Indian Railway: 8 రైళ్లకు అదనపు స్టాపులు - మరికొన్ని ప్రాంతాలకు ప్రత్యేక రైళ్ల ఏర్పాటు
Indian Railway: ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ఎనిమిది రైళ్లకు అదనపు స్టాప్ లను ప్రకటించింది. అలాగే మరికొన్ని ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.
South Central Railway Special Trains: ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం ఎనిమిది ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు స్టాప్ లను ఏర్పాటు చేసింది. అలాగే మరికొన్ని ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం సర్వీసులు అందిస్తున్న స్టేషన్లకు తోడు అదనంగా ఒక స్టేషన్లో ఆయా రైళ్లను నిలిపేలా చర్యలు చేపట్టింది. ఈక్రమంలోనే ప్రయోగాత్మకంగా ఆరు నెలల పాటు 8 ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇకపై అదనంగా కేటాయించిన స్టేషన్లలోనూ ఆగుతాయని పేర్కొంది. అలాగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్ల సర్వీసులను ఏర్పాటు చేసింది.
ఆగస్టు 23వ తేదీ నుంచి ఎస్‌ఎస్‌ఎస్ హుబ్బళ్లి - హైదరాబాద్ - ఎస్‌ఎస్‌ఎస్ హుబ్బళ్లి మధ్య సర్వీసులందించే 17319, 17320 నెంబర్ లు గల రైళ్లు హోత్గి స్టేషన్‌లో ఆగనున్నాయి. అలాగే విశాఖ నుంచి ముంబయి ఎల్‌టీటీ - విశాఖకు మధ్య సేవలు అందించే 18519, 18520 నెంబర్ల రైళ్లు, కాకినాడ - ముంబయి - కాకినాడ మధ్య తిరిగే 17221, 17222 నెంబర్ల రైళ్లు కల్యాణ్ స్టేషన్‌లోనూ ఇకపై ఆగనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వీటితో పాటు ఆగస్టు 24వ తేదీ నుంచి విశాఖ - శిర్డీ- విశాఖ మధ్య వారానికి ఒకరోజు తిరిగే 18503, 18504 నెంబర్లు గల రైళ్లను కోపర్‌గాన్‌లో స్టేషన్‌లోనూ కాసేపు ఆపుతారు.
Provision of additional stoppages for express trains @RailMinIndia @drmsecunderabad @drmhyb @drmvijayawada pic.twitter.com/PT3m0JTrPn
— South Central Railway (@SCRailwayIndia) August 22, 2023
కాకినాడకు రెండు ప్రత్యేక రైళ్లు..
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కాకినాడ టౌన్ - లింగంపల్లి - కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. సోమ, బుధ, శుక్ర వారాల్లో కాకినాడ నుంచి రాత్రి 20.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.15గంటలకు లింగంపల్లి చేరుకోనుంది.
అలాగే మంగళ, గురు, శని వారాల్లో సాయంత్రం 6.25గంటలకు లింగంపల్లిలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంలకు కాకినాడకు చేరుకుంటుంది. ఈ రైలు సామర్లకోట, రాజమహేంద్రవరం, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ జంక్షన్, విజయవాడ జంక్షన్, గుంటూరు జంక్షన్, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుందని వెల్లడించారు. ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్‌తో పాటు స్లీపర్, జనరల్ సెకెండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 20 ప్రత్యేక రైళ్ల సేవల్ని పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఆ రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలివే.
Special trains between Kakinada Town - Lingampalli @RailMinIndia @drmsecunderabad @drmvijayawada pic.twitter.com/FBkdZsxUCd
— South Central Railway (@SCRailwayIndia) August 22, 2023
SCR extends special trains @RailMinIndia @drmsecunderabad @drmhyb @drmvijayawada pic.twitter.com/flSoAeS9wh
— South Central Railway (@SCRailwayIndia) August 22, 2023