అన్వేషించండి

Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!

UP News: యూపీలోని ఆస్పత్రిలో చిన్నారులు సజీవ దహనమైన ఘటనలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఓ నర్సు నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఓ ప్రత్యక్ష సాక్షి ఆరోపించారు.

Key Facts In Jhansi Hospital Fire Accident: యూపీ ఝాన్సీలోని (Jhansi) మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కళాశాలలోని (Maharani Laxmibhai Medical College) ఐసీయూలో ఘోర విషాద ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తోన్న సమయంలో మరో కీలక విషయం వెలుగుచూసింది. ఓ నర్సు నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు ఆరోపించారు. హమీర్‌పూర్‌కు చెందిన భగవాన్ దాస్ అనే వ్యక్తి కుమారుడు ఇంటెన్సివ్ కేర్‌ యూనిట్‌లో చికిత్స పొందుతున్నాడు. ఘటన జరిగిన సమయంలో భగవాన్ దాస్ అక్కడే ఉన్నాడు. యూనిట్‌లో విధులు నిర్వహిస్తోన్న ఓ నర్సు ఆక్సిజన్ సిలిండర్ పైప్‌ను కనెక్ట్ చేస్తోన్న సమయంలో దాని పక్కన మరో నర్సు అగ్గిపుల్ల వెలిగించిందని.. అందువల్లే ప్రమాదం జరిగిందని తెలిపాడు. అది ఆక్సిజన్ ఉన్న ప్రదేశం కావడంతో క్షణాల్లోనే మంటలు చుట్టుముట్టాయని.. వెంటనే నలుగురు పిల్లలను తన మెడకు బట్టలో చుట్టుకుని బయటకు పరిగెత్తానని చెప్పాడు. ఇతరుల సాయంతో మరికొంతమంది చిన్నారులను కాపాడగలిగామని పేర్కొన్నాడు.

తొక్కిసలాటతో పలువురికి గాయాలు

ఒక్కసారిగా మంటలు వ్యాపించి.. దట్టంగా పొగలు కమ్ముకోవడంతో ఆస్పత్రిలో ఉన్న వారు భయంతో పరుగులు తీశారని.. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి చాలామంది గాయాలపాలయ్యారని తెలిపాడు. వార్డులో గడువు ముగిసిన అగ్నిమాపక పరికరాలు ఉన్నాయని.. ప్రమాదం జరిగిన సమయంలో సేఫ్టీ అలారాలు మోగకపోవడంతో అందరు చిన్నారులను రక్షించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు, ఈ ప్రమాదంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ స్పందించారు. అగ్ని ప్రమాదానికి కారణమైన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని.. చిన్నారుల మరణాలకు కారణమైన వారిని వదిలిపెట్టమని అన్నారు.

ఇదీ జరిగింది

యూపీ ఝాన్సీ జిల్లాలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కళాశాల ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి చిన్నారులకు చికిత్స అందించే ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటల్ని గమనించి పేషెంట్లు, వారి బంధువులు భయాందోళనలకు గురై పరుగులు తీయడంతో తొక్కిసలాటకు దారితీసింది. మరోవైపు ఐసీయూ మొత్తం పొగతో నిండుకోవడంతో అక్కడి డాక్టర్లు, సిబ్బంది కిటికీ అద్దాలు బద్దలు కొట్టి శిశువులు, చిన్నారులను బయటకు తరలించారు. 35 నుంచి 40 మంది వరకు చిన్నారులను రక్షించారు. కానీ మరో 10 మంది శిశువులు ఈ దుర్ఘటనలో సజీవదహనమయ్యారు. ఆస్పత్రిలో గర్భిణీలను వారి బంధువులు క్షేమంగా బయటకు తరలించారు.

సీఎం యోగి దిగ్భ్రాంతి

ఈ దుర్ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం ఇస్తామని తెలిపారు.

Also Read: Most Ordered Item On Swiggy: కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - సిగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Upcoming 5G Smartphones: వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Upcoming 5G Smartphones: వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Cycle Yatra Beyond Borders: సైక్లింగ్ ద్వారా ప్రపంచాన్ని అన్వేషిస్తున్న యువకుడు- తండ్రి కలను నెరవేరుస్తున్న వరంగల్ వాసి
సైక్లింగ్ ద్వారా ప్రపంచాన్ని అన్వేషిస్తున్న యువకుడు- తండ్రి కలను నెరవేరుస్తున్న వరంగల్ వాసి
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Embed widget