Uttar Pradesh News: పుసుక్కని అలా కాల్చేశావ్ ఏంటి భయ్యా! బరాత్‌లో ఫ్రెండ్ మృతి!
Uttar Pradesh News: వరుడి తన బరాత్‌లో గాల్లోకి జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందాడు.
Uttar Pradesh News: తుపాకీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఎప్పుడు ఎలా పేలుతుందో చెప్పలేం. ఒక్కోసారి అనుకోకుండా కూడా తుపాకీ పేలి ఎంతో మంది పోలీసులు, జవాన్లు చనిపోయిన ఘటనలు మనం విని ఉంటాం. అయితే ఇక్కడ మాత్రం పెళ్లి కొడుకు తన పెళ్లి బరాత్‌లో తుపాకీ గాల్లోకి కాలిస్తే తన ఫ్రెండ్ చనిపోయాడు.
ఓ బరాత్ వేడుకలో భాగంగా ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లి కుమారుడు గాల్లోకి కాల్పులు జరిపాడు.
दूल्हे ने की हर्ष फायरिंग, आर्मी के जवान की हुई मौत। यूपी के @sonbhadrapolice राबर्ट्सगंज का #ViralVideo #earthquake #breastislife #fearwomen #Afghanistan pic.twitter.com/7laX9OUIqD
— RAHUL PANDEY (@BhokaalRahul) June 23, 2022
ప్రమాదవశాత్తు ఆ బుల్లెట్ స్నేహితుడికి తగిలింది. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తర్‌ప్రదేశ్ సోన్‌భంద్రా జిల్లాలోని బ్రహ్మనగర్‌లో ఈ ఘటన జరిగింది.
ఇలా జరిగింది
మనీష్ అనే పెళ్లి కుమారుడు తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి బరాత్ వేడుకలో భాగంగా ఊరేగింపుగా వెళ్తున్నాడు. మధ్యలో అకస్మాత్తుగా మనీష్ గాల్లోకి కాల్పులు జరిపాడు. ఆ బుల్లెట్ పెళ్లికుమారుడు స్నేహితుడు బాబు లాల్ యాదవ్‌కు తగిలింది. దీంతో అతను వెంటనే కింద పడిపోయాడు.
ఏం జరుగుతుందో తెలిసే లోపే అతడ్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ తన స్నేహితుడు యాదవ్ ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడ వరుడు ఉపయోగించిన తుపాకీ కూడా మరణించిన లాలూ యాదవ్ ఇచ్చినదే కావడం కొసమెరుపు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరుడిని అదుపులోకి తీసుకున్నారు. తుపాకీని కూడా పోలీసులు సీజ్ చేశారు.
ఇందుకు సంబధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే మారణాయుధాలతో ఇలా ఆటలు ఆడటం తగదని పోలీసులు మరోసారి హెచ్చరించారు. అసలు ఈ తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో పెళ్లింట విషాదం నెలొకొంది.
Also Read: Viral video: ఇదేం సెక్యూరిటీరా బాబు! ఇలా అయితే పిల్ల ఏనుగు కేంటి? PM కైనా ఏం కాదు!
Also Read: Watch Video: అయోధ్యలో స్నానాల ఘాట్‌లో భార్యతో భర్త రొమాన్స్- చితక్కొట్టిన జనం, వీడియో వైరల్!