Viral Video: ట్రెడ్మిల్ చేస్తూ కుప్ప కూలిన యువకుడు, గుండెపోటుతో మృతి - వైరల్ వీడియో
Viral Video: యూపీలో ఓ యువకుడు జిమ్‌లో ట్రెడ్మిల్ చేస్తూ గుండెపోటుతో కుప్ప కూలిపోయాడు.
Viral Video:
యూపీలో ఘటన..
యూపీలోని ఘజియాబాద్‌లో ఓ వ్యక్తి జిమ్‌లో ట్రెడ్మిల్ చేస్తుండగా కుప్ప కూలిపోయాడు. గుండెపోటుతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నోయిడాలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న యువకుడు ఉన్నట్టుండి కుప్ప కూలిపోవడం జిమ్ సిబ్బందిని టెన్షన్ పెట్టింది. కింద పడిపోగానే జిమ్ సిబ్బంది వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇద్దరు వ్యక్తులు వచ్చి ఏమైందో అని చూశారు. అప్పటికే పల్స్ పోయింది. ఊపిరి ఆగిపోయింది. రోజూలాగే వచ్చి జిమ్ చేసుకుంటున్న యువకుడు ఇలా ప్రాణాలు కోల్పోవడం షాక్‌కి గురి చేసింది. 10 నిముషాల క్రితమే ఇంటికి కాల్ చేసి తన తల్లితో మాట్లాడినట్టు స్నేహితులు చెబుతున్నారు. జిమ్‌లో పని చేసే ఇద్దరు వ్యక్తులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ట్రెడ్మిల్ చేసుకుంటూ పడిపోయాడని వైద్యులకు వివరించారు. పరీక్షించిన వైద్యులు...హార్ట్ అటాక్ వల్ల చనిపోయి ఉంటాడని చెప్పారు. ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తూ పడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. జిమ్ చేస్తూ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. గతేడాది నవంబర్‌లో ఓ నటుడు ఇలానే జిమ్ చేస్తూ గుండెపోటుతో చనిపోయాడు. ఫేమస్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కూడా ఇలానే వ్యాయామం చేస్తూ మృతి చెందాడు.
#Shocking
— Ravi Pratap Dubey (@ravipratapdubey) September 16, 2023
A 19 years old young man died while #running on a #treadmill in a #Gym in #Ghaziabad. #CCTV footage of this entire incident shows that this 19 year old boy fell on the treadmill and died.
It is believed that he died because of #heartattack #gymboy #run pic.twitter.com/9kuSZ0MlZC
ఫిట్నెస్ కోసం అవసరానికి మించి వ్యాయామం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కొందరు. జిమ్‌లోనే ఎక్స్‌ర్‌సైజ్ చేస్తూ హార్ట్‌అటాక్‌తో చనిపోయిన ఘటనలు ఈ మధ్య కాలంలో వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇండోనేషియాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. 33 ఏళ్ల జస్టిన్ విక్కీ (Justyn Vicky) ఫేమస్ బాడీ బిల్డర్. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే...జులై 15న జిమ్‌లో రోజూలాగే వ్యాయామం చేస్తున్నాడు. మెడపై 450 పౌండ్లకు మించిన బరువుని మోసేందుకు ప్రయత్నిస్తుండగా ఉన్నట్టుండి అది అదుపు తప్పింది. అంత బరువు ఒకేసారి పడడం వల్ల మెడ విరిగిపోయింది. స్క్వాట్స్ చేస్తుండగా వీడియో కూడా తీశారు. ఆ వెయిట్ అంతా మెడపై పడి అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. వెంటనే హాస్పిటల్‌కి తరలించారు. సర్జరీ చేసినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఫిట్నెస్ విషయంలో చాలా మంది స్ఫూర్తిగా నిలిచిన జస్టిన్ విక్కీ ఇలా ప్రాణాలుకోల్పోవడం సంచలనం కలిగించింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మంచి ఫాలోయింగ్ ఉన్న జస్టిన్ చాలా మందిని ప్రోత్సహించేవాడట. ఆయన చనిపోయాడని తెలిసినప్పటి నుంచి చాలా మంది తీవ్ర ఆవేదనతో పోస్ట్‌లు పెట్టారు. ఆయన కేవలం ఫిట్నెస్ ఎక్స్పర్ట్ మాత్రమే కాదని, అంతకు మించి గొప్ప వ్యక్తి అని ట్వీట్లు చేశారు.
Also Read: వాళ్లు చరిత్రను వక్రీకరించారు, ప్రధాని మోదీ సవరిస్తున్నారు - విమోచన దినోత్సవంలో అమిత్ షా