Oil Pulling Benefits : ఆయిల్ పుల్లింగ్ రోజూ చేస్తే కలిగే లాభాలివే.. అందానికి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంటోన్న నిపుణులు
Benefits of Oil Pulling : ఉదయాన్నే ఆయిల్ పుల్లింగ్ చేస్తే నోటికే కాదు పూర్తి ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు. ఇంతకీ దానివల్ల కలిగే లాభాలు ఏంటి?
Oil Pulling for Teeth : ఉదయాన్నే అందరూ బ్రషింగ్ చేస్తారు. కానీ.. దానికంటే ముందు రోజూ ఓ పది నిమిషాలు ఆయిల్ పుల్లింగ్ చేస్తే నోటికే కాదు.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. ఇది కేవలం ఓరల్ హెల్త్, డెంటల్ సమస్యలకే అనుకుంటే పొరపాటే. అసలు ఈ ఆయిల్ పుల్లింగ్ ఎలా చేయాలి? దానివల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? ఎంతసేపు చేస్తే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలా చేయాలంటే..
కొబ్బరి నూనె లేదా సన్‌ఫ్లవర్ ఆయిల్, నువ్వుల నూనెను ఓ టేబుల్ స్పూన్ తీసుకుని.. దానిని నోట్లో వేసుకుని.. పొక్కులించాలి. 20 నిమిషాలు తర్వాత దానిని బయటకు ఉమ్మేయాలి. ఈ ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల నోటిలోని నూనె.. పళ్లమధ్యలో, నోటిలో చిక్కుకున్న సూక్ష్మజీవులను బయటకు లాగి.. వాటిని బయటకు పంపడంలో హెల్ప్ చేస్తుంది. ఇది నోటి ఆరోగ్యంపై ప్రభావవంతంగా ఉంటుందని కొన్ని శాస్త్రీయ అధ్యయనాలు కూడా నిరూపించాయి.
కొబ్బరి నూనెలో లేదా ఆవాల నూనెలో యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చిగుళ్ల వ్యాధులను రాకుండా చేస్తాయి. బాక్టీరియా పేరుకుపోవడం వల్ల నోటి దుర్వాసన, దంత క్షయం వచ్చే అవకాశాలు ఎక్కువ. ఆయిల్ పుల్లింగ్ వల్ల ఈ సమస్యలు పూర్తిగా దూరమైపోతాయి. అంతేకాకుండా దంతాలు తెల్లగా, శుభ్రంగా కనిపిస్తాయి. అంతేకాకుండా పంటిపై, నాలుకపై పాచి పట్టకుండా హెల్ప్ చేస్తాయి.
మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలకై..
ఆయిల్ పుల్లింగ్ కేవలం నోటి, దంత సమస్యలకు మాత్రమే అనుకుంటే పొరపాటే. గుండె జబ్బులు, వాపు, బోలు ఎముకల వ్యాధి, జీర్ణశయాంతర వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధి, టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ డిజార్డర్, చర్మ సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. సైనస్, తలనొప్పి, క్రానిక్ ఫెటిగో, నిద్రలేమి సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి. శరీరాన్ని డీటాక్స్ కూడా చేస్తుంది.
Also Read : నోటి బ్యాక్టీరియాతో పెరుగుతున్న పెద్దపేగు క్యాన్సర్.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు
ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల హానికరమైన బాక్టీరియా శరీరంలోని ఇతర భాగాలకు చేరకుండా ఉంటుంది. ఇది రుమాటాయిడ్ ఆర్థరైటిస్, శ్వాసకోశ అనారోగ్యం, మధుమేహం, అల్జీమర్స్, గుండె జబ్బులను దూరం చేస్తాయి. ఇవన్నీ చిగురువాపు, పీరియాంటైటిస్ వంటి చిగుళ్ల వ్యాధులపై ఇన్‌డైరక్ట్‌గా ప్రభావం చూపిస్తాయి. ఆయిల్ పుల్లింగ్ బాక్టీరియాను నిరోధించి.. ఈ సమస్యలు రాకుండా చేసి.. దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావాన్ని తగ్గిస్తాయ
అందానికి కూడా..
రెగ్యులర్‌గా ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల ముఖంపై కండరాలు బలపడతాయి. ఇవి టైట్‌గా మారి ముఖాన్ని వృద్ధాప్యఛాయలను దూరం చేస్తాయి. అంతేకాకుండా ముఖంలో రక్తప్రసరణను పెంచి.. మంచి గ్లోని అందిస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఆయిల్ పుల్లింగ్ని ప్రారంభించాలనుకుంటే.. 5 నిమిషాలతో ప్రారంభించాలి. రోజులు పెరిగే కొద్ది దానిని పెంచుకుంటూ పోవాలి. తర్వాత రోజుకు 20 నిమిషాలు దీనిని చేస్తూ ఉండాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఆయిల్‌ను మింగకూడదు.
Also Read : ఫ్రూట్స్‌తో కూడా బరువు తగ్గొచ్చు తెలుసా? వీటిని రెగ్యులర్‌గా తినండి, రిజల్ట్స్ మీరే చూస్తారు