Kichcha Sudeep Threat: కిచ్చ సుదీప్‌కు బెదిరింపు లేఖ, ప్రైవేట్ వీడియోలు బయట పెడతామంటూ వార్నింగ్
Kichcha Sudeep Threat: కన్నడ నటుడు కిచ్చ సుదీప్‌కు బెదిరింపు లేఖ వచ్చింది.
Kichcha Sudeep Threat:
బెదిరింపు లేఖ..
ప్రముఖ కన్నడ నటుడు కిచ్చ సుదీప్ బీజేపీ కండువా కప్పుకోనున్నారు. మరి కొద్ది రోజుల్లోనే కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సుదీప్‌ను స్టార్ క్యాంపెయినర్‌గా వాడుకోవాలని చూస్తోంది బీజేపీ. అయితే...ఆయన ఎన్నికల్లోనూ పోటీ చేస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. దీనిపై సుదీప్ క్లారిటీ ఇచ్చారు. కేవలం తాను ప్రచారానికే పరిమితమవుతానని, ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కిచ్చ సుదీప్ బీజేపీలో చేరుతున్నారని తెలియగానే ఆయనకో బెదిరింపు లేఖ వచ్చింది. ప్రైవేట్ వీడియోలు బయట పెడతానంటూ బెదిరించారు. సుదీప్ మేనేజర్‌కు ఈ లెటర్ వచ్చింది. వెంటనే అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం...సుదీప్ మేనేజర్ జాక్ మంజుకి సోషల్ మీడియాలో ఓ లెటర్ వచ్చింది. ఆ మెసేజ్ చూసిన మేనేజర్ షాక్ అయ్యాడు. "సుదీప్ ప్రైవేట్ వీడియోలున్నాయి. వాటిని బయట పెడతాం" అంటూ బెదిరించారు ఆ గుర్తు తెలియన వ్యక్తి. వెంటనే పుత్తెనహళ్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పోలీసులు దీనిపై విచారణ చేపడుతున్నారు.
"నాకు బెదిరింపు లేఖ వచ్చిన మాట వాస్తవమే. అది ఎవరు పంపారో కూడా నాకు తెలుసు. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే ఈ పని చేశాడు. దీనికి కచ్చితంగా గట్టి బదులు ఇస్తాను. కష్టకాలంలో నాకు అండగా నిలిచిన వాళ్ల వైపే నేను ఎప్పటికీ నిలబడతాను ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైకు నా పూర్తి మద్దతు ఉంటుంది."
- కిచ్చ సుదీప్, సినీ నటుడు
I will only campaign for the BJP, not contest the elections: Kannada actor Kichcha Sudeepa, in Bengaluru pic.twitter.com/tw5oewOAXd
— ANI (@ANI) April 5, 2023
Yes, I have received a threat letter and I know who sent it to me. I know it is from someone in the film industry. I will give a befitting reply to them. I will work in favour of those who stand by my side in my tough times: Kannada actor Kichcha Sudeep pic.twitter.com/yjX8mZGkKW
— ANI (@ANI) April 5, 2023
"I give my support to respected Bommai sir," says Kannada actor Kichcha Sudeep with Karnataka CM Basavaraj Bommai in Bengaluru. pic.twitter.com/8Uzodzm28g
— ANI (@ANI) April 5, 2023
మే 10న ఎన్నికలు..
కర్ణాటకలో ఎన్నికల తేదీలను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. మే 10న ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. మే 13న ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ సారి బీజేపీ గెలవడం కష్టమే అన్న వాదనలతో పాటు కాంగ్రెస్ నిలదొక్కుకోవడం కష్టమే అని మరి కొందరు వాదిస్తున్నారు. ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో రెండు వేరు వేరు పార్టీలకు అధికారాన్ని కట్టబెట్టారు ఓటర్లు. హిమాచల్‌లో మోదీ మేజిక్ వర్కౌట్ అవ్వలేదు. కానీ...కర్ణాటకలో మాత్రం కచ్చితంగా ప్రధాని మోదీ చరిష్మా ప్రభావం చూపుతుందని బీజేపీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. ఎక్కడ ఎన్నికలు జరిగినా మోదీయే స్టార్ క్యాంపెయినర్‌గా ఉంటారు. ర్యాలీలు, సభలతో బిజీబిజీగా గడిపేస్తారు. కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించడాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాని మోదీ...ఇక్కడా భారీగా ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. కనీసం 20 ర్యాలీలు చేసేందుకు పార్టీ ప్లాన్ చేస్తోంది. మే 10న ఎన్నికల జరగనున్నాయి. అయితే...చివరిత విడత ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే అవకాశాలున్నాయి. అంటే...మే 6-8వ తేదీ వరకూ రాష్ట్రంలోనే పర్యటించనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ప్రచారం చేసేలా ప్లాన్ చేస్తోంది కర్ణాటక బీజేపీ.
Also Read: Coronavirus Cases India: రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మృతుల సంఖ్యా పెరుగుతోంది!