అన్వేషించండి

Republic Day 2025 - Tableaux : గణతంత్ర వేడుకల్లో ఈ సారి స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్న శకటాలు - మహా కుంభ్, స్టాట్యూ ఆఫ్ యూనిటీతో పాటు ఇంకా మరెన్నో..

Republic Day 2025 - Tableaux : గణతంత్ర వేడుకల్లో భాగంగా ఈ సారి పరేడ్ లో 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శకటాలతో పాటు 10 కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన శకటాలు ప్రదర్శనలో పాల్గొననున్నాయి.

Republic Day 2025 - Tableaux : భారతదేశంలో జనవరి 26న నిర్వహించే రిపబ్లిక్ డే పరేడ్ లో ఎప్పటిలాగే పలు రాష్ట్రాలకు చెందిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సారి పరేడ్ లో 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శకటాలతో పాటు 10 కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన శకటాలు ప్రదర్శనలో పాల్గొననున్నాయి. ఇవి భారతదేశ సాంస్కృతిక వారసత్వం, విజయాలను ప్రతిబింబిస్తాయి. అయితే ఈ సారి అత్యంత ఎక్కువ, స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటి. ప్రయాగ్ రాజ్ లో సాగుతోన్న మహా కుంభమేళా, గుజరాత్ లోని ఐక్యతా విగ్రహం, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన లఖపతి దీదీ నేపథ్యంతో రూపొందించిన శకటాలు మరింత ఆకట్టుకోనున్నాయి.

సాంస్కృతిక ప్రాముఖ్యతను నొక్కి చేప్పే మహా కుంభ్ శకటం

ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన పండుగల్లో ఒకటి మహా కుంభమేళా. ఆధ్యాత్మిక వైభవాన్ని చాటి చెప్పే ఈ వేడుకలు జనవరి 13 నుంచి ప్రయాగ్ రాజ్ లో ప్రారంభమయ్యాయి. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసిన పవిత్ర త్రివేణీ సంగమంలో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు, సాధువులు, సన్యాసులు స్నానాలాచరిస్తున్నారు. గొప్ప చరిత్ర గల మహా కుంభమేళా థీమ్ తో రూపొందించిన శకటాన్ని ఈ సారి ఉత్తరప్రదేశ్ రిపబ్లిక్ పరేడ్ లో ప్రదర్శించనుంది.

ప్రోగ్రెస్ అండ్ ఇన్నోవేషన్ థీమ్ తో శకటం ప్రదర్శన

చారిత్రక వైభవాన్ని చాటుతూ, రాష్ట్ర పారిశ్రామిక, సాంకేతిక పురోగతిని ప్రతిబింబించేలా గుజరాత్ రాష్ట్రం ఈ సారి సరికొత్త శకటంతో అలరించనుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం, సర్దార్ వల్లభభాయ్ పటేల్ గౌరవార్థం నిర్మించిన స్టాట్యూ ఆఫ్ యూనిటీతో పాటు సెమీ కండక్టర్, ఏరోస్పేస్ తో సహా అత్యాధునిక పరిశ్రమలలో, ముఖ్యంగా సీ - 295 విమానాల ఉత్పత్తిలో సహకారాన్ని గుజరాత్ శకటం రూపంలో ప్రదర్శించనుంది.

లఖపతి దీదీతో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రదర్శన

ఈ సారి రిపబ్లిక్ పరేడ్ లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రదర్శన మరింత ఆకట్టుకోనున్నట్టు తెలుస్తోంది. లఖపతి దీదీని సెలబ్రేట్ చేసుకునే హృదయాన్ని కదిలించే శకటాన్ని తయారు చేసినట్టు సమాచారం. ఇది స్వయం సహాయక బృందాల సాయంతో ఆర్థిక స్వాతంత్ర్యం సాధించిన గ్రామీణ మహిళలను సూచిస్తుంది. హస్త కళలు, పాడి పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ వంటి ప్రభుత్వ కార్యక్రమాల విజయాలను ప్రదర్శించేలా శకటాన్ని నిర్మించారు.

వీటితో పాటు భారతదేశ వైవిధ్యం, పురోగతిని చూపే అనేక శకటాలు ప్రదర్శనకు సిద్ధమవుతున్నాయి. రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, గోవా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా వంటి రాష్ట్రాలు తమ రాష్ట్ర ప్రత్యేక వారసత్వ, సంస్కృతి సంప్రదాయాలను వర్ణించే శకటాలను రూపొందించినట్టు సమాచారం. రిపబ్లిక్ డే పరేడ్ తర్వాత జనవరి చివరి వారం వరకు సాగే భారత్ పర్వ్ లో భాగంగా ఎర్రకోట వద్ద అనేక శకటాలు ప్రదర్శింపబడతాయి. 

Also Read : Pregnant Woman in America: సిజేరియన్లకు పరుగులు పెడుతున్న ప్రెగ్నెంట్ మహిళలు - పిల్లలకు పౌరసత్వం కోసం అమెరికాలో కొత్త హడావుడి !

టాప్ హెడ్ లైన్స్

Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget