PM Modi Award: ప్రధాని మోదీకి మరో అత్యున్నత అవార్డు, ఆర్డర్ ఆఫ్ ది నైల్‌తో సత్కరించిన ఈజిప్ట్
PM Modi Award: ప్రధాని నరేంద్ర మోదీకి ఈజిప్ట్ ఆర్డర్ ఆఫ్ ది నైల్ అవార్డుతో సత్కరించింది.
PM Modi Award:
ఈజిప్ట్ పర్యటన..
ఈజిప్ట్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశం అత్యున్నత పురస్కారం అందించింది. అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తాహ్ ఎల్ సిసి (Abdel Fattah El-Sisi) Order of the Nile పురస్కారాన్ని మోదీకి అందజేశారు. ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. వీటిపై ఇద్దరూ సంతకాలు చేసిన తరవాత అబ్దేల్...మోదీకి శాలువా కప్పి ఈ అవార్డు ఇచ్చారు. అబ్దేల్‌ని కలిసే ముందు ప్రధాని మోదీ Al-Hakim మసీదుని సందర్శించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికులకు నివాళులర్పించారు. అక్కడే అరగంట పాటు గడిపారు. ఈజిప్ట్‌కి చెందిన వాళ్లకే కాకుండా మానవతా దృక్పథంతో ఈజిప్ట్‌కి సాయం అందించే ఎవరికైనా ఈ ఆర్డర్ ఆఫ్ ది నైల్ అవార్డు ఇస్తారు. ఈ అవార్డు అందుకున్న వారికి ఈజిప్ట్‌లో గౌరవ వందనం లభిస్తుంది. ఈ అవార్డు దక్కడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు మోదీ. అక్కడి కీలక నేతలతో చర్చించిన ప్రధాని...భారతీయులతోనూ మాట్లాడారు. ఇదే క్రమంలో గ్రాండ్ మఫ్తీ ఆఫ్ ఈజిప్ట్ డాక్టర్ షాక్వీ ఇబ్రహీం అబ్దేల్ కరీమ్ అల్లమ్‌తోనూ భేటీ అయ్యారు. గత 9 ఏళ్లలో ప్రధాని మోదీకి దక్కిన 13వ అత్యున్నత పురస్కారం ఇది.
#WATCH | Egyptian President Abdel Fattah al-Sisi confers PM Narendra Modi with 'Order of the Nile' award, in Cairo
— ANI (@ANI) June 25, 2023
'Order of the Nile', is Egypt's highest state honour. pic.twitter.com/e59XtoZuUq
The list of awards PM Modi received during the last 9 years of his tenure includes- 'Companion of the Order of Logohu' by Papua New Guinea, 'Companion of the Order of Fiji', Ebakl Award by the Republic of Palau, Order of the Druk Gyalpo, Legion of Merit by the US Government. pic.twitter.com/DAsbJbsZ5f
— ANI (@ANI) June 25, 2023
పపువా న్యూ గినియాలోనూ అవార్డు..
ప్రధాని నరేంద్ర మోదీకి భారత్‌లోనే కాదు. విదేశాల్లోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన ఎక్కడికెళ్లినా స్పెషల్ అట్రాక్షన్ అవుతారు. మే నెలలో పపువా న్యూ గినియా కు ( Papua New Guinea) వెళ్లారు. అక్కడ నిర్వహించిన మూడవ ఇండియా ఫసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ FIPIC సదస్సులో పాల్గొన్నారు. పపువా రాజధాని పోర్ట్ మోర్సబేలో జరిగిన ఈ సదస్సులో పపువా న్యూ గినియా, ఫిజి, పలావు, కిరిబాటీ సహా 14 ద్వీప దేశాలు పాల్గొన్నాయి. ఫసిఫిక్ మహా సముద్రం ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేలా గత పర్యటనలో FIPIC ని లాంఛ్ చేసిన ప్రధాని మోదీ..ఇప్పుడు ఆయనే నేరుగా సమావేశంలో పాల్గొనడనం వల్ల ఆయా ద్వీప దేశాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ఫిజీ తమ దేశ అత్యున్నత పురస్కారం ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫిజీ తో (The Companion of the Order of Fiji)మోదీని సత్కరించింది. ఫిజీ ప్రధాని సిటివేని రబుకా మోదీ మెడలో వేశారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం స్పందించింది. అరుదైన గౌరవం లభించిందంటూ ట్వీట్ చేసింది.
PM @narendramodi has been conferred the highest honour of Fiji, the Companion of the Order of Fiji. It was presented to him by PM @slrabuka. pic.twitter.com/XojxUIKLNm
— PMO India (@PMOIndia) May 22, 2023
Also Read: PM Modi Egypt Visit: షోలే పాటతో ఈజిప్ట్‌కి వెల్కమ్ చెప్పిన మహిళ, ఇంప్రెస్ అయిన ప్రధాని మోదీ