Portuguese Civil Code in Goa: గోవాలో వింత చట్టం, మగపిల్లాడు పుట్టకపోతే మళ్లీపెళ్లి! కారణం ఇదీ
Portuguese Civil Code in India : 22వ లా కమిషన్ దేశ ప్రజలు, మతసంస్థల నుంచి 30రోజుల్లో అభిప్రాయాలు సేకరించాలని కోరటంతో ఉమ్మడి పౌరస్మృతి - యూనిఫాం సివిల్ కోడ్ మళ్లీ చర్చలోకి వచ్చింది.
Portuguese Civil Code in Goa :
- మగపిల్లాడు పుట్టకపోతే మళ్లీ పెళ్లి
- 156 ఏళ్లుగా అమలవుతున్న చట్టం
- గోవాలో అమల్లో ఉన్న పోర్చుగీస్ సివిల్ కోడ్
- 1867లో ప్రవేశపెట్టిన పోర్చుగీస్
- హిందూ మగవారికి ప్రత్యేక వెసులుబాటు
- హిందూ వర్తకులను ఆకర్షించేందుకు మినహాయింపు
- స్వాతంత్య్రం పొంది భారత్ లో కలిసినా ఇంకా చట్టం
- మార్పులు చేయకపోవటంతో కొనసాగుతున్న చట్టం
22వ లా కమిషన్ దేశ ప్రజలు, మతసంస్థల నుంచి 30రోజుల్లో అభిప్రాయాలు సేకరించాలని కోరటంతో ఉమ్మడి పౌరస్మృతి - యూనిఫాం సివిల్ కోడ్ మళ్లీ చర్చలోకి వచ్చింది. దేశమంతా అన్ని మతాలు, కులాలకు ఒకే చట్టం ఉండాలని చెప్పేదే యూనిఫాం సివిల్ కోడ్. దీన్ని అమలు చేయాలని ఎప్పటి నుంచో ప్రభుత్వాలు భావిస్తున్నా..ఆయా మతాలనురించే వారి స్వేచ్ఛకు భంగం కలిగించే చట్టం అవుతుందని అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. దేశమంతటి సంగతి ఎలా ఉన్నా ఎప్పటి నుంచో యూనిఫాం సివిల్ కోడ్ అమలవుతున్న రాష్ట్రం ఒకటి ఉంది. అదే గోవా.
గోవా, డయ్యూడామన్, దాద్రానగర్ హవేలీల్లో ఎప్పటి నుంచో యూనిఫాం సివిల్ కోడ్ ఉంది. అయితే అది మన దేశానిది కాదు పోర్చుగీసు సివిల్ కోడ్. ఎందుకంటే ఈ ప్రాంతాలన్నీ స్వతంత్రానికి ముందు పోర్చుగీసు పాలనలో ఉండేవి. అలా 1867లో పోర్చుగల్ పోర్చుగీసు సివిల్ కోడ్ ను గోవా, దాద్రానగర్ హవేలీ, డయ్యూ అండ్ డామన్ లో అమల్లోకి తీసుకువచ్చింది. భారత దేశానికి 1947లోనే స్వతంత్రం వచ్చినా...1961 వరకూ గోవా సహా పోర్చుగీసు పాలిత ప్రాంతాలు ఆ దేశం ఆధీనంలోనే ఉన్నాయి.
1961లో గోవా స్వాతంత్య్రం పొంది భారత్ లో కలిసింది. అయినా స్టిల్ ఇంకా అక్కడ పోర్చుగీసు సివిల్ కోడ్ అమలవుతూనే ఉంది. i ఎందుకంటే వాళ్లు స్వతంత్ర్యం పొందేప్పుడు కొత్త చట్టం చేస్తోనో... లేదా సవరణలు చేసుకుంటూనే తప్ప ఇదే చట్టం అమలు చేసుకోవచ్చని ఓ నిబంధన రాయించుకుంది అప్పట్లో. అంటే ఈ చట్టం ప్రకారం గోవాలో మతాలకు ప్రత్యేక చట్టాలు ఉండవు. అందరూ చట్టం ముందు సమానమే. కానీ హిందూమగవారికి ఓ వెసులుబాటు ఉంటుంది. పాతికేళ్లలోపు భార్య బిడ్డకు జన్మనివ్వకపోయినా...30ఏళ్ల లోపు మగబిడ్డకు జన్మనివ్వకపోయినా ఆ భర్త మరో పెళ్లి చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ రూల్ అప్పట్లో హిందూ వర్తకులను తమ దేశంవైపు ఆకర్షించుకోవటం కోసం పోర్చుగల్ పెట్టింది.
ఈ చట్టం పెట్టిన పోర్చుగల్ 1966లో తమ దేశంలో సవరణలు చేసి ఈ రూల్ ను తీసేసినా అప్పటికి స్వతంత్రం ఇండియాలో కలిసిపోయింది గోవాలో మార్చే హక్కు కోల్పోయింది. ఇటు ఇండియాలో ఉమ్మడి పౌరస్మృతి కాన్సెప్ట్ లేదు కాబట్టి ఇన్నేళ్లయినా ఇంకా ఆ హక్కు గోవాలో హిందూ మగవారికి ఉంది. కానీ ఈచట్టం ద్వారా మినహాయింపు పొందిన వాళ్లు ఇప్పటివరకూ ఒక్కరు కూడా లేరని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఇటీవల ఓసారి చెప్పారు. ఈ ఒక్క మినహాయింపు తప్ప తమ రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ 156ఏళ్లు పైగా అమల్లోకి ఉందని చెప్పారు.