By: ABP Desam | Updated at : 05 Apr 2022 05:41 PM (IST)
భర్తకు తనపై ప్రేమ ఎంతో ఉందో "సాల్ట్ టెస్ట్" చేసిన భార్య ! రిజల్ట్ షాకింగే
వంట చేతకాని భార్య పంచదార అనుకుని ఉప్పు వేసుకుని తీసుకు వస్తే దాన్ని ఇతరులు తినకుండా చేయడానికి .. మొత్తం తానే తినేసే హీరో .. సీన్లు చాలా సినిమాల్లో చూసి ఉంటాం. నిజానికి అవి సినిమాలు కాబట్టి నడిచిపోతాయి. నిజంగానే ఉప్పు కశం కూరను తీసుకొచ్చి తినమంటే్ ఎంతటి ప్రేమ ఉన్న హీరో అయినా తట్టుకోగలడా? కష్టమే. రియల్‌గా అలాంటి ప్రయోగాలు ఎవరూ చేయరు. కానీ ఓ భార్య చేసింది. తన భర్తకు తన మీద ఎంత ప్రేమ ఉందో ఉప్పు టెస్ట్ చేయాలనుకుంది. అంటే... తాను మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసింది. కూర కూడా చేసింది. అయితే తాను చేసిన కూరను భర్తకు రుచి చూపించి టేస్ట్ తెలుసుకోవాలనకుంది. అయితే అసలు టెస్టులో ట్విస్టేమిటంటే... ఓ స్ఫూన్ సగానికి ఉప్పు తీసుకుని దానిపై తాను చేసి కర్రీని తీసుకుని భర్త వద్దకు వెళ్లింది. మొత్తం అతని నోట్లో పెట్టేసింది.
మామూలుగా అయితే ఉప్పు కశం.. ఆ పుసుక్కున ఊసేయాలి. కానీ ఆ భర్తకు ఆ ఉప్పు కశం కన్నా.. తమ భార్యపై ప్రేమే ఎక్కువగా ఉంది. అందుకే ఎక్కడ బాధపడుతుందో అని మొత్తం ఉప్పు కూరని మింగేశాడు. అంతే కాదు. ఆ ఫీలింగ్‌ను ఎక్కడా మొహంలో కనిపించనీయలేదు. పైగా బాగుందని .. భార్యను మెచ్చుకున్నాడు. భర్త ప్రేమను చూసి ఆ భార్య కూడా పొంగిపోయింది. మనసులో నవ్వుకుంది. ఈ మొత్తాన్ని వీడియో తీసి ఇన్‌స్టాలో పెట్టేసింది. మరి వైరల్ కాకుండా ఉంటుందా ?
అయితే వీరు కొత్తగా పెళ్లయిన వాళ్లు అయి ఉంటారని.. నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పెళ్లయిన ఓ ఆరు నెలల తర్వాత ఇలాంటి టెస్ట్ చేస్తే రిజల్ట్ డిఫరెంట్‌గా ఉంటుందంటున్నారు. అది నిజమే కవొచ్చు కానీ ఇక్కడ మాత్రం ట్రూలవ్ బయటపడిందని కొంత మంది కామెంట్ చేస్తున్నారు.
Gyanvapi Mosque Row: 'జ్ఞానవాపి'పై సుప్రీం విచారణ- మసీదుకు ఒక్కసారిగా 700 మంది ముస్లింలు!
Gyanvapi mosque case: 'జ్ఞానవాపి మసీదు'పై సుప్రీం కీలక ఆదేశాలు- కేసు వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ
Mathura Krishna Janmabhoomi: శ్రీకృష్ణ జన్మభూమి వివాదమేంటి? హిందూ- ముస్లింల ఒప్పందంలో ఏముంది?
Subramanian Swamy: నిత్యం కలలో పాములు కనిపిస్తున్నాయా, అయితే ఈ ఆలయానికి వెళ్లండి
Afghan Taliban Rules : టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే - తాలిబన్ల కొత్త రూల్ !
NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?
Kanika Kapoor Second Marriage: 'పుష్ప' సింగర్ రెండో పెళ్లి చేసుకుంది - ఫొటోలు చూశారా?
Begumbazar Honour Killing : బేగంబజార్ పరువు హత్య కేసు, కర్ణాటకలో నలుగురు నిందితులు అరెస్టు
Pooja Hegde: ‘కేన్స్’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!