Israel Kills Hamas Chief: హమాస్ నాయకున్ని చంపింది మేమే - ధృవీకరించిన ఇజ్రాయెల్
Israel : హమాస్ నాయకుడైన ఇస్మాయిల్ హనియేను జులైలో టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ధృవీకరించారు. హౌతీ ఉద్యమ అధిపతులను లక్ష్యంగా చేసుకుంటామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది.
Israel News: హమాస్ లీడర్ ఇస్మాయిల్ హనియే ను తామే చంపినట్టు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ మంత్రి కాట్జ్ ధృవీకరించారు. ఈ మధ్య కాలంలో హౌతీ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. భారీ సంఖ్యలో క్షిపణులు ప్రయోగిస్తోంది. వారందరికీ ఓ విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. హమాస్, హెజ్ బొల్లాలను ఓడించాం. ఇరాన్ రక్షణ, ఉత్పత్తి వ్యవస్థలను నాశనం చేశాం. సిరియాలో బషర్ అల్ అసద్ పాలనను పడగొట్టాం. చెడుపై పోరాడి గెలిచాం. యెమెన్ లోని హౌతీలకు కూడా గట్టి దెబ్బ తప్పదు. హనియే, సిన్వర్, నస్రల్లాలను హతమార్చాం. అదే తరహాలో హోడెయిడా, సానాలోని నేతల తలలు నరుకుతాం. ఏడాది నుంచి పాలస్తీనియన్లకు మద్దతుగా నిలిచాం అని కాట్జ్ చెప్పారు.
ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో జులైలో జరిగిన ఆ దేశ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న హనియేన హత్యకు గురయ్యాడు. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ హత్య జరిగిందని అప్పట్లోనే ఇరాన్ ఆరోపించింది. కానీ దీనిపై ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటనా చేయలేదు, స్పందించలేదు. తాజాగా ఈ విషయాన్ని ధృవీకరించింది. హనియే హత్య తర్వాత, హమాస్ గాజాలో యాహ్యా సిన్వార్‌ను తన నాయకుడిగా నియమించింది. తరువాత, అక్టోబర్‌లో సినావర్‌ను ఇజ్రాయెల్ సైన్యం చంపింది. సెప్టెంబరులో, ఇరాన్-మద్దతుగల లెబనీస్ గ్రూప్ హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా బీరూట్‌లో హత్యకు గురయ్యాడు.
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పైకి హమాస్ బలగాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో దాదాపు 12వందల మందికి పైగా ఇజ్రాయెలీలు ప్రాణాలు కోల్పోగా.. అదే సమయంలో 251మంది కిడ్నాప్ అయ్యారు. ఆ తర్వాత వీరిలో కొంతమందిని విడిపించారు. మరికొందరేమో చనిపోయారు. ఇప్పటికీ దాదాపు వంద మంది హమాస్ వద్ద బందీలుగానే ఉన్నట్టు సమాచారం.
మరోవైపు గాజాలో యుద్దం మొదలైనప్పట్నుంచి హౌతీలు ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులకు పాల్పడుతున్నారు. వీరికి ఇరాన్ మద్దతిస్తుండగా.. తాము పాలస్తీనియన్లకు సంఘీభావం తెలుపుతున్నామని హౌతీ తిరుగుబాటులు అంటున్నారు. గాజాపై యుద్దాన్ని ఆపేవరకు ఇలానే దాడులు కొనసాగిస్తామని హెచ్చరిక జారీ చేసింది. దీంతో హౌతాల సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ మిలటరీ దళాలు ఎదురుదాడులు చేస్తున్నాయి.
90% చర్చలు పూర్తి
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ, హమాస్‌తో గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో కొంత పురోగతి సాధించామన్నారు. అయితే అది ఎప్పుడు పూర్తవుతుందనే దానిపై స్పష్టత లేదు. హమాస్ - ఇజ్రాయెల్ మధ్య చర్చలు 90% పూర్తయ్యాయని పాలస్తీనా సీనియర్ అధికారి తెలిపారు.
Also Read : Financial crisis in America: షట్ డౌన్ దిశగా అమెరికా - అసలు విషయం ఏంటో తెలుసా?