US India Trade Deal: మోదీ- ట్రంప్ ఫోన్ కాల్‌తో మారిన సీన్.. ట్రేడ్ డీల్ సహా మారిన విషయాలివే
US-India Trade Deal: అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోడానికి మరోసారి చర్చ జరిగింది. డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

US- India Trade Deal | చాలా నెలల అనిశ్చితి, పెరుగుతున్న వాణిజ్య ఒత్తిడి తర్వాత అమెరికా, భారత్ మధ్య ట్రేడ్ డీల్ దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత సోమవారం రాత్రి సీన్ మారిపోయింది. భారత్‌పై విధించిన 25 శాతం అదనపు టారిఫ్‌ను 18 శాతానికి తగ్గించినట్లు ప్రకటించారు. అది మంగళవారం భారత స్టాక్ మార్కెట్లో సెన్సెక్ట్, నిఫ్టీ 50 భారీగా పుంజుకున్నాయి.
ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో ఇలా రాసుకొచ్చారు. ‘భారత ప్రధాని మోదీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా, గౌరవంగా ఉంది. నా బెస్ట్ ఫ్రెండ్స్‌లో మోదీ ఒకరు. భారత్‌కు పవర్‌ఫుల్, గొప్ప నాయకుడు. ప్రధాని మోదీ పట్ల స్నేహం, గౌరవంతో ఆయన అభ్యర్థన మేరకు, అమెరికా- భారత్ మధ్య తక్షణమే అమల్లోకి వచ్చేలా వాణిజ్య ఒప్పందం కోసం మేం అంగీకరించాం. ప్రస్తుతానికి భారత్ మీద అమెరికా రెసిప్రోకల్ టారిఫ్‌ను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తుంది’ అన్నారు.
18 శాతానికి టారిఫ్ తగ్గించిన అమెరికా
రెండు దేశాల అధినేతల మధ్య జరిగిన చర్చల అనంతరం భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే రెసిప్రోకల్ టారిఫ్‌ను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించినట్లు ట్రంప్ తెలిపారు. నిన్నటివరకూ ఈ టారిఫ్ 25 శాతంగా ఉంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒత్తిడి కారణంగా సానుకూల నిర్ణయం తీసుకున్నారు.
రష్యా నుంచి చమురు కొనుగోలుపై అడిషనల్ టారిఫ్
ఒప్పందం ప్రకారం, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా అమెరికా భారత్ వస్తువులపై విధించిన 25 శాతం అదనపు సుంకాన్ని విధించింది. రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయడానికి భారత్ అంగీకరించడంతో ఈ అదనపు సుంకాన్ని అమెరికా తొలగించింది. ఈ విషయాన్ని అమెరికా అధికార ప్రతినిధి తెలిపారు.
టారిఫ్ నిర్ణయాలపై తగ్గుతున్న అమెరికా
ఈ ఒప్పందం అమెరికా ఆగస్టు 2025లో తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గడమే. ఆ సమయంలో అమెరికా భారత్ నుంచి వెళ్లే వస్తువులపై 50 శాతం (రష్యా చమురు వల్ల 25 శాతం టారిఫ్ ) వరకు టారిఫ్ పెంచింది. దీనివల్ల ఇంజనీరింగ్ వస్తువులు, బట్టలు, రసాయనాలు, కార్ల విడిభాగాల వంటి అనేక వ్యాపారాలపై కొంతమేర ప్రభావం చూపింది.
భారత్ అమెరికా నుంచి ఏం కొనుగోలు చేస్తుంది..
భారత్ అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఎనర్జీ, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు, ఇతర వస్తువులను కొనుగోలు చేస్తుందని ట్రంప్ తెలిపారు. దీనితో పాటు, భారత్ అమెరికా వస్తువులపై విధిస్తున్న కొన్ని సుంకాలను క్రమంగా తొలగించడానికి చర్యలు చేపట్టనున్నారు.
ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలిపారు. “మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై ఇప్పుడు కేవలం 18 శాతం టారిఫ్ మాత్రమే” అని ఆయన చెప్పారు. ఈ నిర్ణయం 1.4 బిలియన్ల భారత ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఊరట కలించనుంది. భారత్ నుంచి గతంలో మాదిరిగా పలు ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి కానున్నాయి..
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
ట్రెండింగ్ వార్తలు






















