పంట పొలాల్లో ల్యాండ్ అయిన ఎయిర్‌క్రాఫ్ట్, పైలట్‌లకు గాయాలు
Trainee Aircraft: కర్ణాటకలోని కలబురగిలో ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్ పంట పొలాల్లో అత్యవసర ల్యాండింగ్ అయింది.
Trainee Aircraft:
కలబురగిలో ఘటన..
కర్ణాటకలో ఓ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. కర్ణాటకలోని కలబురగిలో ఈ ఘటన జరిగింది. సాంకేతిక సమస్య కారణంగా ఉన్నట్టుండి రెడ్‌బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌ని ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో విమానంలో ఇద్దరు మహిళా పైలట్‌లున్నారు. ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. అయితే...ఎమర్జెన్సీ ల్యాండింగ్ కారణంగా ఇద్దరికీ స్వల్ప గాయాలైనట్టు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించామని, ఇద్దరి ఆరోగ్య పరిస్థితి స్టేబుల్‌గా ఉందని వివరించారు. పంట పొలాల్లో పడిపోవడం వల్ల కొంత మేర పంట నష్టం జరిగింది. కలబురగి ఎయిర్‌పోర్ట్ ట్రైనింగ్ సెంటర్ నుంచి బయల్దేరిన ఆ విమానం...ఉదయం 9 గంటల ప్రాంతంలో పంటపొలాల్లో ల్యాండ్ అవ్వగా...ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. టేకాఫ్ అయిన కాసేపటికే ఏదో ఓ టెక్నికల్ ఎర్రర్ తలెత్తడం...అవి ఉన్నట్టుండి ల్యాండ్ అవ్వడం వల్ల పైలట్స్‌కి గాయాలవుతున్నాయి. ఒక్కోసారి ఈ సాంకేతిక సమస్యలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. గతంలో జమ్ముకశ్మీర్‌లో ఓ చాపర్ కూలిపోయి ఓ పైలట్ మృతి చెందాడు. ఇటీవల మరోసారి ఇలాంటి దుర్ఘటనే జరిగింది. రాజస్థాన్‌లోని హనుమాన్‌మార్గ్‌లో ఆర్మీ హెలికాప్టర్ కుప్ప కూలింది. సూరత్‌గర్ నుంచి టేకాఫ్ అయిన చాపర్...కాసేపటికే కూలిపోయింది. పారాచూట్ సాయంతో పైలట్ సహా కో పైలట్ కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.
Karnataka | A trainee aircraft of Redbird flight training academy made an emergency landing near Pethsirur village in Kalaburagi around 9.30am today due to a technical problem. One pilot-cum- instructor and another trainee pilot were on the flight. Both are safe.
— ANI (@ANI) June 25, 2023
Kalaburagi… pic.twitter.com/c7BDW23Dz4
ఇటీవలే ఓ ఘటన..
కర్ణాటకలోనే జూన్ 1వ తేదీన చామ్‌రాజ్‌నగర్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ కుప్ప కూలింది. కూలగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో అందులో ఇద్దరు పైలట్లు ఉన్నారు. ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయని, సురక్షితంగా ఉన్నారని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. బెంగళూరుకు 136 కిలోమీటర్ల దూరంలో ఉన్న చామ్‌రాజ్‌నగర్‌లో రొటీన్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఉన్నట్టుండి పంట పొలాల్లో కూలిపోయింది. ఈ క్రాష్‌కి కారణమేంటన్నది మాత్రం ఇంకా తేలలేదు. ప్రస్తుతం దీనిపై విచారణ చేపట్టనున్నట్టు అధికారులు వెల్లడించారు.
"కిరణ్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ మకాలి గ్రామంలోని చామ్రాజ్నగర్ వద్ద పంటపొలాల్లో కుప్ప కూలింది. ప్రమాద సమయంలో ఇద్దరు పైలట్లు ఉన్నారు. వీరిలో ఓ మహిళా పైలట్ కూడా ఉన్నారు. ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి కారణమేంటో విచారణ జరపుతాం"
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్
VIDEO | Visuals from the site in Karnataka's Chamarajanagar where an IAF trainer aircraft crashed earlier today. pic.twitter.com/ozXQGGQQ0D
— Press Trust of India (@PTI_News) June 1, 2023
Also Read: PM Modi Award: ప్రధాని మోదీకి మరో అత్యున్నత అవార్డు, ఆర్డర్ ఆఫ్ ది నైల్‌తో సత్కరించిన ఈజిప్ట్