Drone: భారత్ పాక్ సరిహద్దులో డ్రోన్ కలకలం, కాల్చేసిన BSF బలగాలు
Pakistan Drone: భారత్ పాక్ సరిహద్దులో BSF సిబ్బంది డ్రోన్‌ను గుర్తించింది.
Pakistan Drone:
అమృత్‌సర్‌లో డ్రోన్...
పాకిస్థాన్ మరోసారి భారత్‌పై డ్రోన్ దాడి చేసేందుకు కుట్ర పన్నినట్టు సమాచారం. సరిహద్దుకు సమీపంలో ఉన్న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో సరిహద్దు భద్రతా బలగాలు (BSF) పాక్‌కు చెందిన ఓ డ్రోన్‌ను గుర్తించారు. షాహ్‌జాదా గ్రామంలో దీన్ని గుర్తించినట్టు వెల్లడించారు. అయితే ఈ డ్రోన్ చైనాకు చెందిందన్న అనుమానాలూ వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే దీనిపై విచారణ మొదలు పెట్టారు. ఈ డ్రోన్ దొరికిన ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ మధ్యే పాకిస్థాన్‌కు చెందిన ఓ డ్రోన్‌ను గుర్తించిన BSF సిబ్బంది దాన్ని కాల్చేశారు.
"ఫిబ్రవరి 2-3వ తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్‌ను గుర్తించాం. అమృత్‌సర్ సెక్టార్‌లోని కక్కర్ బార్డర్ పోస్ట్ ఏరియాలో ఈ డ్రోన్ కనిపించింది. గుర్తించిన వెంటనే కాల్చేశాం. ఓ ఎల్లో పాలిథిన్ కవర్‌లో డ్రగ్స్ ఉన్నాయి. వాటిని సీజ్ చేశాం. దాదాపు 5 కిలోల హెరాయిన్ ఉంది. ఆ డ్రోన్‌పైన చైనా భాషలో రాసుంది. ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ కూడా ఉంది. మాకు తెలిసి పాకిస్థాన్, చైనా దేశాల్లో దీన్ని అసెంబుల్ చేసి ఉంటారు"
-BSF అధికారులు
అంతకు ముందు ఫిబ్రవరి 1వ తేదీన 2.6 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది BSF సిబ్బంది. సరిహద్దు ప్రాంతంలో డ్రోన్ నుంచి ఈ పార్సిల్‌ను కింద పడేసినట్టు అనుమానిస్తున్నారు.
BSF foils another intrusion attempt by #Pakistan, shoots down #drone in Punjab's Amritsar pic.twitter.com/m2pS4rQtoc
— The Contrarian 🇮🇳 (@Contrarian_View) February 26, 2023
గద్దలకు ట్రైనింగ్
యుద్ధ వ్యూహాలు మారిపోతున్నాయి. పెద్ద ట్యాంకులతోనే కాదు. చిన్న చిన్న పరికరాలతోనూ దాడులు చేసే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. అలాంటి వాటిలో డ్రోన్లు కీలకమైనవి. భారత్, పాక్ సరిహద్దు ప్రాంతాల్లో పదేపదే డ్రోన్ల కలకలం రేగుతోంది. దీనిపై భారత్ వ్యూహం మార్చింది. శత్రుదేశం నుంచి వచ్చే డ్రోన్ల ఆట కట్టించేందుకు కొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. గద్దలకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చి ఆ డ్రోన్లను గాల్లోనే ధ్వంసం చేయనున్నారు. ఇప్పటికే నెదర్లాండ్స్, ఫ్రాన్స్ ఈ వ్యూహాన్ని అనుసరిస్తుండగా..ఇప్పుడా జాబితాలో భారత్ కూడా చేరింది. భారత్, అమెరికా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ "యుద్ధ్ అభ్యాస్"లో భాగంగా...ఉత్తరాఖండ్‌లో ఈ శిక్షణ జరిగింది. దాదాపు 15 రోజుల పాటు ఈ విన్యాసాలు జరిగాయి. సైన్య వ్యూహాలను ఇరు దేశాలూ ఇచ్చి పుచ్చుకుంటాయి. విపత్కర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి..? అనేదీ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటారు. సరిహద్దు ప్రాంతాల నుంచి డ్రోన్లు వస్తుంటే..వాటిని ముందుగానే పసిగట్టే విధంగా గద్దలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య దాదాపు 3 వేల కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్ము...ఈ సరిహద్దుకి దగ్గరగా ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో డ్రోన్లు తరచుగా కనిపించాయి. డ్రగ్స్‌ను పెద్ద ఎత్తున సరఫరా చేస్తూ ఇవి కంటపడ్డాయి. బీఎస్‌ఫ్ బలగాలు వీటిని గుర్తించి నిర్వీర్యం చేశారు.
Alo Read: Liquor Policy Case: సీబీఐ విచారణకు మనీశ్ సిసోడియా, దేవుడు అండగా ఉన్నాడంటూ కేజ్రీవాల్ ట్వీట్