Train Accident: పట్టాలు తప్పిన సుర్మతి ఎక్స్‌ప్రెస్- ఉత్తర్‌ప్రదేశ్‌లో తప్పిన ఘోర ప్రమాదం
Kanpur Train Accident: రైలు ఇంజిన్‌ను రాళ్లు ఢీకొట్టినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. దీని వల్ల ప్రమాదం జరిగినట్టులోకో పైలట్ చెప్పారు.
Uttar Pradesh Train Accident: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. కాన్పూర్- భీమ్ సేన్ స్టేషన్ల మధ్య నడిచే రైలు నెంబర్ 19168 సబర్మతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. భీమ్‌సేన్ స్టేషన్ మధ్య బ్లాక్ సెక్షన్‌లో ఈ ఘరం జరిగింది. ఈ దుర్ఘటనలో ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు. కాన్పూర్ సహా వివిధ గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులను బస్సుల్లో అక్కడి నుంచి తరలించారు.
రైలు కాన్పూర్ నుంచి సబర్మతి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. భీంసేన్ స్టేషన్‌కు కొద్ది దూరంలోనే ట్రైన్ ప్రమాదానికి గురైంది. ఇంజిన్‌ను రాళ్లు ఢీకొనడంతో కాటిల్ గార్డు తీవ్రంగా దెబ్బతిని వంగి ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని లోకో పైలట్ తెలిపారు. దీంతో రైలు పట్టాలు తప్పిందన్నారు. అయితే పూర్తి విచారణ తర్వాతే ఏదో ఒకటి చెప్పగలమన్నారు.
22 బోగీలు పట్టాలు తప్పడంతో కలకలం
ఒకేసారి ట్రైన్‌లోని 22 బోగీలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురై ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. దీంతో గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రమాద గురించిన సమాచారం తెలిసిన వెంటనే కాన్పూర్ డీఎం రాకేశ్ కుమార్ సింగ్, ఏడీఎంలు అక్కడకు చేరుకున్నారు. పరిస్థితి సమీక్షించారు. సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని కాన్పూర్ డీఎం రాకేశ్ కుమార్ సింగ్ తెలిపారు. 22 బోగీలు పట్టాలు తప్పాయని వివరించారు. ఈ ప్రమాదంలో కొందరికి స్వల్ప గాయాలైనట్టు పేర్కొన్నారు. ఎవరూ తీవ్రంగా గాయపడలేదన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ పిలిపించారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు బస్సులు ఏర్పాటు చేశారు.
సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి. సబర్మతి ఎక్స్ ప్రెస్‌కు చెందిన అన్ని బోగీలు పట్టాలు తప్పాయి. రైలు ప్రమాదం జరగని రోజంటూ ఉండకపోవచ్చు. ఇది చిన్న ప్రమాదంగా రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ చెబుతున్నారు. ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారు. అసమర్థ రైల్వే మంత్రి ఎప్పుడు రాజీనామా చేస్తారని సమాజ్‌వాది పార్టీ ప్రశ్నించింది.