![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Karnataka Election Results 2023: ట్రెండ్ ఫాలో అవుతున్న కన్నడ ఓటర్లు! అధికారంలో ఉన్న పార్టీకి గుడ్‌బై!
Karnataka Election Results 2023: అధికారంలో ఉన్న పార్టీకి మరోసారి అధికారం కట్టబెట్టని కర్ణాటక ఓటర్లు ఇప్పుడూ అదే ట్రెండ్ కొనసాగించనున్నారు.
![Karnataka Election Results 2023: ట్రెండ్ ఫాలో అవుతున్న కన్నడ ఓటర్లు! అధికారంలో ఉన్న పార్టీకి గుడ్‌బై! Karnataka Election Results 2023 No Government Has Been Re-Elected in Karnataka Since 1985 Karnataka Election Results 2023: ట్రెండ్ ఫాలో అవుతున్న కన్నడ ఓటర్లు! అధికారంలో ఉన్న పార్టీకి గుడ్‌బై!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/13/8cdb91f662e0bb1331891bf706a45b7b1683954037293517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Karnataka Election Results 2023:
1985 నుంచి ఇంతే..
కర్ణాటక ఎన్నికల ఫలితాల విషయంలో ఒపీనియన్ పోల్స్,ఎగ్జిట్ పోల్స్ చెప్పిందే నిజమవుతోంది. కాంగ్రెస్ సెంచరీని దాటడమే కాదు...మేజిక్ ఫిగర్‌ని మించి లీడ్‌లో దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఈ ఎలక్షన్ ఫైట్‌లో చివరికి కాంగ్రెస్ గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. హంగ్ వస్తుందని కొందరు ఊహించినప్పటికీ...వార్ వన్ సైడ్ అయిపోయింది. ఇదంతా పక్కన పెడితే కర్ణాటక ఎన్నికలు ఎప్పుడూ ఇలా ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి. కన్నడ ఓటర్ల మనసు గెలుచుకోవడం అంత సులభం కాదు. ఈవీఎమ్ దగ్గర మీట నొక్కేంత వరకూ వాళ్ల మూడ్ ఎలా ఉంటుందో తెలియదు. ఓ సారి ఓ పార్టీకి అధికారం కట్టబెట్టారంటే..మరోసారి అదే ప్రభుత్వానికి అవకాశమివ్వరు. ఇది ఇప్పుడు కాదు. 1985 నుంచి వస్తున్న ట్రెండ్. అప్పటి నుంచి 7 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ 7 సార్లు కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాలేదు. మరోసారి అవకాశం ఇద్దాం అని జాలి చూపించరు. నచ్చకపోతే సింపుల్‌గా మరో పార్టీకి ఓటువేసేస్తారు. ఈ సారి కూడా అదే ట్రెండ్ కొనసాగనున్నట్టు స్పష్టమవుతోంది. 2018 ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లుగెలుచుకుంది. కాంగ్రెస్‌కు 80 సీట్లు వచ్చాయి. జేడీఎస్‌కి 37 సీట్లు దక్కాయి. అయితే...అప్పుడు కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. కానీ...ఏడాది తరవాత సీన్ మారిపోయింది. కాంగ్రెస్, జేడీఎస్ మధ్య విభేదాలొచ్చాయి. క్రమంగా కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీన్ని క్యాష్ చేసుకున్న బీజేపీ కొందరు ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుని ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అలా...సౌత్‌లో కర్ణాటకలో అధికారంలోకి వచ్చి దక్షిణాది మొత్తం విస్తరించాలని ప్లాన్ చేసుకుంది.
ఆ రెండు కమ్యూనిటీల చుట్టూ..
మరోసారి ఇక్కడ సీన్ రివర్స్ అయింది. బీజేపీ సౌత్ మిషన్‌పై నీళ్లు చల్లుతూ ట్రెండ్ కొనసాగించారు కన్నడ ఓటర్లు. అధికారంలో ఉన్న బీజేపీని కాదని కాంగ్రెస్‌కి ఓటు వేశారు. జేడీఎస్‌కి కూడా చెప్పుకునే స్థాయిలో సీట్లు వచ్చే అవకాశాలే ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్‌కి మేజిక్ ఫిగర్ రాకపోతే...అప్పుడు మళ్లీ జేడీఎస్ కింగ్‌మేకర్ అవుతుంది. కాంగ్రెస్‌కి రాష్ట్రవ్యాప్తంగా ఓటు బ్యాంకు ఉంది. బీజేపీ విషయానికొస్తే మాత్రం కేవలం నార్త్, సెంట్రల్ జిల్లాల్లోనే లింగాయత్‌లు ఎక్కువగా ఉన్న చోట బలం ఉంది. జేడీఎస్‌కి ఓల్డ్ మైసూర్ లాంటి సౌత్ కర్ణాటకలో ఎక్కువ క్యాడర్ ఉంది. ఇలా ఒక్కో పార్టీకి ఒక్కో విధమైన ఓటు బ్యాంకు ఉండటం వల్ల ఇక్కడి ఎన్నికలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. బీజేపీకి లింగాయత్‌ల సపోర్ట్ ఉంటే...జేడీఎస్‌కి వక్కళిగల మద్దతు ఉంటుంది. అయితే...కాంగ్రెస్‌కి మాత్రం ఇలా సెపరేట్ ఓటు బ్యాంక్ అంటూ ఏమీ లేదు. అందుకే...ఓట్లు ఎక్కువగా వచ్చినప్పటికీ సీట్ల విషయానికొస్తే మాత్రం ఒక్కోసారి వెనకబడిపోతుంది. 2004 ఎన్నికల్లో ఇదే జరిగింది. బీజేపీ కన్నా 7% ఎక్కువగా ఓట్లు వచ్చినప్పటికీ...కాంగ్రెస్ కన్నా 14 సీట్లు ఎక్కువగా గెలుచుకుంది బీజేపీ. ఇలా చిత్ర విచిత్రంగా సాగుతాయి అక్కడి ఎన్నికలు. లింగాయత్‌లు, వక్కళిగలు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్లే అధికారంలోకి వస్తారు. ఈ కుల సమీకరణలు ఎప్పటికప్పుడు మారుతున్న కారణంగానే...అక్కడి ప్రభుత్వాలూ తరచూ మారిపోతుంటాయి. 1978 వరకూ కర్ణాటకలో కాంగ్రెస్‌దే హవా. ప్రతిసారి మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1983 తరవాత కర్ణాటక ఎన్నికల సరళి పూర్తిగా మారిపోయింది. ఈ 7 దశాబ్దాల్లో దాదాపు 4 దశాబ్దాల పాటు కర్ణాటకను ఏలింది కాంగ్రెస్. ఈ సారి అధికారంలోకి వచ్చి ఆ రికార్డుని కొనసాగించాలని చూస్తోంది ఆ పార్టీ.
Also Read: Karnataka Election Results 2023: హంగ్ లేనట్టే! క్లారిటీతో ఉన్న కర్ణాటక ఓటర్లు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)