Rahul Gandhi on BJP: 'మిస్టర్ ప్రైమ్ మినిస్టర్- పెట్రోల్, గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదు?'
Rahul Gandhi on BJP: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్న దేశంలో ఎందుకు తగ్గలేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
Rahul Gandhi on BJP: 'భారత్ జోడో యాత్ర'కు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అధికార భాజపాపై విరుచుకుపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు, ఎల్‌పీజీ ధరలు తగ్గినప్పటికీ భారత్‌లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధర ఎందుకు తగ్గడం లేదని ప్రశ్నించారు.
గ్లోబల్ ఎల్‌పీజీ, ముడి చమురు ధరలు వరుసగా 40%, 25% తగ్గాయి. అయితే దేశంలో మాత్రం ధరలు అలాగే ఉన్నాయని రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
कच्चा तेल - 25% सस्ता
— Rahul Gandhi (@RahulGandhi) December 3, 2022
एलपीजी - 40% सस्ती
ये 6 महीनों के अंतरराष्ट्रीय कीमतों के आंकड़े हैं। फिर भी पेट्रोल, डीज़ल और गैस सिलेंडर के दाम कम क्यों नहीं हुए?
प्रधानमंत्री जी, आपके 'लूट-तंत्र' के खिलाफ लोकतंत्र की आवाज़ है - भारत जोड़ो यात्रा। जवाब दीजिए!
ఇంధన ధరలపై రాహుల్ గాంధీ గురువారం కూడా ప్రభుత్వంపై దాడి చేశారు. ప్రజలు అధిక ద్రవ్యోల్బణంతో బాధపడుతున్నారని, ప్రధానమంత్రి పన్నుల నుంచి డబ్బును తిరిగి పొందడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు.
జోడో యాత్ర
సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర ఇంకా 2,355 కి.మీ సాగనుంది. మొత్తం 3,570 కిలోమీటర్ల పాటు ఈ యాత్ర సాగనుంది. ఈ యాత్ర వచ్చే ఏడాది కశ్మీర్‌లో ముగుస్తుంది. దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయని సుదీర్ఘ పాద యాత్ర ఇదే అని కాంగ్రెస్ పేర్కొంది.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో రాబోయే ఎన్నికల్లో గట్టిగా పోరాడేందుకు, పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచేందుకు ఈ యాత్రను కాంగ్రెస్ నమ్ముకుంది. యాత్ర 87వ రోజుకు చేరుకుంది. మధ్యప్రదేశ్‌లో ఈ రెండు రోజులతో యాత్ర పూర్తవుతుంది. నవంబర్ 23న మధ్యప్రదేశ్‌లో ప్రవేశించిన యాత్ర 12 రోజుల్లో రాష్ట్రంలోని ఏడు జిల్లాలను కవర్ చేస్తుంది.
భారత్ జోడో యాత్ర ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను కవర్ చేసింది. డిసెంబర్ 5న రాజస్థాన్‌లోకి ప్రవేశించనుంది.
Also Read: బుధవారం నుంచి పార్లమెంట్ వింటర్ సెషన్ - కేంద్రాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ వ్యూహాలివే