అన్వేషించండి

Tamil Nadu News: ప్రేమించలేదని ట్యూషన్ టీచర్‌ ఇంటికి వందల కొద్ది ఆన్‌లైన్ ఆర్డర్లు- టార్చర్ తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు

Chennai News: మనం ఆర్డర్ చేయకుండానే ఇంటికి ఏదైనా డెలవరీ వస్తే కాస్త అనుమానపడతాం . అలాంటిది వందల కొద్ది వచ్చి పడితే. అవి కూడా క్యాష్ ఆన్‌ డెలవరీ అయితే ఆ టార్చర్‌ వేరే లెవల్లో ఉంటుంది.

Viral News : ఉపాధ్యాయురాలితో ఓ స్టూడెంట్ ప్రేమలో పడ్డాడు. చివరకు ఆమె రిజెక్ట్ చేయడంతో రివేంజ్ తీసుకున్న విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఆ కుర్రాడి టార్చర్ తట్టుకోలేక ఏకంగా పోలీసులనే ఆశ్రయించింది ఆ టీచర్ ఫ్యామిలీ. ఇంతా చేసిన ఆ కుర్రాడు మైనర్‌ కావడం ఇక్కడ అసలు ట్విస్టు

చెన్నైలో జరిగిన టీచర్ స్టూడెంట్ మధ్య ప్రేమాయణం సంచలనంగా మారింది. పెరియామెట్‌లో 22 ఏళ్ల టీచర్‌ను 17 ఏళ్ల స్టూడెంట్ ప్రేమించాడు. ఆమె కోసమే రోజూ ట్యూషన్‌కు వెళ్లేవాడు. అయితే ఆ విద్యార్థి మైండ్‌లో ఉన్న దురాలోచన పసిగట్టిన టీచర్‌ అతన్ని దూరం పెట్టింది. 

అప్పటి వరకు రోజూ ట్యూషన్‌కు వెళ్లి టీచర్‌ను చూసుకునే కుర్రాడు ఒక్కసారిగా ఆమె దూరం పెట్టే సరికి తట్టుకోలేకపోయాడు. ఆమెపై పగ పెంచుకున్నాడు. ఆమెను టార్చర్ పెట్టాడు. ఓ కొత్త ఫోన్ నెంబర్ తీసుకొని దాంతో ఆన్‌లైన్ ఆర్డర్లు పెట్టాడు. 

రోజూ ట్యూషన్‌కు వెళ్లి వాళ్ల ఇంటి అడ్రెస్‌ ఇతర వివరాలు తెలుసుకున్నాడు. ఆ ట్యూషన్ టీచర్ పేరిట ఆన్‌లైన్ ఆర్డర్లు పెట్టాడు. దాదాపు అన్ని ఆన్‌లైన్ ప్లాట్ఫామ్‌ యాప్స్‌ నుంచి భారీగా ఆర్డర్లు పెట్టాడు. అన్నీ కూడా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాడు. ఆమె పేరుతో రెండు రోజుల్లనో వందకుపైగా ఆర్డర్స్ వచ్చాయి. ఒకటి రిజెక్ట్ చేసి ఆ డెలివరీ బాయ్‌ను పంపించేసరికి మరో సంస్థ నుంచి మరో ఆర్డర్ వచ్చేది. ఉదయం నుంచి రాత్రి 12 గంటల వరకు ఒకటే గోల. 

ఇలా వచ్చిన ఆర్డర్స్‌ తిరిగి పంపిస్తున్నప్పుడు డెలివరీ బాయ్స్‌ ఆమెను తిట్టే వాళ్లు. టూత్‌ పేస్ట్ నుంచి ఇంట్లో వాడే పామ్‌ ఆయిల్ వరకు అన్నింటినీ ఆర్డర్ పెట్టాడు. ఓవైపు ఇలాంటి వస్తువులతోపాటు బ్రేక్ పాస్ట కోసం టిఫిన్స్, రాత్రి 12 గంటల తర్వాత ఫుడ్‌ను ఆర్డర్ చేసే వాడు. అర్థరాత్రి ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ వచ్చి పుడ్‌ అంటూ డోర్‌బెల్‌ మోగించే వాళ్లు. రెండు రోజుల్లోనే నరకం అంటే ఏంటో చూపించాడా వ్యక్తి. 

అంతే కాదండోయ్‌ ఓలా, ఊబర్‌ రైడ్స్‌ కూడా భారీగా బుక్ చేశాడు. వచ్చిన వాళ్లంతా వాళ్లకు ఫోన్ చేసి ఆర్డర్లు గురించి చెప్పడంతో షాక్ అయ్యారు. 

ఇలా కుప్పలు తెప్పలుగా వస్తున్న ఆర్డర్లు రాకతో ఆ ఫ్యామిలీలో టెన్షన్ పెరిగింది. ఎవరో కావాలనే ఇలా చేస్తున్నారని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఈ నెల 2న సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని నెంబర్ నుంచి ఆన్‌లైన్ ఆర్డర్లు పెట్టి టార్చర్ పెడుతున్నారని పేర్కొన్నారు. 

విచారణ పోలీసులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. ప్రేమ పేరుతో తిరిగిన మైనర్‌ స్టూడెంటే ఇలా టార్చర్ చేసినట్టు గుర్తించారు. నిందితుడు వాడో ఫోన్‌ నెంబరు, ఈ మెయిల్‌ ఆధారంగా అతన్ని అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ఆ విద్యార్థికి మానసిక పరీక్షలు జరపాలని కోర్టు ఆదేశించింది.

Also Read: నన్ను చంపేందుకు కుట్ర జరిగింది, సల్మాన్ ఖాన్‌ సంచలన స్టేట్‌మెంట్

Also Read: కామన్‌ మేన్‌పై బడ్జెట్ ఎఫెక్ట్‌ ఎలా ఉండనుంది? వేటి ధరలు పెరుగుతాయ్, ఏవి తగ్గుతాయ్?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Kawasaki Ninja ZX 4RR: మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Kawasaki Ninja ZX 4RR: మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Mulugu News: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Laptop Battery Saving Tips: ల్యాప్‌టాప్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? - ఇలా చేస్తే ఎక్కువ సేపు వస్తుంది!
ల్యాప్‌టాప్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? - ఇలా చేస్తే ఎక్కువ సేపు వస్తుంది!
Embed widget