికతతో ప్రక్రియ చేపడుతున్న ప్రభుత్వం 
NRI murder case: అమెరికాలో శశికళ హత్య - భర్తపై అనుమానం - ఎనిమిదిన్నరేళ్లకు దొరికిన అసలు హంతకుడు!
అమెరికాలో శశికళ హత్య - భర్తపై అనుమానం - ఎనిమిదిన్నరేళ్లకు దొరికిన అసలు హంతకుడు!
New Rent Rules: ఇల్లు అద్దెకు ఇస్తున్నారా? పోనీ తీసుకుంటున్నారా? - అద్దె ఒప్పందాల్లో కొత్త రూల్స్ వచ్చేశాయ్ - తెలుసుకోకపోతే నష్టపోతారు  !
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా? పోనీ తీసుకుంటున్నారా? - అద్దె ఒప్పందాల్లో కొత్త రూల్స్ వచ్చేశాయ్ - తెలుసుకోకపోతే నష్టపోతారు !
Prime Minister Modi Puttaparthi tour: ప్రధాని మోదీ పుట్టపర్తి పర్యటన - ఏపీ బీజేపీ నేతల్లో జోష్
ప్రధాని మోదీ పుట్టపర్తి పర్యటన - ఏపీ బీజేపీ నేతల్లో జోష్
Deepika Padukone: ప్రభాస్ సినిమాలు అక్కర్లేదా... మరి షారుఖ్, బన్నీవి ఎందుకు? దీపిక కామెంట్స్‌తో కొత్త కాంట్రవర్సీ
ప్రభాస్ సినిమాలు అక్కర్లేదా... మరి షారుఖ్, బన్నీవి ఎందుకు? దీపిక కామెంట్స్‌తో కొత్త కాంట్రవర్సీ
Bandi Sanjay About Naxalism: నక్సలైట్లు అడవుల్లో చస్తుంటే... అర్బన్ నక్సల్స్ పదవులు అనుభవిస్తున్నారు: బండి సంజయ్
నక్సలైట్లు అడవుల్లో చస్తుంటే... అర్బన్ నక్సల్స్ పదవులు అనుభవిస్తున్నారు: బండి సంజయ్
Embed widget