కేఫ్‌లో ఒకేసారి పేలిన 10 సిలిండర్‌లు, బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం
Koramangala Fire Accident: బెంగళూరులోని కోరమంగళలో ఓ బిల్డింగ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Koramangala Fire Accident:
కోరమంగళలో అగ్ని ప్రమాదం..
బెంగళూరులోని కోరమంగళలో ఓ మల్టీస్టోర్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం (Koramangala Fire Accident) సంభవించింది. ముందుగా ఓ కేఫ్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడి నుంచి పరిసర ప్రాంతాల్లోకి మంటలు వ్యాప్తి చెందాయి. ఆ తరవాత పేలుడు కూడా సంభవించింది. బిల్డింగ్‌లోని వాళ్లంతా గట్టిగా కేకలు వేస్తూ బయటకు వచ్చారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుంది. బిల్డింగ్‌లో చిక్కుకున్న వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంట ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ప్రాథమిక వివరాల ప్రకారం...బిల్డింగ్‌లోని కేఫ్‌లో గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించింది. రెస్క్యూ టీమ్ వచ్చి కాపాడినప్పటికీ కొందరు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు బిల్డింగ్ పై నుంచి దూకేశారు. ఓ వ్యక్తి మంటల్లో చిక్కుకున్నాడు. అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. చెట్టుమీద పడడం వల్ల గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు.
#WATCH | Karnataka: ADGP Fire and Services P Harishekaran says, "More than 4-5 cylinders exploded that led to the fire. The cylinder exploded and tore into pieces. 8 fire engines have been called in. One person who jumped from the building has been injured. We are giving proper… https://t.co/itomV8276l pic.twitter.com/cMKvIxU22Q
— ANI (@ANI) October 18, 2023
కేఫ్‌లో గ్యాస్ లీక్ అయిందని, అప్పుడే మంటలు అంటుకున్నాయని పోలీసులు వెల్లడించారు. ప్రాథమిక విచారణలో ఇదే తేలిందని వివరించారు. నిముషాల్లోనే మంటలు వ్యాపించాయని, కేఫ్‌లోని సిబ్బంది అంతా వెంటనే బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారని తెలిపారు. ఈ ఘటనలో రెండు బైక్‌లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదం వల్ల కేఫ్ మొత్తం ధ్వంసమైంది. మొత్తం 8-10 సిలిండర్‌లు పేలి ఉంటాయని, అందుకే ఇంత నష్టం వాటిల్లిందని పోలీసులు చెప్పారు. ఇందులోనే వెహికిల్ షోరూమ్ కూడా ఉండడం వల్ల వాహనాలూ కాలి బూడిదైపోయాయి.
#WATCH | Karnataka: A massive fire broke out at Koramangala cafe in Bengaluru. Fire tenders are present at the spot. Further details are awaited. pic.twitter.com/GBw9ZRAipL
— ANI (@ANI) October 18, 2023
మహారాష్ట్రలో ఇటీవలే ఘోర రైలు ప్రమాదం సంభవించింది. అహ్మద్ నగర్ నుంచి అష్టికి వెళ్లే సబర్బన్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మంటలు వ్యాపించగా 5 బోగీలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ప్రయాణికులందరినీ సురక్షితంగా తరలించామని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ముందుగా గార్డ్ సైడ్ బ్రేక్ వ్యాన్ లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. వెంటనే పక్కన ఉన్న 4 కోచ్ లకు మంటలు వేగంగా వ్యాపించగా, అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను రక్షించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది మంటలు ఇతర బోగీలకు అంటుకోకుండా చర్యలు చేపట్టారు.
Also Read: మీరు దాడులు ఆపితే మేం బందీల్ని వదిలేస్తాం, ఇజ్రాయేల్‌కి హమాస్ అల్టిమేటం