Watch Video: అయోధ్యలో స్నానాల ఘాట్లో భార్యతో భర్త రొమాన్స్- చితక్కొట్టిన జనం, వీడియో వైరల్!
అయోధ్యలో తన భార్యను ముద్దు పెట్టిన ఓ భర్తను కొంతమంది చితక్కొట్టారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఉత్తర్ప్రదేశ్ అయోధ్యలో ఓ జంటకు వింత అనుభవం ఎదురైంది. సరయూ నదిలో పుణ్యం స్నానం చేస్తుండగా తన భార్యతో భర్త సరసం ఆడాడు. భార్యకు ముద్దులు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇది చూసిన జనం ఆ వ్యక్తి చుట్టూ గుమిగూడారు.
अयोध्या: सरयू में स्नान के दौरान एक आदमी ने अपनी पत्नी को किस कर लिया. फिर आज के रामभक्तों ने क्या किया, देखें: pic.twitter.com/hG0Y4X3wvO
— Suneet Singh (@Suneet30singh) June 22, 2022
చితక్కొట్టిన జనం
నదిలో స్నానం చేస్తున్న జనం ఆ భార్యాభర్తలను నిలదీశారు. భార్య వద్ద నుంచి భర్తను లాగేసి చితక్కొట్టారు. భార్య అడ్డుకునే ప్రయత్నం చేసినా అక్కడున్న వారు ఎవరూ వినలేదు. అయోధ్యలో ఇలాంటి అశ్లీలాన్ని సహించబోమన్నారు.
पूरा वीडियो डालना दोगले। ये है असली वजह की क्यों रगड़ दिया लोगों ने। सरयू नदी है पावन/पवित्र घाट, गोआ का बीच (beach) नहीं हैं की चो*म पट्टी शुरू कर दो पर नहीं तुम्हें तो आधा वीडियो डालकर "राम" नाम को जबरन बीच में लाना है। हिन्दूओं की आस्था तुम्हें नजर नहीं आती बस अजेंडा करवा लो pic.twitter.com/oUoycHm0ek
— Anonymous (@YourAnonHuman) June 22, 2022
భార్య ముందు భర్తను కొట్టుకుంటూ తీసుకువెళ్లారు. అసభ్య పదజాలంతో దూషించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే పవిత్రమైన సరయూ నదిలో పుణ్యస్నానాలు ఆచారించాలి కానీ, ఇలాంటి పనులు చేయరాదని అక్కడున్న వాళ్లు వీడియోలో అన్నారు. ఇలాంటి పనులు చేస్తే ఇలానే చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ వీడియో వైరల్ అవడంతో విషయం తెలుసుకున్న అయోధ్య పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Also Read: Viral News: బిహార్లో షాకింగ్ ఘటన- బాలుడ్ని కాటేసి వెంటనే చనిపోయిన పాము!
Also Read: Maharashtra Political Crisis: పతనం అంచున ఠాక్రే సర్కార్- 24 గంటల్లో మరో ఏడుగురు ఎమ్మెల్యేలు జంప్