Low Cost Airlines: తక్కువ ఖర్చుతో ఎయిర్‌లైన్ సర్వీసులు- భారతీయ విమానయానంలో సరికొత్త అధ్యాయం
UDAN News | తక్కువ ఖర్చుతో ఎయిర్‌లైన్ సర్వీసులు ప్రారంభించడంతో భారతీయ విమానయానంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. బడ్జెట్ ధరలకే విమాన ప్రయాణాలు చేయడానికి అవకాశం లభిస్తుంది.
Low Cost Airlines in India | భారత విమానయాన రంగంలో బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ప్రవేశంతో సరికొత్త మార్కెట్ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. గోవా కేంద్రంగా ఉన్న FLY91 విమానయాన సంస్థ ప్రజలకు సరసమైన ధరల్లో విమాన సేవలు అందిస్తోంది. ఈ సంస్థ జల్గావ్, సింధుదుర్గ్, లక్షద్వీప్, ఆగట్టి వంటి టియర్-2, టియర్-3 పట్టణాలతో పాటు, హైదరాబాద్, బెంగళూరు, గోవా వంటి ప్రథాన నగరాల్లోనూ తమ విమాన సర్వీసులను ప్రారంభించింది.
ఇక భారత్ లో అత్యంత చవక టికెట్ ధర అందించే Alliance Air విమానయ సంస్థ కూడా టియర్-2, టియర్-3 నగరాలకు ప్రత్యేక సేవలను అందించేందుకు కృషి చేస్తోంది. Alliance Air లక్నో, జైపూర్, విశాఖపట్నం, మదురై, కోచ్చి వంటి నగరాలతో పాటు అహ్మదాబాద్, గోవా, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు సేవలు అందిస్తుంది. ఈ రెండు సంస్థలు కలిసి, విమానయాన రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాయి.
UDAN పథకం:
2017 ఏప్రిల్‌లో ప్రారంభించిన UDAN (ఉడే దేశ్ కా ఆమ్ నాయక్) పథకం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ మరియు ప్రైవేట్ విమానయాన సంస్థలు చిన్న పట్టణాలకు మరింత సేవలు అందించేందుకు ప్రేరణ పొందుతున్నాయి.
ప్రయోజనాలు:
UDAN పథకం ద్వారా ప్రజలకు సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణం అందించడం, పర్యాటక, వ్యాపార అవకాశాలను పెంచడం ద్వారా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు కనెక్టివిటీ పెరిగింది. ఈ పథకం కింద, భారత ప్రభుత్వం 100కి పైగా విమానాశ్రయాలను అభివృద్ధి చేసింది, ఇది విమానయానంలో అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చే మెరుగైన దారితీస్తోంది.
విమాన మోడళ్ల వివరణ:
తక్కువ ఇంధన వినియోగంతో ATR 72-600 విమానాలను ఉపయోగించడం ద్వారా, ఒక్కో ప్రయాణంలో 72-76 ప్రయాణికులను సౌకర్యంగా తీసుకువెళ్లగలరు. Alliance Air ప్రస్తుతం 18 ATR 72-600 మోడల్ విమానాలు, 2 ATR 48-600 విమానాలను ఉపయోగిస్తుంది, ఇవి 70-78 ప్రయాణికులను సౌకర్యంగా తీసుకువెళ్లగలవు.
బడ్జెట్ ఎయిర్లైన్ సేవలు:
FLY91, Alliance Air వంటి బడ్జెట్ ఎయిర్లైన్స్ తక్కువ ధరలో టిక్కెట్లు అందించడం, సీటు ఎంపిక, భోజనం వంటి సేవలను తక్కువ ఛార్జ్‌లతో అందించడం ద్వారా విమాన సేవలను అందుబాటులోకి తెచ్చి ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. FLY91 సంస్థ రాబోయే రెండు సంవత్సరాల్లో 30-35 విమానాలను నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది, చిన్న పట్టణాలు, పర్యాటక కేంద్రాలు, వ్యాపార ప్రాంతాలను అనుసంధానించి ప్రయాణ అనుభవాన్ని బడ్జెట్ ధరల్లో అందించేందుకు కృషి చేస్తోంది. Alliance Air కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఆపరేషన్స్‌ను విస్తరించేందుకు కొత్త మార్గాలను ప్రవేశపెడుతోంది.
ఈ విధంగా, FLY91, Alliance Air వంటి లో కాస్ట్ ఎయిర్ కారియర్స్ భారతదేశంలో విమానయాన రంగానికి సరికొత్త ట్రెండ్ సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, విస్తారా వంటి ఫుల్ సర్వీస్ ఎయిర్ క్రాఫ్ట్స్ అందుబాటు లో ఉన్నప్పటికీ వాటికి ధీటుగా ప్రస్తుతం ఈ చిన్న సంస్థలు ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి.
ప్రజలకు సరసమైన ధరలతో విమాన ప్రయాణాన్ని అందించడం ద్వారా ఖరీదైన విమాన ప్రయాణ చార్జీలకు సంబంధించి అడ్డంకులను తొలగిస్తున్నారు. పెరుగుతున్న విమాన ప్రయాణ అవసరాలను తీర్చడం తో పాటు, సామాన్య ప్రజలకు ఆర్థిక అవకాశాలను మెరుగుపరచడానికి ఈ విమానయాన సంస్థలు తమ వంతు కృషి చేస్తున్నారు.
Also Read: Well of Death: ప్రాణాలు పణంగా పెట్టి సాహసం, ప్రేక్షకులను ఉత్సాహపరిచేందుకు మహిళ విన్యాసాలు