By: ABP Desam | Updated at : 16 Mar 2022 09:19 PM (IST)
Image Credit: Pixabay
Japan Earthquake | జపాన్‌లో బుధవారం భారీ భూకంపం ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. ఉత్తర జపాన్‌లోని ఫుకుషిమా కేంద్రంగా భూకంపం ఏర్పడినట్లు సమాచారం. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.3 మెగ్నిట్యూడ్‌గా నమోదైంది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో సుమారు 60 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం ఏర్పడినట్లు జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. తదుపరి సమాచారం ఇంకా అందాల్సి ఉంది.
జపాన్‌లో సరిగ్గా ఇదే నెల.. 2011 మార్చి 11న కూడా భారీ భూకంపం ఏర్పడింది. జపాన్‌కు తూర్పున గల ఓషికాకు 70 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేలుపై 9 తీవ్రతతో సముద్ర గర్భంలో 24 కిలోమీటర్ల లోతులో భూకంపం ఏర్పడింది. భూకంపం ఏర్పడిన 20 నిమిషాల్లోనే భారీ సునామీ విరుచుకుపడింది. ప్రజలు ఆ ప్రాంతాలను ఖాళీ చేయడానికి కూడా సమయం దొరకలేదు. అలల బీభత్సానికి ఇళ్లు పేక మేడల్లా కూలిపోయాయి. ఫలితంగా ఆ రోజు 15 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అది ప్రపంచంలోనే 4వ భారీ భూకంపం.
ఇప్పుడు కూడా సముద్రం గర్భంలోనే భూకంపం ఏర్పడింది. దీంతో తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పుడే చెప్పడం కష్టం. ప్రస్తుతమైతే అధికారులు అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నట్లు సమాచారం. భూకంపం వల్ల రెండు మిలియన్ల ఇళ్లకు పవర్ కట్ అయినట్లు టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ వెల్లడించింది. దీంతో ప్రజలు చీకట్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. జపాన్ భూకంప తీవ్రతను ఈ కింది వీడియోల్లో చూండండి.
WATCH: JAPAN EARTHQUAKE POWER GOES OUT
Full video:https://t.co/wIaGls2f3J pic.twitter.com/5KMJ3BgBXg— Zockerfreak (@ZockerfreakYT) March 16, 2022
Earthquake Detailed Report – 3/16
— NERV (@EN_NERV) March 16, 2022
At around 11:36pm, an earthquake with a magnitude of 7.3 occurred offshore Fukushima Prefecture at a depth of 60km. The maximum intensity was 6+. Tsunami warnings/advisories have been issued. #earthquake pic.twitter.com/YkDL16JNSO
WATCH: Shaking, power outages, and flashes in the sky as 2 strong earthquakes hit central Japan pic.twitter.com/d7z9CsJzvI
— BNO News (@BNONews) March 16, 2022
#BREAKING 2
— ♆ABYSS ℭ 𝔥 𝔯 𝔬 𝔫 𝔦 𝔠 𝔩 𝔢 𝔰 (@AbyssChronicles) March 16, 2022
⭕ ⚠️🌊 A Powerful 7.3 magnitude #earthquake hits north #Japan, #tsunami alert issued#Fukushima
📰 https://t.co/5vKxdEUgnS
Wed Mar 16 2022
🔱 𝖠 𝖡 𝖸 𝖲 𝖲 ℭ𝔥𝔯𝔬𝔫𝔦𝔠𝔩𝔢𝔰 | 𝙳𝚘𝚘𝚖 𝙽𝚎𝚠𝚜 pic.twitter.com/j8P6HS0roC
WATCH: Woman captures the moment 2 strong earthquakes hit off central #Japan pic.twitter.com/qr2mPBvDrp
— GBN (@GBNfeed) March 16, 2022
BREAKING: Live cam captures shaking as strong earthquake hits Tokyo, Japan pic.twitter.com/UqEZdEKoKy
— Insider Paper (@TheInsiderPaper) March 16, 2022
Delhi Dog Man : కుక్క వాకింగ్ కోసం స్టేడియం ఖాళీ - ఢిల్లీలో ఐఏఎస్ అఫీసర్ నిర్వాకం !
Kodali Nani : చిన్న పిల్లల్ని రెచ్చగొట్టి రోడ్లపైకి పంపారు, పవన్ కల్యాణ్ పై కొడాలి నాని హాట్ కామెంట్స్
Karimnagar News : కస్తూర్బా స్కూల్స్ లో ఉద్యోగాలని నకిలీ అపాయింట్మెంట్ లెటర్స్, లక్షల్లో మోసపోయిన నిరుద్యోగులు
TRS Leaders On Modi: తెలంగాణ నేలపై కమలం వికసించే ఛాన్స్ లేదు- మోదీ కామెంట్స్‌కు టీఆర్ఎస్ కౌంటర్
MK Stalin With PM : తమిళాన్ని అధికార భాషగా గుర్తించాలి - మోదీని స్టేజ్‌పైనే అడిగిన స్టాలిన్ !
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Thalapathy 66: వంశీ పైడిపల్లి, విజయ్ తమిళ చిత్రం అప్డేట్, మరీ అంత త్వరగానా?
Haridwar court historic decision: తల్లిదండ్రులను వేధించే పిల్లలకు ఇదో హెచ్చరిక- చారిత్రాత్మక తీర్పు చెప్పిన హరిద్వార్ కోర్టు
Bengal Cabinet: మొన్న తమిళనాడు, నేడు బంగాల్- కేంద్రానికి షాక్‌లు, గవర్నర్ అధికారాల్లో కోతలు!