News
News
X

Hijab Ban Verdict: హిజాబ్‌పై సుప్రీం భిన్న తీర్పులు- ఎటూ తేల్చని సర్వోన్నత న్యాయస్థానం!

Hijab Ban Verdict: హిజాబ్‌ వివాదంపై సుప్రీం ధర్మాసనం భిన్నమైన తీర్పులు ఇచ్చింది.

FOLLOW US: 
 
Hijab Ban Verdict: కర్ణాటక హిజాబ్​ వివాదంపై సుప్రీం కోర్టు ఎటూ తేల్చలేదు. ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన తీర్పులు ఇచ్చారు. హిజాబ్​పై కర్ణాటక ప్రభుత్వ నిషేధాన్ని కొనసాగించేలా ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించారు. ఈ వివాదంపై దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని ప్రతిపాదించారు.

News Reels

మరోవైపు జస్టిస్ సుధాన్షు ధూలియా ఇందుకు భిన్నంగా తీర్పు రాశారు. కర్ణాటక హైకోర్టు తీర్పును పక్కనబెడుతూ హిజాబ్ బ్యాన్​పై అపీళ్లను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది కేవలం ఛాయిస్ మాత్రమేనని, అంతకంటే ఎక్కువ లేదా తక్కువ కాదని జస్టిస్ సుధాన్షు ధూలియా అన్నారు.

సుప్రీం న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు ఇవ్వడంతో ఈ వ్యవహారాన్ని త్రిసభ్య ధర్మాసనానికి లేదా విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి తీసుకోవాలి. 

కర్ణాటక హైకోర్టు తీర్పు

విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించకూడదనే వివాదంపై దాఖలైన పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. స్కూళ్లు, కాలేజీల్లోకి హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. 

ఈ కేసులో 10 రోజుల పాటు వాదనలు సాగగా, పిటిషనర్ల తరఫున 21 మంది న్యాయవాదులు, ప్రతివాదుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్, కర్ణాటక అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవాద్గీ వాదించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు ఇంతకుముందు తన తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం తీర్పును వెలువరించింది.

ఇదీ వివాదం

కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హిజాబ్ వివాదంపై రెండు వర్గాల విద్యార్థులు పోటాపోటీగా నిరససలు చేశారు. ముస్లిం విద్యార్థినిలు హిజాబ్ ధరించి  రావడాన్ని వ్యతిరేకిస్తూ హిందూ విద్యార్థులు కాషాయ కండువాలతో విద్యా సంస్థలకు హాజరుకావడంతో వివాదం రాజుకుంది.

కర్ణాటక ఉడిపి జిల్లాలో ఓ ప్రభుత్వ కాలేజీలో మొదలైన ఈ వివాదం క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించింది. దీంతో ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హిజాబ్ అనేది ముస్లిం ఆచారాల్లో తప్పనిసరి కాదంటూ తీర్పు చెప్పింది. విద్యార్థులు హిజాబ్ ధరించి విద్యాసంస్థలకు రావడాన్ని తప్పుపట్టింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును కొట్టివేయాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు.

Also Read: Viral Video: ఎంత కొడితే అంత మద్యం- చేతి పంపు మహత్యం! అవాక్కయిన పోలీసులు!

Published at : 13 Oct 2022 10:54 AM (IST) Tags: hijab controversy Hijab Ban Hijab Ban Verdict Karnataka Hijab Ban Karnataka Hijab Ban Verdict Hijab Supreme Court Verdict

సంబంధిత కథనాలు

Bansilalpet Stepwell : పర్యాటక హంగులతో బన్సీలాల్ పేట్ మెట్ల బావి, ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Bansilalpet Stepwell : పర్యాటక హంగులతో బన్సీలాల్ పేట్ మెట్ల బావి, ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Dating App Cheating: డేటింగ్‌ యాప్స్‌లో కొత్త రకం మోసాలు, కిడ్నాప్‌ అవుతున్న యువకులు, ఉద్యోగులు!

Dating App Cheating: డేటింగ్‌ యాప్స్‌లో కొత్త రకం మోసాలు, కిడ్నాప్‌ అవుతున్న యువకులు, ఉద్యోగులు!

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు

Nuzvid Police Station : నూజివీడు పోలీస్ స్టేషన్ పై మహిళలు దాడి, భారీగా పోలీసుల మోహరింపు!

Nuzvid Police Station : నూజివీడు పోలీస్ స్టేషన్ పై మహిళలు దాడి, భారీగా పోలీసుల మోహరింపు!

గర్భం దాల్చేందుకు పల్లెటూరికి విదేశీ యువతులు క్యూ! మగాళ్లకు డబ్బులిచ్చి మరీ గర్బధారణ !

గర్భం దాల్చేందుకు పల్లెటూరికి విదేశీ యువతులు క్యూ! మగాళ్లకు డబ్బులిచ్చి మరీ గర్బధారణ !

టాప్ స్టోరీస్

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం  - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!

NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!

NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!