Viral News: కిటికీ గ్రిల్‌కు వేలాడుతున్న బాలిక, ఫైర్ సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
Pune Girl Saved By Firefighter | పూణేలోని ఓ బిల్డింగ్ కు వేలాడుతున్న చిన్నారి ప్రాణాలు దేవుడే కాపాడాలనుకున్నారు స్థానికులు. ఓ ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి పాపను కిటికీ గ్రిల్ నుంచి లోపలకి లాగారు.

Pune Girl Viral Video | పూణే: మహారాష్ట్రలోని పుణేలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తత కారణంగా తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు దక్కాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గుజార్ నింబాల్కర్ వాడి ప్రాంతంలోని సోనావానే భవనంలో నాలుగేళ్ల భవిక చందానే అనే బాలికను ఆమె తల్లి ఇంట్లోనే లాక్ చేసింది. తన పెద్ద కుమార్తెను స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళుతూ ఇంటి బయటి నుండి తాళం వేసింది. 4 ఏళ్ల రెండో కుమార్తె భవికను మూడవ అంతస్తులో ఒంటరిగా వదిలివేసి వెళ్లిపోయింది. ఆడుకుంటూ కిటికీ దగ్గరకు చేరుకునన్న చిన్నారి ఇనుప గ్రిల్ ద్వారా తల బయటకు పెట్టి బాల్కనీ అంచుపైకి వచ్చింది.
కిటికీ గ్రిల్ పట్టుకుని వేలాడిన బాలిక
కొన్ని క్షణాలైతే చిన్నారి కిటికీ నుంచి మూడో అంతస్తు నుంచి కింద పడుతుందని అంతా భావించారు. కానీ కింద పడిపోతానని గ్రహించిన బాలిక కిటికీ గ్రిల్‌ను గట్టిగా పట్టుకుంది. పైకి ఎక్కాలని ప్రయత్నం చేసింది, కానీ ఎక్కడం సాధ్యం కాలేదు. అదే సమయంలో పక్కన అపార్ట్ మెంట్లో ఉన్న వారు చాలికకు ప్రమాదం పొంచి ఉందని గమనించి గట్టిగా కేకలు వేశారు. వీక్లీ ఆఫ్ లో ఇంట్లో ఉన్న అగ్నిమాపక సిబ్బంది (టాండెల్) యోగేష్ చవాన్ వారి అరుపులు విన్నాడు.
पुणे में बड़ा हादसा टला!
— Meerut Media (@meerutmedia) July 8, 2025
कात्रज में 4 साल की बच्ची तीसरी मंज़िल से गिरने वाली थी, फायर ब्रिगेड ने वक्त रहते बचाया। मां घर पर नहीं थी, दरवाज़ा तोड़कर बच्ची को सुरक्षित निकाला गया#pune #meerutmedia #danger #viralvideo #viral #Trending pic.twitter.com/jqsjfiqLxL
మొదట తను ఏమాత్రం ఆసల్యం చేయకుండా మూడవ అంతస్తుకు పరిగెత్తాడు తీరా వెళ్లి చూస్తే ఇంటికి తాళం వేసి ఉంది. కిందకు పరిగెత్తుకుంటూ వచ్చిన అతడు బాలిక తల్లి చందానను గుర్తించి విషయం చెప్పాడు. వెంటనే ఆమె నుండి తాళం తీసుకుని మళ్లీ మూడో అంతస్తుకు చేరుకుని డోర్ లాక్ తీశాడు. మరొకరి సాయంతో చిన్నారి భవికను కిటికీ గ్రిల్ నుంచి లోపలికి లాగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం 9:06 గంటల ప్రాంతంలో జరిగింది. ఫైర్ సిబ్బంది చవాన్ సకాలంలో స్పందించడంతో చిన్నారి ప్రాణాలు దక్కాయి.
లోకల్ హీరోకు స్థానికుల అభినందనలు
యోగేష్ అర్జున్ చవాన్ సమయస్ఫూర్తితో చిన్నారికి ప్రాణాపాయం తప్పింది. సకాలంలో స్పందించి మూడు ఫ్లోర్లు ఎక్కి, డోర్ లాక్ ఉండటంతో కిందకు పరిగెత్తి బాలిక తల్లిని అప్రమత్తం చేయడాన్ని స్థానికులు ప్రశంసించారు. ఆమె పైకి వచ్చేసరికి లేట్ అవుతుందని, ఆమె నుంచి లాక్ తీసుకుని సెకన్ల వ్యవధిలో పైకి వెళ్లి డోర్ లాక్ తీసి బాలికను కాపాడటంపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. రియల్ హీరో అని, మంచి మనసుతో వేగంగా స్పందిస్తే ఫలితం ఇలా ఉంటుందని ప్రశంసించారు.






















