Viral Video: వైపర్‌లా ప్లాస్టిక్ బాటిల్- యూపీ బస్సు డ్రైవర్ వీడియో వైరల్
Viral Video: వైరల్ అవుతున్న ఓ వీడియోలో యుపికి చెందిన ఒక బస్సు డ్రైవర్ వాటర్ బాటిల్‌తో వైపర్ పని చేసేలా ఎలా చేశారో మీరు చూడవచ్చు.
Viral Video: సృజనాత్మకమైన ఆలోచనతో ప్రత్యేకత చాటుకుంటున్న క్రియేటర్లకు భారతదేశంలో కొదవ లేదు. క్రియేటివ్ ఐడియాలతో సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వాళ్ల వీడియోలు మనకు చాలా కనిపిస్తాయి. అలాంటి కోవలోకే వచ్చాడు యుపిలోని ఓ బస్ డ్రైవర్. ప్రభుత్వ బస్సు నడిపే వ్యక్తి వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
ఉత్తరప్రదేశ్ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (యూపీఎస్ఆర్టీసీ) బస్సు వీడియో ట్విట్టర్లో వైరల్ అవుతోంది. ఒక డ్రైవర్ తన బస్సును నడపడం కోసం ఉన్న సమస్యను ఎలా అధిగమించాడో ఆ వీడియో చూపిస్తుంది. విపిన్ రాథోడ్ అనే ఐడితో ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 'ఉత్తరప్రదేశ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (యూపీఎస్ఆర్టీసీ) బస్సులో 'జుగాడ్'తో వైపర్ రన్నింగ్' అని క్యాప్షన్ ఇచ్చారు.
उत्तर प्रदेश परिवहन निगम की बस में जुगाड़ से चलता वाइपर 👇@UPSRTCHQ @UPSRTC_Meerut pic.twitter.com/IOofdiNbRE
— Vipin Rathaur (@VipinRathaur) October 9, 2022
ప్రజల నుంచి మిశ్రమ స్పందన
వైరల్ వీడియోలో యూపీఎస్ ఆర్టీసి బస్సు డ్రైవర్ లోపభూయిష్టమైన విండ్ షీల్డ్ వైపర్‌ను తాడుతో కట్టి ఉంటిన విషయాన్ని చూడవచ్చు. తాత్కాలికంగా తాడుతో కట్టిన వైపర్ పని చేయాలంటే దానికి మరో బాటిల్ యాడ్ చేశారు. నాలుగు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోపై కొందరు నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తే... మరికొందరు తీవ్ర విమర్శలు చేశారు. వీడియోలో చూపించిన విషయం వినోదాత్మకంగా ఉందని కొందరు కామెంట్ చేస్తే.. మరికొందరు వెహికల్ ఫిట్‌నెస్‌ను క్వశ్చన్ చేశారు.
ఆ తర్వాత ఏం జరిగిందంటే..
బస్సు వీడియో వైరల్ అయిన తరువాత, మీరట్ డిపో అధికారులు స్పందించారు. సంఘటన చూసిన వెంటనే వైపర్ ఈనెల ఎనిమిదో తేదీని రిపేర్ చేశామని బదులిచ్చింది.