అన్వేషించండి

ముస్లిం విద్యార్థితో హిందూ విద్యార్థిని కొట్టించిన టీచర్‌, యూపీలోనే మరో సంచలనం

Muzaffarnagar Teacher: ముజఫర్‌నగర్‌లో ఓ టీచర్‌ హిందూ విద్యార్థిని ముస్లిం విద్యార్థితో కొట్టించిన ఘటన సంచలనమైంది.

Muzaffarnagar Teacher:

ముజఫర్‌నగర్‌లోనే మరో ఘటన..

యూపీలో ముజఫర్‌నగర్‌లో నెల రోజుల క్రితం ఓ స్కూల్‌లో టీచర్‌ ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన ఘటన సంచలనమైంది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుండగానే మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. అదే ముజఫర్‌నగర్‌లో ఓ టీచర్ ముస్లిం విద్యార్థితో తోటి హిందూ విద్యార్థిని కొట్టించింది. దగ్గరుండి మరీ చెంపదెబ్బ కొట్టించింది. సెప్టెంబర్ 26వ తేదీన ఈ ఘటన జరిగింది. ఐదో తరగతి విద్యార్థిని టీచర్‌ కొన్ని ప్రశ్నలు వేసింది. కానీ ఆ ప్రశ్నలకు విద్యార్థి సమాధానాలు చెప్పలేదు. కోపంతో ఓ ముస్లి విద్యార్థిని పిలిచింది. సమాధానం చెప్పని ఆ విద్యార్థిని చెంపదెబ్బ కొట్టాలని చెప్పింది. టీచర్‌ చెప్పినట్టుగా చేశాడు ఆ విద్యార్థి. అయితే...దెబ్బలు తిన్న ఆ విద్యార్థి అప్పటి నుంచి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఇంట్లో కూడా ఎవరితో మాట్లాడడం లేదు. అనుమానం వచ్చి తల్లిదండ్రులు ఆరా తీశారు. అప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తండ్రి ప్రశ్నించగా ఈ విషయమంతా చెప్పాడు ఆ విద్యార్థి. వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి సెప్టెంబర్ 27న ఆ టీచర్‌పై కంప్లెయింట్ ఇచ్చారు. సెప్టెంబర్ 28న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఆ టీచర్‌ని అరెస్ట్ చేశారు. స్కూల్ యాజమాన్యం ఆ టీచర్‌ని విధుల్లో నుంచి తొలగించింది. 

యూపీలోని ముజఫర్‌నగర్‌లో ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో మహిళా టీచర్ ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన వీడియో సంచలనమైంది. నెల క్రితం జరిగిన ఈ ఘటనపై ఇంకా విచారణ కొసనాగుతూనే ఉంది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటన మొత్తం రాష్ట్రాన్నే వణికించిందని, ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో యూపీ ప్రభుత్వాన్నీ మందలించింది. ఈ కేసు విచారణకు వెంటనే ఓ IPS అధికారిని ప్రత్యేకంగా నియమించాలని ఆదేశించింది. వారం రోజుల్లోగా ఆ IPS అధికారి దీనిపై నివేదిక రూపొందించి కోర్టుకి సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ ఘటనలో బాధిత బాలుడికి కౌన్సిలింగ్ ఇవ్వాలని, మిగతా విద్యార్థులతోనూ మాట్లాడాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

"ఇది చాలా తీవ్రమైన విషయం. ఓ వర్గానికి చెందిన విద్యార్థిని టార్గెట్ చేసి తోటి విద్యార్థులతో చెంప దెబ్బ కొట్టించడం సహించరానిది. ఇదేనా చదువంటే..? ఆ బాధిత విద్యార్థి చదువు బాధ్యత అంతా ప్రభుత్వానిదే. నిజంగా ఓ వర్గానికి చెందిన విద్యార్థిని ఉద్దేశపూర్వకంగా కొట్టించారన్న ఆరోపణలు నిజమే అయితే కచ్చితంగా ఇది రాష్ట్రంలో అలజడి సృష్టిస్తుంది"

- సుప్రీంకోర్టు 

గత నెలలో యూపీలోని ముజఫర్‌నగర్‌లోని ఓ స్కూల్‌లో జరిగిన ఈ ఘటన సంచలనమైంది. ఓ ముస్లిం విద్యార్థిని ఓ హిందూ విద్యార్థితో కొట్టించింది మహిళా టీచర్. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఖబర్‌పూర్‌ గ్రామంలోని ఓ పాఠశాలలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే దీనిపై విచారణ మొదలు పెట్టారు.

Also Read: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి, పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి, సోదరుడు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Funeral Updates: ఢిల్లీలో కొనసాగుతున్న మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర, ఏఐసీసీ ఆఫీస్ నుంచి నిగమ్ బోధ్‌ వరకు
Manmohan Singh Funeral Updates: ఢిల్లీలో కొనసాగుతున్న మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర, ఏఐసీసీ ఆఫీస్ నుంచి నిగమ్ బోధ్‌ వరకు
KTR ED Notice: ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
Manmohan Singh Memorial : మన్మోహన్ సింగ్  స్మారక చిహ్నానికి స్థలం కేటాయింపుపై కేంద్రం క్లారిటీ
మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నానికి స్థలం కేటాయింపుపై కేంద్రం క్లారిటీ
New Year - Liquor Sales : మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సర్కార్ సన్నాహాలు
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ - న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సర్కార్ సన్నాహాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP DesamPir Panjal Rail Tunnel | ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇదే | ABP Desamరాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Funeral Updates: ఢిల్లీలో కొనసాగుతున్న మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర, ఏఐసీసీ ఆఫీస్ నుంచి నిగమ్ బోధ్‌ వరకు
Manmohan Singh Funeral Updates: ఢిల్లీలో కొనసాగుతున్న మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర, ఏఐసీసీ ఆఫీస్ నుంచి నిగమ్ బోధ్‌ వరకు
KTR ED Notice: ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
Manmohan Singh Memorial : మన్మోహన్ సింగ్  స్మారక చిహ్నానికి స్థలం కేటాయింపుపై కేంద్రం క్లారిటీ
మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నానికి స్థలం కేటాయింపుపై కేంద్రం క్లారిటీ
New Year - Liquor Sales : మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సర్కార్ సన్నాహాలు
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ - న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సర్కార్ సన్నాహాలు
Political Stunt: సినిమాల్లాగే తమిళ రాజకీయాల్లోనూ అతి ఎక్కువే - అన్నామలై చేసినట్లు తెలుగు ప్రతిపక్ష నేతలు చేయగలరా ?
సినిమాల్లాగే తమిళ రాజకీయాల్లోనూ అతి ఎక్కువే - అన్నామలై చేసినట్లు తెలుగు ప్రతిపక్ష నేతలు చేయగలరా ?
2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Kamareddy Crime News: కామారెడ్డిలో ఇంకా వీడని మిస్టరీ, ముగ్గురి మృతిపై ఆ ప్రచారంలో నిజం లేదు
కామారెడ్డిలో ఇంకా వీడని మిస్టరీ, ముగ్గురి మృతిపై ఆ ప్రచారంలో నిజం లేదు
Embed widget