అన్వేషించండి

Bengal Minister Arrest: బెంగాల్‌ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్‌ అరెస్ట్‌-బీజేపీ వేధిస్తోందన్న మమత

పశ్చిమబెంగాల్‌ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్‌ను ఈడీ అరెస్ట్‌ చేసింది. రేషన్‌ స్కామ్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. 20గంటలపాటు ప్రశ్నించిన తర్వాత అరెస్ట్‌ చేశారు.

పశ్చిమబెంగాల్‌ మమతా బెనర్జీ సర్కార్‌కు మరో షాక్‌ తగిలింది. మమతా బెనర్జీ కేబినెట్‌లో అటవీ శాఖ మంత్రిగా ఉన్న జ్యోతిప్రియ మల్లిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్‌ చేశారు. జ్యోతిప్రియ మల్లిక్‌ ఆహార శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రేషన్‌ స్కామ్‌ జరిగిందనే ఆరోపణలతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. జ్యోతిప్రియ మల్లిక్‌ను 20గంటలపాటు ప్రశ్నించిన తర్వాత... ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు.

కోల్‌కతా శివారు సాల్ట్‌లేక్‌లోని మల్లిక్ ఇంట్లో ఈడీ అధికారులు నిన్నటి నుంచి సోదాలు నిర్వహించారు. ఇవాళ ఆయన్ను అరెస్టు చేసి... సీజీవో కాంప్లెక్స్‌లోని ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో మల్లిక్‌ మీడియాతో మాట్లాడారు. ఇదంతా ఒక కుట్ర అని... తాను బాధితుడినని చెప్పారాయన. 

మల్లిక్ ఆహార శాక మంత్రిగా ఉన్నప్పుడు రేషన్ పంపిణీలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలకు సంబంధించి... ఆయన ఇంటితోపాటు సహచరుల ఇంట్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. ఏకకాలంలో ఎనిమిది చోట్ల సోదాలు నిర్వహించారు. రేషన్‌ స్కామ్‌లో ఇటీవల అరెస్టయిన వ్యాపారవేత్త బాకీబుర్ రెహమాన్‌తో మల్లిక్‌కు ఉన్న సంబంధాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. మల్లిక్‌ను 20 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు... ప్రధానంగా రెహమాన్‌తో మల్లిక్‌కు ఉన్న సంబంధాలపైనే ఆరా తీసినట్టు సమాచారం.

నిన్న (గురువారం) ఉదయం 6:30 గంటల సమయంలో సాల్ట్‌లేక్‌లోని మంత్రి జ్యోతిప్రియ మల్లిక్‌ ఇంటికి వచ్చారు ఈడీ అధికారులు. మంత్రికి చెందిన సాల్ట్ లేక్ బీసీ బ్లాక్‌లోని రెండు ఫ్లాట్లలో నిన్న (గురువారం) ఉదయం నుంచి ఈడీ సోదాలు నిర్వహించింది. ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని నాగర్‌బజార్‌లోని మల్లిక్ వ్యక్తిగత సహాయకుడు  అమిత్‌డే ఇంట్లోనూ తనిఖీ చేశారు ఈడీ అధికారులు. 

గత వారం మంత్రి జ్యోతిప్రియ మల్లిక్‌ అనుచరుడు రెహమాన్‌ను అరెస్ట్‌ చేశారు ఈడీ అధికారులు. కైఖలిలోని అతని ఫ్లాట్‌లో 53గంటలకుపైగా సోదాలు చేశారు. ఆ తర్వాత రెహమాన్‌ను అరెస్టు చేశారు. అతని ఫ్లాట్‌లో ప్రభుత్వ కార్యాలయాల స్టాంపులతో కూడిన 100కు పైగా డాక్యుమెంట్లు లభ్యమైనట్లు ఈడీ వర్గాలు చెప్పాయి. రెహమాన్‌కు రైస్‌మిల్లు వ్యాపారంతో పాటు అనేక హోటళ్లు, రిసార్ట్‌లు, బార్లు ఉన్నాయి. అతడి కంపెనీల్లో రూ.50 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఈడీ వర్గాలు తెలిపాయి.

తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతల అరెస్టులతో... మమతా బెనర్జీ ప్రభుత్వం చుక్కుల్లో పడుతోంది. ఇప్పటికే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో మాజీ విద్యా మంత్రి పార్థ ఛటర్జీ, అతని సహాయకురాలు అర్పితా ముఖర్జీని ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత.. టీఎంసీ బర్భమ్ జిల్లా అధ్యక్షుడు అనుబ్రత మోండల్ కూడా.. పశువుల అక్రమ రవాణా కేసులో అరెస్ట్‌ అయ్యారు. బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి మేనల్లుడు, టీఎంసీ అధినేత అభిషేక్ బెనర్జీపై కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆయన్ను ఈడీ చాలా సార్లు పిలిచి ప్రశ్నించింది. ఇక.. తాజాగా టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై కూడా ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది.

ఈడీ దాడులు... తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతల వరుస అరెస్టులపై బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఫైరయ్యారు. మోడీ సర్కార్‌తోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థలపై విమర్శలు గుప్పించారు. తమ పార్టీ నేతలు, మంత్రులను బీజేపీ సర్కార్‌ వేధిస్తోందన్నారు దీదీ. తృణమూల్ కాంగ్రెస్ నేతల ఇళ్లను కేంద్ర ఏజెన్సీలు దోచుకుంటున్నాయని ఆరోపించారు. సోదాలు, తనిఖీల పేరుతో అరాచకాలు సృష్టిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఒక్క బీజేపీ నాయకుడి ఇంటిపై ఎందుకు సోదాలు చేయడంలేదని కూడా ఆమె ప్రశ్నించారు. దేశం ఇలానే నడుస్తుందా? చట్టాన్ని వారికి తగట్టు మార్చుకుంటారా అని క్వశ్చన్‌ చేశారు మమతా బెనర్జీ. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని పిలుస్తున్నారని అన్నారు. అంతేకాదు... హఠాత్తుగా భారతదేశం పేరు కూడా మార్చారని మండిపడ్డారు. మంత్రి జ్యోతిప్రియ మల్లిక్‌కి ఇప్పటికే మధుమేహం ఉందని... ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని... ఆయన చనిపోతే బీజేపీ, ఈడీలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తానని కూడా హెచ్చరించారు మమతా బెనర్జీ. 

ఇక, బెంగాల్‌ బీజేపీ నేతలు మమతా బెనర్జీ ఆరోపణలు కొట్టిపారేస్తున్నారు. రేషన్‌ స్కామ్‌లో నిందితుడుగా ఉన్న రెహమాన్‌కు 2012 నుండి మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ తెలుసుని అన్నారు ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి. ఇది చాలా పెద్ద స్కామ్‌ అని ఆరోపించారాయన. రెహ్మాన్‌ పేరుతో ఉన్న కోట్లాది రూపాయలన ఆస్తుల లింకులను ఈడీ గుర్తించిందని... ఆ ఆస్తులు ఎవరివో త్వరలోనే బయటకు వస్తుందని అంటున్నారు బెంగాల్‌ బీజేపీ నేతలు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
NDA Convenor Post Revival: ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?
ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Embed widget