Kalicharan Maharaj Arrest: ఆధ్యాత్మిక గురువు కాళీచరణ్ అరెస్ట్.. గాంధీపై అనుచిత వ్యాఖ్యలే కారణం
మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆధ్యాత్మిక గురువు కాళీచరణ్ మహరాజ్‌ను ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆధ్యాత్మిక గురువు కాళీచరణ్ మహరాజ్‌ను ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మధ్యప్రదేశ్ వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
#BREAKING | महात्मा गांधी का अपमान करने वाला कालीचरण महाराज गिरफ्तार
— ABP News (@ABPNews) December 30, 2021
- रायपुर के SP प्रशांत अग्रवाल ने गिरफ़्तारी पर दी पूरी जानकारी@gyanendrat1 @brajeshabpnews @AdarshJha001 @aparna_journo @Sheerin_sherry#KalicharanMaharaj #KalicharanArrested #DharmSansad #MahatmaGandhi pic.twitter.com/GbOsYO2ZIV
పక్కా సమాచారం..
మధ్యప్రదేశ్ ఖజురహో నగరానికి 25 కిలోమీటర్ల దూరంలోని బగేశ్వర్ ధామ్‌లో కాళీచరణ్ మహరాజ్ ఉన్నట్లు రాయ్‌పుర్ పోలీసులకు సమాచారం అందింది. గురువారం తెల్లవారు జామున 4 గంటలకు కాళీచరణ‌్ మహరాజ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు రాయ్‌పుర్ ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు. గురువారం సాయంత్రానికి రోడ్డు మార్గంలో రాయ్‌పుర్‌కు తరలిస్తామని చెప్పారు.
వివాదాస్పద వ్యాఖ్యలు..
రాయ్‌పుర్‌లో నిర్వహించిన రెండు రోజుల ధరణ్ సన్సద్ కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు కాళీచరణ్ మహరాజ్. మతాన్ని కాపాడుకునేందుకు హిందూ నేతను ప్రభుత్వాధినేతగా ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. గాంధీజీని దూషిస్తున్నందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదన్నారు. ఈ వ్యాఖ్యలపై రాయ్‌పూర్ పోలీసులు ఐపీసీ 505(2), 294 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
Also Read: Covid 19 Cases in India: దేశంలో భారీగా పెరిగిన కరోనా వ్యాప్తి.. 1000కి చేరువైన ఒమిక్రాన్ కేసులు
Also Read: Gold-Silver Price: పసిడి ప్రియులకు శుభవార్త! పడిపోయిన బంగారం ధర.. వెండి స్థిరంగా.. నేటి రేట్లు ఇవీ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.