అన్వేషించండి

Colon Cancer Causes : నోటి బ్యాక్టీరియాతో పెరుగుతున్న పెద్దపేగు క్యాన్సర్.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

Cancer with Mouth Bacteria : నోరు మంచిదైతే.. ఊరు మంచిది అవుతుంది అంటారు. ఊరు సంగతేమో కానీ.. నోరు మంచిగా లేకుంటే క్యాన్సర్ వస్తుంది అంటోంది తాజా అధ్యయనం. 

Colon Cancer Triggering with Mouth Bacteria : నోటి శుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే ఎన్నో కథనాలు వచ్చాయి. తాజా అధ్యయనం కూడా ఇదే చెప్తోంది. నోటిని శుభ్రంగా ఉంచుకోకపోతే నోటిలో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఇది పెద్ద పేగు క్యాన్సర్ పెరుగుదలను ప్రేరేపిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. కొత్త అధ్యయనం ప్రకారం నోటిలోని బ్యాక్టీరియా పేగుల్లోకి చేరి.. పెద్ద పేగు క్యాన్సర్ కణితుల్లో పెరుగుతుందని తేల్చారు. పెద్దపేగు క్యాన్సర్ పెరగడానికి అత్యంత ముఖ్యమైన కారణం ఇదేనని శాస్త్రవేత్తలు తెలిపారు. మరెన్నో విషయాలు ఈ స్టడీలో వారు గుర్తించనట్లు తెలిపారు. 

పెద్దపేగు క్యాన్సర్ కణితులపై పరిశోధన

అమెరికాలోని ఫ్రెడ్ హచ్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు.. నోటి బ్యాక్టిరియా క్యాన్సర్​ పెరుగుదలపై చూపించే ప్రభావాలను కనుగొనేందుకు పరిశోధనలు చేశారు. దీనిలో భాగంగా 200 మంది రోగుల నుంచి తొలగించిన పెద్దపేగు క్యాన్సర్ కణితులను పరిశీలించారు. ఫ్యూసోబ్యాక్టీరియం న్యూక్లియేటమ్ అనే నోటి బ్యాక్టీరియాను వాటిలో గుర్తించారు. ఈ అధ్యయనంలో పరీక్షించిన 50 శాతం కణితుల్లో నోటి బ్యాక్టీరియా ఉన్నట్లు కనుగొన్నారు. తాజాగా అధ్యయనంకి  సంబంధించిన విషయాలను నేచర్ జర్నల్​లో ప్రచురించారు. 

ఇండియాలో ఈ క్యాన్సర్ బాధితులు ఎక్కువే..

పెద్ద పేగు క్యాన్సర్ చికిత్సకు తీసుకునే మందులను కూడా ఈ బ్యాక్టీరియా ప్రభావితం చేస్తుందని తెలిపారు.  ఈ పెద్ద పేగు క్యాన్సర్​ ఇండియాలోని మొదటి పది అత్యంత సాధారణ రకాల క్యాన్సర్​లలో ఒకటి. దీనికి అనేక చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. స్క్రీనింగ్ పద్ధతులు సమస్యను తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కానీ.. నోటిని శుభ్రంగా ఉంచుకోకపోతే క్యాన్సర్ పెరిగే అవకాశాలే ఎక్కువ అవుతాయి. తద్వార క్యాన్సర్​ మరింత పెరిగి.. ప్రాణాంతకమవుతుంది. 

రోగనిరోధక శక్తిని తగ్గించేస్తుంది..

నోటి బ్యాక్టీరియా ప్రభావం లేనివారితో పోలిస్తే.. ఈ నోటి బ్యాక్టీరియా ఉన్న వారి రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. పైగా వారి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిందని ఫ్రెడ్ హచ్ క్యాన్సర్ మైక్రోబయోమ్ పరిశోధకులు తెలిపారు. సూక్ష్మజీవి నోటి నుంచి గట్​లోకి ఎలా వెళ్తోంది.. క్యాన్సర్ పెరుగుదలకు ఎలా కారణమవుతుందనే విషయాలను వారు కనుగొన్నారు. పెద్ద పేగు క్యాన్సిర్ కణితుల్లో ఫ్యూసోబాక్టీరియం న్యూక్లియేటం అనే ప్రధాన సమూహం ఉంటుంది. ఇది క్లేడ్స్ అనే రెండు భిన్నమైన వంశాలను కలిగి ఉంటుంది.

ట్యూమర్​ను ప్రభావితం చేసే క్లేడ్స్

ఈ క్లేడ్స్​ మధ్య జన్యుపరమైన తేడాలను వేరు చేసి.. ట్యూమర్ ఇన్​ఫిల్ట్రేటింగ్ Fna C2 రకం జన్యు లక్షణాలను పొందుతున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఇది నోటి నుంచి కడుపు ద్వారా ప్రయాణించి.. కడుపు ఆమ్లాన్ని తట్టుకుని.. తర్వాత జీర్ణాశయాంతర పేగులలోకి వెళ్తున్నట్లు గుర్తించారు. ఇది క్యాన్సర్ పెరుగుదలకు కారణమవుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ఇదే కాకుండా వివిధ ఆరోగ్య సమస్యలను కంట్రోల్ చేయాలంటే.. నోటి బ్యాక్టీరియాను తగ్గించుకోవాలి అంటున్నారు.

Also Read : ప్రపంచవ్యాప్తంగా ఆ సమస్యలో ఇండియానే టాప్​.. దాని నిర్మూలన కోసమే ఏటా అవగాహన సదస్సులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget