అన్వేషించండి

Karnataka Muda scam: సిద్దరామయ్య ప్లాట్లు తిరిగిచ్చేసినా వదలని ఈడీ - మైసూరులో వరుసగా రెండో రోజూ సోదాలు !

CM Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్దరామయ్యను ఈడీ వదిలి పెట్టడం లేదు. భూములు తిరిగి ఇచ్చేసి హమ్మయ్య అనుకున్నా ఈడీ మాత్రం సోదాలు చేసేస్తోంది.

Karnataka Muda scam ED raids continue : కర్ణాటక రాజకీయాల్లో  ముడా స్కాం వ్యవహారం ఇప్పటికీ కలకలం రేపుతోంది. ఈడీ కేసు నమోదు చేసిన తర్వాత కొన్నిరోజులు సైలెంట్ గా ఉంది. తాజాగా ఈడీ మైసూరులో ముడా కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తోంది. ఆ సోదాలు వరుసగా రెండో రోజూ కొనసాగుతున్నాయి. ముడా స్కాంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ అనుమానిస్తోంది. ఈ సోదాల తర్వాత కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. 

ముడా ప్లాట్లను అక్రమంగా పొందారని  సిద్దారమయ్యపై ఆరోపణలు               

మైసూర్ అర్బన్  డెవలప్‌మెంట్ అధారిటీ మైనసూరులో డెలవప్ చేసిన ఓ వెంచర్ లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్యకు ప్లాట్లు కేటాయించారు. ఎందుకంటే.. సిద్ధరామయ్య స్వగ్రామంలో ఆయన భార్యకు చెందిన భూమిని ముడా తీసుకుంది. దానికి ప్రతిఫలంగా అత్యంత విలువైన భూములు ఇచ్చారన్నది ఆరోపణ. సిద్దరామయ్య స్వగ్రామం కూడా మైసూరుకు సమీపంలోనే ఉంటుంది. ఈ విషయంపై విజిల్ బ్లోయర్లు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణకు అనుమతి ఇచ్చారు. లోకాయక్త విచారణకు రెడీ కావడంతో ఇదందా రాజకీయ కుట్ర అని సిద్దరామయ్య హైకోర్టుకు వెళ్లారు. కానీ హైకోర్టు విచారణకు అనుమతి ఇచ్చింది. 

జీతం మూడు కోట్లు - వెయ్యి రూపాయలకు కక్కుర్తి పడి ఉద్యోగం పోగొట్టుకున్నారు ! మెటాలో వీళ్లే బలిపశువులు

ప్లాట్లు తిరిగి ఇచ్చినా ఈడీ కేసు నమోదు                            

చివరికి లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు ఆధారంగా ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థను తనను టార్గెట్ చేస్తున్నాయని అనుకుంటున్న సిద్దరామయ్య వెంటనే వ్యూహాత్మకంగా ఆలోచించారు. తన భార్యకు ముడా కేటాయించిన  ప్లాట్లు అన్నీ తిరిగి ఇచ్చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ముడా అధికారులు కూడా అంగీకరించారు. దీంతో కేసు క్లోజ్ అయిపోయిందని సిద్దరామయ్య ఊపిరి పీల్చుకున్నారు. కానీ అసలు కేసు ఇంకా ఉందని ఈడీ రంగంలోకి దిగిపోయింది. ముడా కార్యాలయాల్లో సోదాల్లో ఏం బయటపడుతుందో కానీ కర్ణాటక రాజకీయవర్గాల్లో మాత్రం ఈ కేసు హాట్ టాపిక్ గా మారింది.         

బాంబులు పేల్చేందుకు కిమ్‌కు కూడా ఉబలాటమే - దక్షిణ కొరియాను రెచ్చగొట్టే పనులు షురూ !

మనీలాండరింగ్ ఆధారాలు దొరికితే సిద్దరామయ్యకు  మరిన్ని చిక్కులు              

మామూలుగా ముడా ప్లాట్లను అక్రమంగా కేటాయించారా లేదా అన్నదానిపై ఈడీ దర్యాప్తు చేయదు. ఈ మొత్తం వ్యవహారంలో నేరపూరితమైన లావాదేవీలు, అక్రమ నగదు చెలామణి ఏమైనా ఉంటే కేసులు నమోదు  చేస్తుంది. అయితే  ఈ వ్యవహారంలో భూమి తీసుకుని ప్లాట్లు కేటాయించారు తప్ప ఎక్కడా నగదు లావాదేవీలు లేవని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి రాజకీయ కుట్ర పూరితంగానే ఈ కేసులు పెట్టారని అంటున్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Realme 14x 5G: రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Embed widget