లండన్‌లో కళ్లు చెదిరే మ్యాన్షన్‌ని కొన్న ఇండియన్ బిలియనీర్, ధర రూ.1,200 కోట్లు
Indian Businessman: ఇండియన్ బిలియనీర్ రవి రుయా యూకేలోని లండన్ మ్యాన్షన్‌ని కొనుగోలు చేశారు.
Indian Businessman:
మ్యాన్షన్‌ని కొన్న రవి రుయా
ఇండియన్ బిలియనీర్ రవి రుయా (Ravi Ruia) యూకేలోని లండన్ మాన్షన్‌ని (London Mansion) రూ.1,200కోట్లు పెట్టి కొన్నాడు. ఓ రష్యన్ ఇన్వెస్టర్‌కి చెందిన ఈ ప్రాపర్టీని కొనడానికి చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో యూకేలో జరిగిన అతి పెద్ద రెసిడెన్షియల్ డీల్ ఇదే. అందుకే దేశవ్యాప్తంగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది ఈ డీల్. Essar Group కో ఓనర్ అయిన రవి రుయా ఈ మాన్షన్‌పై మనసు పారేసుకున్నారు. అనుకున్న విధంగానే Hanover Lodge mansionని సొంతం చేసుకున్నారు. రష్యాకు చెందిన Gazprom Invest Yug సంస్థ మాజీ డిప్యుటీ సీఈవో గొంచరెంకో (Goncharenko) రెండేళ్ల క్రితమే దీన్ని కొనుగోలు చేశారు. ఆయన నుంచి రవి రుయా కొనుగోలు చేశారు. ఫ్యామిలీ ఆఫీస్‌కి ఇది చాలా బాగుంటుందని రుయాకు అందరూ సలహా ఇచ్చారట. అందుకే...మరేమీ ఆలోచించకుండా వెంటనే డీల్ సెటిల్ చేశారు. సాధారణంగా లండన్‌లోని ఇలాంటి మాన్షన్‌లను కొనేవాళ్లు ఒకేసారి డబ్బంతా ఇచ్చేస్తారు. అక్కడ లోన్స్‌పై ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే..వీలైనంత వరకూ ఆ ఆప్షన్‌ని ఎంచుకోరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్స్‌లో దాదాపు 17% మంది గతేడాది కనీసం ఓ మ్యాన్షన్‌ని కొనుగోలు చేసినట్టు కొన్ని రిపోర్ట్‌లు వెల్లడించాయి. అయితే...ఈ డీల్‌తో లండన్‌లోని ప్రాపర్టీ మార్కెట్‌లో ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. విదేశాలకు చెందిన వ్యక్తులు లండన్‌లో ప్రాపర్టీలు కొంటున్నారు. వాళ్లకు సంబంధించి పక్కా రిజిస్టర్‌లు మెయింటేన్ చేయాలని యూకే ప్రయత్నించింది. ఈ విషయంలో ట్రాన్స్‌పరెన్సీ ఉండాలని భావించింది. కానీ అమలు చేయడంలో విఫలమవుతోంది. గతేడాది చివరి మూడు నెలల్లోనే లండన్‌లో రికార్డు స్థాయిలో ప్రాపర్టీ కొనుగోళ్లు జరిగాయి.
దుబాయ్‌లోనూ ఫుల్ డిమాండ్..
ఇసుక పోసి కృత్రిమంగా తయారు చేసిన ఓ ఐల్యాండ్‌ని (Dubai Island) కోట్లు పెట్టి మరీ కొన్నాడు దుబాయ్‌కి చెందిన ఓ వ్యక్తి. అక్కడి మార్కెట్‌లో ఇదో రికార్డు. ఆ ద్వీపాన్ని కొనుగోలు చేసేందుకు రూ.3.4 కోట్లు ఖర్చు పెట్టాడు. 24,500 స్క్వేర్ ఫీట్‌ల స్థలం అది. దుబాయ్ మెయిన్ ల్యాండ్‌కి ఈ ద్వీపానికి మధ్యలో బ్రిడ్జ్ కూడా ఉంది. సో...ట్రావెలింగ్‌కి కూడా పెద్ద ఇబ్బంది లేదు. అందుకే అంతగా అక్కడ డిమాండ్ పెరిగింది. స్క్వేర్ ఫీట్‌కి 5 వేల దిర్హాంలు ఫిక్స్ చేశారు. అయితే...ఈ ఐల్యాండ్‌ని ఎవరు కొన్నారన్న వివరాలు మాత్రం బయటకు రాలేదు. ఇది కొన్నది UAE వ్యక్తి కాదని మాత్రం తెలుస్తోంది. కేవలం హాలిడేలో ఎంజాయ్ చేసేందుకు ఆ వ్యక్తి ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాడట. ఫ్యామిలీతో పాటు వెకేషన్‌కి వచ్చినప్పుడు ఇక్కడే ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడట. సాధారణంగా విల్లాలకు ఈ స్థాయిలో ధర ఉంటుంది. కానీ మెల్లగా ఆ ట్రెండ్ పోయి ఏకంగా ఐల్యాండ్‌లనే కొనే ట్రెండ్ వచ్చేసింది. అందుకే భారీ స్థలాలన్నీ క్రమంగా అమ్ముడుపోతున్నాయి. పైగా ఈ ఐల్యాండ్‌లలో భూమి వాల్యూ భారీగా పెరుగుతోంది. కొందరు ఇన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా వీటిని కొని మళ్లీ కోట్ల రూపాయల లాభానికి అమ్ముకుంటున్నారు.
Also Read: Qin Gang Missing: జర్నలిస్ట్‌తో చైనా విదేశాంగ మంత్రి ఎఫైర్? నెల రోజులుగా అజ్ఞాతంలోనే క్విన్ గాంగ్