Covid 19 Cases in India: దేశంలో భారీగా పెరిగిన కరోనా వ్యాప్తి.. 1000కి చేరువైన ఒమిక్రాన్ కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 13,154 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1000కు చేరువైంది. ప్రస్తుతం మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 962కు పెరిగింది.
గత 24 గంటల్లో దిల్లీ, మహారాష్ట్రలో చెరో 250కి పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దిల్లీలో 263 కేసులు నమోదుకాగా మహారాష్ట్రలో 252 కేసులు వెలుగుచూశాయి.
రాష్ట్రాల వారీగా..
కరోనా కేసులు..
రోజువారి కరోనా కేసులు కూడా భారీగా పెరిగాయి. కొత్తగా 13,154 కరోనా కేసులు నమోదయ్యాయి. 268 మంది వైరస్‌తో మృతి చెందారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1 శాతం కంటే తక్కువే ఉన్నాయి. రికవరీ రేటు 98.38 శాతంగా ఉంది.
డబుల్..
ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో దిల్లీ, ముంబయిలో ఒమిక్రాన్ కేసులు డబుల్ అయ్యాయి. దీంతో పలు రాష్ట్రాలు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాయి. దిల్లీ సర్కార్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజా రవాణాపై ఆంక్షలు విధించింది. విద్యాసంస్థలు, జిమ్‌లను మూసివేసింది. దిల్లీ మెట్రో, బస్సు సర్వీసులను 50 శాతం సామర్థ్యంతోనే నడపాలని ఆదేశించింది.
వ్యాక్సినేషన్..
దేశంలో టీకా పంపిణీ వేగంగా కొనసాగుతోంది. బుధవారం మరో 63,91,282 మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 144 కోట్లు దాటింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.