By: Ram Manohar | Updated at : 26 Feb 2023 04:46 PM (IST)
జమ్ముకశ్మీర్‌లో ఓ బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. (Image Credits: ANI)
Jammu Kashmir Target Killings:
జమ్ముకశ్మీర్‌లో టార్గెట్ కిల్లింగ్స్ కొనసాగుతున్నాయి. మైనార్టీ వర్గానికి చెందిన ఓ బ్యాంకు సెక్యూరిటీ గార్డ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఘటన జరిగిన వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలతో పోరాడి చివరకు కన్ను మూశాడు. మృతుడిని సంజయ్ శర్మగా గుర్తించారు. పుల్వామాలో మార్కెట్‌కు వెళ్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు. సంజయ్ శర్మ ప్రాణాలతో పోరాడి ఓడినట్టు తెలిపారు. ఈ ఘటనతో మరోసారి పుల్వామా ఉలిక్కి పడింది. ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు పోలీసులు. కశ్మీర్ పోలీసులు ఈ విషయాన్ని నిర్ధరిస్తూ ట్వీట్ చేశారు.
Terrorists fired upon one civilian from minority namely Sanjay Sharma
— Kashmir Zone Police (@KashmirPolice) February 26, 2023
S/O Kashinath Sharma R/O Achan Pulwama while on way to local market. He was shifted to hospital however, he succumbed to injuries. There was Armed guard in his village. Area cordoned off. Details shall follow.
Terrorists fired upon one civilian from minority namely Sanjay Sharma from Pulwama while on way to local market. He was shifted to hospital however, he succumbed to injuries. There was Armed guard in his village. Area cordoned off. Details shall follow: Kashmir Police pic.twitter.com/cX5m9LaXdf
— ANI (@ANI) February 26, 2023
జమ్ముకశ్మీర్‌లో ఈ మధ్య కాలంలో మళ్లీ ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. రాజౌరి జిల్లాలో జరిగిన దాడిలో ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో కేంద్రం అప్రమత్తమైంది. భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. ఇందులో భాగంగానే...18 వందల మంది అదనపు CFPF బలగాలను రంగంలోకి దించనుంది. పూంచ్, రాజౌరీ జిల్లాల్లో వీరిని మొహరించనున్నారు. ANI తెలిపిన వివరాల ప్రకారం...CRPFకి చెందిన 18 కంపెనీల బలగాలు రంగంలోకి దిగనున్నాయి. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ అదనపు బలగాలతో ఉగ్రవాదంపై పోరాడటం మరింత సులువవుతుందని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే 9 సీఆర్పీఎఫ్ కంపెనీలు రాజౌరికి చేరుకున్నాయి. మిగతా బలగాలు ఢిల్లీ నుంచి వెళ్లనున్నాయి. వీరంతా కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్‌లో కీలక పాత్ర పోషించనున్నారు. జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న ఉగ్రదాడులపై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ బీజేపీని తీవ్రంగా విమర్శించారు. జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న ఈ విధ్వంసానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని అన్నారు. రోజురోజుకీ జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. జమ్ము ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలబడ్డారని...కానీ వారికి రక్షణ లేకుండా పోయిందని అన్నారు.The incident took place around 10:30am. Terrorists fired upon a member of a minority community when he was going towards a market alongwith her wife. We are searching for the terrorist and we will neutralise them as early as possible: Rayees Mohammad Bhat, DIG pic.twitter.com/Jncasa57J5
— ANI (@ANI) February 26, 2023
Also Read: Drone: భారత్ పాక్ సరిహద్దులో డ్రోన్ కలకలం, కాల్చేసిన BSF బలగాలు
CMA Result 2023: ఐసీఎంఏఐ సీఎంఏ ఇంటర్, ఫైనల్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే!
రైల్వే అధికారులతో దక్షిణ మధ్య రైల్వే జీఎం సమావేశం - చర్చించిన అంశాలివే
Tirupati News: శ్రీసిటీని సందర్శించిన సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్
CBI Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా
AP BJP Vs Janasena : అడిగినా పవన్ సపోర్ట్ ఇవ్వలేదు - సొంతంగా ఎదుగుతామని ఏపీ బీజేపీ ప్రకటన !
TSPSC : పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?
1,540 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి, వివరాలు ఇలా!