By: Ram Manohar | Updated at : 04 Dec 2022 12:02 PM (IST)
భారత నౌకా దళ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు.
Indian Navy Day 2022:
నావికా దళ దినోత్సవం..
భారత నౌకా దళ దినోత్సవం సందర్భంగా...దేశమంతా నేవీ సేవల్ని స్మరించుకుంటోంది. 1971లో భారత్, పాకిస్థాన్ యుద్ధ సమయంలో "ఆపరేషన్ ట్రిడెంట్" (Operation Trident)తో విజయం సాధించింది నావికా దళం. ఆ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్ 4వ తేదీన భారత నౌకా దళ దినోత్సవం (Indian Navy Day) జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని ప్రముఖులంతా నేవీ సేవలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేవీపై ప్రశంసల జల్లు కురిపించారు. "దేశానికి కష్టకాలం వచ్చిన ప్రతిసారీ...ఇండియన్ నేవీ ముందుండి ఆ ఆపదను తీర్చింది" అని కొనియాడారు. ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. "నేవీ సిబ్బందికి, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న నేవీని చూసి ఇండియా గర్వ పడుతోంది. సవాళ్లు ఎదురైన ప్రతిసారీ దేశాన్ని నావికా దళం ముందుండి కాపాడింది" అని ట్వీట్ చేశారు. కేంద్రహోం మంత్రి అమిత్ షా కూడా నేవీకి శుభాకాంక్షలు తెలిపారు. "ఎంతో ధైర్యవంతమైన మన నేవీకి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు. మీ అంకితభావానికి, నిబద్ధతకు మా సెల్యూట్" అని ట్వీట్ చేశారు.
Best wishes on Navy Day to all navy personnel and their families. We in India are proud of our rich maritime history. The Indian Navy has steadfastly protected our nation and has distinguished itself with its humanitarian spirit during challenging times. pic.twitter.com/nGxoWxVLaz
— Narendra Modi (@narendramodi) December 4, 2022
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ "తీర ప్రాంతాలను రక్షిస్తూ దేశ భద్రతకు భరోసా ఇస్తున్న నేవీకి శుభాకాంక్షలు. మీ నిబద్ధతను, ధైర్యాన్ని చూసి దేశం గర్విస్తోంది" అని ట్వీట్ చేశారు. ఇండియన్ నేవీ లో మహిళా అగ్నివీరులను నియమిస్తున్నట్టు నౌకాదళం ప్రకటించింది. నేవీ డే సందర్బంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా ఈ విషయం తెలిపారు. ఇప్పటీకే ఈ ప్రక్రియ మొదలైనట్టు ఆయన తెలిపారు. ఇండియన్ నేవీ లో 3000 మంది వరకూ అగ్నివీర్ లను నియమించే అవకాశం ఉందని వీరిలో 324 మంది మహిళలు ఉంటారని ఆయన అన్నారు. ఇకపై జరిగే నియామకాల్లో 20 శాతం మంది మహిళలను ఎంపిక చేసేలా చూస్తామన్నారు .
Greetings to all @IndianNavy personnel on #NavyDay. The Indian Navy is at the forefront of keeping our country safe by ensuring impeccable maritime security. The nation is proud of Indian Navy’s valour, courage, commitment and professionalism. pic.twitter.com/3UA77vBIH1
— Rajnath Singh (@rajnathsingh) December 4, 2022
Also Read: Rahul Gandhi on BJP: 'మిస్టర్ ప్రైమ్ మినిస్టర్- పెట్రోల్, గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదు?'
Adani Enterprises: అదానీ పరువు అక్కడ కూడా పోయింది - డో జోన్స్ నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్ ఔట్
BRS Vs BJP: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఖర్మరా బాబూ అంటున్న మంత్రి కేటీఆర్
K Viswanath Passed Away: విజయనగరంతో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం !
Amul Milk Prices Hike: అమూల్ పాల ధర లీటర్‌కు మూడు రూపాయలు పెంపు
Mumbai Terror Threat: ముంబయిలో మళ్లీ దాడులు చేస్తాం, NIAకి వార్నింగ్ ఇస్తూ మెయిల్ పంపిన తాలిబన్!
YSRCP Tensions : వైఎస్ఆర్సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
Telangana Assembly Budget Sessions : ఈరోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం!
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!