Physical Intimacy Health : లైంగిక ఆరోగ్యంపై చలికాలం ప్రభావం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Sensual Wellness : రొమాంటిక్‌గా ఉండేందుకు చలికాలం బెస్ట్ అంటారు. కానీ వింటర్ సమయంలోనే లైంగిక ఆరోగ్యం దెబ్బతింటుందట. అందుకే రెగ్యులర్‌గా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలంటున్నారు. అవేంటంటే..
Intimate Health in Winter : చలికాలంలో శారీరకంగా, మానసికంగా కాస్త ఇబ్బందులు ఉంటాయి. అయితే వింటర్లో లైంగిక ఆరోగ్యంపై కూడా ప్రభావం ఉంటుందంటున్నారు నిపుణులు. లైంగిక సామర్థ్యం దెబ్బతినే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి వింటర్లో లైంగిక ఆరోగ్యం కోసం కొన్ని సూచనలు ఫాలో అవ్వాలి అంటున్నారు. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అవి ఫిజికల్ రిలేషన్‌షిప్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
శారీరకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
హైడ్రేటెడ్‌గా ఉండడం : వింటర్లో చాలామంది నీటిని తక్కువగా తీసుకుంటారు. అయితే ఇలా తక్కువగా నీటిని తాగడం వల్ల లైంగికంగా ఉండే సమయంలో ల్యూబ్రికేషన్ ఇబ్బందులు వస్తాయట. కాబట్టి రోజూ 7 నుంచి 8 గ్లాసుల నీటిని తాగాలి. ఇది ల్యూబ్రికేషన్ సమస్యలు రాకుండా చేయడమే కాకుండా పూర్తి ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది.
వ్యాయామం : చలికాలంలో బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వ్యాయామం చేయడం, వాక్ చేయడం లాంటివి ఆపేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ తగ్గుతుంది. దీనివల్ల ఫిజికల్‌గా ఉన్నప్పుడు సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేరట. అందుకే వ్యాయామం చేస్తూ శారీరక, లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటున్నారు.
బ్యాలెన్స్డ్ డైట్ : న్యూట్రెంట్ రిచ్ ఫుడ్స్ శరీరంలో హార్మన్లను కంట్రోల్లో ఉంచుతాయి. దీనివల్ల మెరుగైన లైంగిక చర్యను పొందవచ్చు. అలాగే పూర్తి ఆరోగ్యానికి మంచిది.
మానసికంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్..
ఒత్తిడి : ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ ఎక్కువగా విడుదల అవుతుంది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు లైంగిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునేందుకు మెడిటేషన్, యోగా, డీప్ బ్రీత్ వ్యాయామాలు చేస్తే మంచి ఫలితాలుంటాయి.
కమ్యూనికేషన్ : మానసికంగా ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు ఎక్కువ మంది ఒంటరిగా ఉంటారు. కానీ పార్టనర్ సపోర్ట్ తీసుకుంటూ.. వారితో కమ్యూనికేషన్స్ పెంచుకుంటే మంచిది. లైంగిక ఆరోగ్యం కోసం.. మీ డిజైర్స్, అవసరాలు పంచుకోవడం ద్వారా మీ రిలేషన్ షిప్ హెల్తీగా ఉంటుంది.
సమయం : మీ పార్టనర్‌తో డేట్ నైట్స్‌కి వెళ్లొచ్చు. రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే మీ పార్టనర్‌ని నిద్రపోయే సమయాల్లో ప్రేమగా కౌగిలించుకుని, ఒకరి చేతుల్లోకి మరొకర్ని ప్రేమగా తీసుకుని హత్తుకోవడం వల్ల కనెక్టివిటీ పెరుగుతుంది.
లైంగిక ఆరోగ్యం కోసం ఫాలో అవ్వాల్సిన టిప్స్..
సేఫ్టీ : STI వంటి లైంగిక సమస్యలు రాకుండా, ప్రెగ్నెన్సీ వద్దు అనుకునేవారు ప్రొటెక్షన్స్ ఉపయోగించాలి.
హైజీన్ : హైజీన్‌గా ఉంటూ.. ప్రైవేట్ పార్ట్స్‌ని క్లీన్‌గా ఉంచుకోవాలి. దీనివల్ల ఇన్ఫెక్షన్లు రావు. ముఖ్యంగా రోజూ రెండు పూటల స్నానం చేస్తే మరీ మంచిది.
రెగ్యూలర్ చెకప్స్ : సంవత్సరానికోసారైనా హెల్త్ చెకప్ చేయించుకోవాలి. దానిలో భాగంగానే సెక్సువల్ హెల్త్‌పై కూడా దృష్టి సారించాలి.
చలికాలంలో ఫాలో అవ్వాల్సిన టిప్స్
పార్టనర్‌తో కలిసి ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు కంఫర్ట్‌బుల్‌గా, రిలాక్స్‌గా ఉండేలాంటి ప్రదేశాలు ఎంచుకోవాలి. ఇది మీ మధ్య బంధాన్ని పెంచుతుంది. చలికాలంలో చర్మం పొడిబారుతూ ఉంటుంది. అలాగే ల్యూబ్రికేషన్ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి.. దానిని దూరం చేసుకునే టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. పార్టనర్ ఇబ్బందులను కూడా గుర్తించి ఓపెన్‌గా చర్చించుకుంటే బెటర్ ఎక్స్పీరియన్స్ పొందవచ్చు.
Also Read : ఈ రెగ్యూలర్ ఫుడ్స్‌తో లైంగిక ఆరోగ్యానికి ఎన్ని లాభాలో.. శృంగార జీవితానికి ఇవి చాలా మంచివట