అన్వేషించండి

Salman Khan: నన్ను చంపేందుకు కుట్ర జరిగింది, సల్మాన్ ఖాన్‌ సంచలన స్టేట్‌మెంట్

Lawrence Bishnoi: గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ తనను చంపాలని చూశాడని సల్మాన్ ఖాన్‌ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. ముంబయి క్రైమ్ పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు.

Lawrence Bishnoi Vs Salman Khan: గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్ బిష్ణోయ్ తనను చంపేందుకు చూశాడని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను చంపేందుకే ఇంటి ముందు కాల్పులు జరిపించాడని చెప్పాడు. తనతో పాటు తన కుటంబం మొత్తాన్ని హత్య చేయాలని చూసినట్టు వివరించాడు. ముంబయి క్రైమ్ బ్రాంచ్‌కి ఈ వివరాలు వెల్లడించాడు. పోలీసులు సల్మాన్ వాంగ్మూలాన్ని తీసుకున్నారు. గత నెలలోనే పోలీసులు ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని, పదేపదే బెదిరింపు కాల్స్ వస్తున్నాయని సల్మాన్ చెప్పాడు.

ఇటీవల బిష్ణోయ్‌ గ్యాంగ్‌కి చెందిన కొందరు వ్యక్తులు సల్మాన్ ఖాన్‌ ఇంటి ముందు కాల్పులు జరిపారు. ఈ ఘటన ముంబయిలో సంచలనం సృష్టించింది. సల్మాన్‌ని చాలా రోజుల నుంచి టార్గెట్‌గా పెట్టుకున్నట్టు విచారణలో తేలింది. అటు లారెన్స్ బిష్ణోయ్ కూడా సల్మాన్‌ని హత్య చేయాలని చూసినట్టు ఒప్పుకున్నాడు. బాంద్రాలోని గ్యాలక్సీ అపార్ట్‌మెంట్‌ వద్ద కాల్పులు జరిగినట్టు పోలీసులకు సల్మాన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఈ కేసులో మొత్తం 17 వందల పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ఇందులో ఎన్నో కీలక విషయాలున్నాయి. 

గత నెల సల్మాన్ ఖాన్‌ని చంపేందుకు ప్లాన్ చేసింది బిష్ణోయ్ గ్యాంగ్. సల్మాన్‌ని ఎవరు చంపితే వాళ్లకి రూ.25 లక్షల నజరానా ఇస్తామని చెప్పింది. పంజాబ్ సింగర్ సిద్దూ మూసేవాలాని చంపినట్టే సల్మాన్‌నీ కాల్చి చంపాలని పురమాయించింది. గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకూ రెక్కీ నిర్వహించారు. పక్కా ప్లాన్‌తో కాల్పులు జరపాలని డిసైడ్ అయ్యారు. అంతే కాదు. ఈ అటాక్ కోసం ప్రత్యేకంగా పాకిస్థాన్ నుంచి AK47 గన్స్ తెప్పించారు. వీటితో పాటు మరి కొన్ని తుపాకులూ తెచ్చుకున్నారు. రెక్కీ నిర్వహించే సమయంలో దాదాపు 70 మంది సల్మాన్‌ కదలికలపై నిఘా పెట్టారు. ఆయన ఫార్మ్‌హౌజ్‌తో పాటు  Goregaon Film City పైనా నిఘా పెట్టారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ బైక్‌పైన వచ్చిన ఇద్దరు దుండగులు సల్మాన్ ఖాన్‌ అపార్ట్‌మెంట్‌పై పలు రౌండ్‌ల కాల్పులు జరిపారు. ఆ తరవాతే బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ఈ పని చేసినట్టు తెలిసింది. ఎన్నో రోజులుగా సల్మాన్‌ని మట్టుబెట్టాలని చూస్తున్నాడు బిష్ణోయ్. ఈ కేసు విచారణలో భాగంగా ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట సల్మాన్ హాజరయ్యాడు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని వాంగ్మూలం ఇచ్చాడు. తనతో పాటు కుటుంబ సభ్యుల్నీ హత్య చేయాలని చూస్తున్నారని చెప్పాడు. 

"గతంలో ఓ ఇంటర్వ్యూలో లారెన్స్ బిష్ణోయ్ నన్ను హత్య చేయాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. నాతో పాటు నా బంధువులనూ చంపేందుకు కుట్ర జరిగింది. తన గ్యాంగ్‌లోని సభ్యులతో నా ఇంటిపై కాల్పులు జరిపించాడు. ఆ సమయంలో నా కుటుంబ సభ్యులు నిద్రపోతున్నారు"

- సల్మాన్ ఖాన్

Also Read: NEET Row: పేపర్ లీక్ చేస్తే రూ.10 లక్షల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష - సంచలన బిల్లు తీసుకొచ్చిన ప్రభుత్వం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
Most Expensive Vegetables : ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
Most Expensive Vegetables : ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
Turmeric Water : రోజూ పసుపు నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఈ Side Effects తెలిస్తే షాక్ అవుతారు
రోజూ పసుపు నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఈ Side Effects తెలిస్తే షాక్ అవుతారు
ఎగిరే రథాల నుంచి కదిలే విగ్రహాలు, తుప్పు పట్టని స్తంభాల వరకు ఆశ్చర్యపరిచే విజ్ఞానం - పురాతన భారతదేశ అద్భుత సాంకేతికత!
ఎగిరే రథాల నుంచి కదిలే విగ్రహాలు, తుప్పు పట్టని స్తంభాల వరకు ఆశ్చర్యపరిచే విజ్ఞానం - పురాతన భారతదేశ అద్భుత సాంకేతికత!
Avatar Fire And Ash: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' బడ్జెట్ నుంచి నటీనటుల వరకు... జేమ్స్ కామెరూన్ సినిమా సంగతులు
'అవతార్ ఫైర్ అండ్ యాష్' బడ్జెట్ నుంచి నటీనటుల వరకు... జేమ్స్ కామెరూన్ సినిమా సంగతులు
Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Embed widget