Karnataka Cabinet: సిద్దరామయ్య వద్దే ఆర్థిక శాఖ, డీకే శివకుమార్‌కి నీటి పారుదల - కర్ణాటక కేబినెట్ విస్తరణ
Karnataka Cabinet: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ విస్తరణ పూర్తైంది.
Karnataka Cabinet:
24 మంది ప్రమాణ స్వీకారం..
కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారం రోజులకు కాంగ్రెస్ కేబినెట్ విస్తరణ చేపట్టింది. ఇందులో భాగంగా 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎవరెవరికి ఏ పోర్ట్‌ఫోలియో ఇస్తారో అన్న ఇన్నాళ్లు ఉత్కంఠకు తెర పడింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆర్థిక శాఖను తన వద్దే ఉంచుకున్నారు. ఇంటిలిజెన్స్ విభాగమూ సిద్దరామయ్యకే కేటాయించారు. ఇక ముఖ్యమంత్రి రేసులో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించిన జి పరమేశ్వరకు మంచి పదవే కట్టబెట్టారు. హోం మంత్రి బాధ్యతలు అప్పగించారు. డిప్యుటీ సీఎం డీకే శివ కుమార్‌కి భారీ, మధ్య తరహా నీటిపారుదల శాఖను కేటాయించారు. దీంతో పాటు బెంగళూరు సిటీ డెవలప్‌మెంట్ బాధ్యతలూ ఇచ్చారు. హెచ్‌కే పాటిల్ లా అండ్ పార్లమెంటరీ వ్యవహారాలు, దినేశ్ గుండు రావ్‌కి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కృష్ణ బైరె గౌడకు రెవెన్యూ శాఖలు కేటాయించారు. కర్ణాటక ప్రభుత్వంలో మొత్తం 34 మంది మంత్రులు ఉంటారు. గత వారమే 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ లిస్ట్‌ని ఫైనలైజ్ చేసే ముందు సిద్దరామయ్య, డీకే శివ కుమార్ హైకమాండ్‌తో విస్తృత చర్చలు జరిపారు. దాదాపు మూడు రోజులుగా అక్కడే ఉన్నారు. మంత్రులుగా ఎవరికి అవకాశం ఇవ్వాలో తుది నిర్ణయం తీసుకుని...ఆ జాబితా విడుదల చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ లిస్ట్‌ని ఫైనలైజ్ చేశారు. అయితే...ఈ విషయంలో సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య కాస్త విభేదాలు తలెత్తినప్పటికీ చివరకి ఇద్దరూ వెనక్కి తగ్గారు. ఆ తరవాత సోనియా గాంధీని కలిసి ఆ జాబితాకి ఆమోద ముద్ర వేయించుకున్నారు.
CLARIFICATION | The list of #KarnatakaCabinet portfolio has been taken down since discrepancies were noted with the list currently with Raj Bhavan. pic.twitter.com/tA64J4z1hk
— ANI (@ANI) May 27, 2023
Karnataka Cabinet expansion | Bengaluru: Congress leader HK Patil, Krishna Byregowda take oath as Karnataka Minister pic.twitter.com/VM6d9OLRT8
— ANI (@ANI) May 27, 2023
ನೂತನ ಸಂಪುಟ ಸಚಿವರ ಪ್ರಮಾಣ ವಚನ ಸ್ವೀಕಾರ ಸಮಾರಂಭದ ಕೆಲವು ಸ್ಮರಣೀಯ ಕ್ಷಣಗಳು. pic.twitter.com/YPbZh83p75
— Siddaramaiah (@siddaramaiah) May 27, 2023
తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్. హిమాచల్, కర్ణాటక ఇచ్చిన జోష్‌తోనే ఈ ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికే యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంది. మే 24వ తేదీన కాంగ్రెస్ హైకమాండ్ కీలక భేటీకి పిలుపునిచ్చింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేయనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. పదవుల కోసం పోరాటాల వల్ల దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ల్ అంతర్గత విభేదాలు తలెత్తుతున్నాయి. కర్ణాటకలోనూ ఇదే తప్పదని బీజేపీ నేతలు గట్టిగానే విమర్శించారు. కానీ...హైకమాండ్ చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరించింది. సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా పవర్ షేరింగ్ చేసింది. వాళ్లను బుజ్జగించింది.
Also Read: New Parliament Building: రాజస్థాన్ రాళ్లు మీర్జాపూర్ కార్పెట్లు, నాగ్‌పూర్ టేకు - పార్లమెంట్ తయారీకి వాడిన మెటీరియల్ ఇదే