By: ABP Desam | Updated at : 22 Sep 2023 06:43 PM (IST)
Edited By: Pavan
రద్దీగా ఉండే విమానాశ్రయంలో ప్రయాణికులతో సుధా మూర్తి మాటామంతీ ( Image Source : linkedin.com/jayantibhattacharya )
Sudha Murty: ప్రముఖ రచయిత్రి, మానవతా మూర్తి సుధా మూర్తి తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆమె చేసే పనులు, నిరాడంబరంగా ఉండే తీరు పట్ల చాలా మంది ఆమెను ఎంతో అభిమానిస్తారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సతీమణి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, యూకే ప్రధాని అత్తగారు అయినప్పటికీ.. ఆమె సాదాసీదాగా ఉండటానికే ఇష్టపడతారు. నిరాడంబరతకు ఆమె పెట్టింది పేరు. అలాంటి సుధా మూర్తి తీరు మరోసారి అందరి మనసులను గెలుచుకుంది. రద్దీగా ఉన్న ఓ విమానాశ్రయంలో సాధారణ ప్రయాణికురాలిగా, తోటి ప్రయాణికులతో ఆమె మాటామంతీకి సంబంధించి వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇండియా హెంప్ అండ్ కో సహవ్యవస్థాపకురాలైన జయంతి భట్టాచార్య ఈ విషయానికి సంబంధించి లింక్డ్‌ఇన్ పోస్టు పెట్టారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ సుధా మూర్తితో జరిగిన హృదయపూర్వక సంభాషణ గురించి చెప్పుకొచ్చారు. ఈ పోస్టు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుధా మూర్తి సామాన్య ప్రయాణికురాలిగా.. తోటి ప్రయాణికులతో ప్రవర్తించిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆమె హ్యుమిలిటీ, సింప్లిసిటీ గల అరుదైన వ్యక్తి అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
జయంతి భట్టాచార్య పెట్టిన పోస్టులో సుధా మూర్తి గురించి తన అభిమానాన్ని చాటుకున్నారు. దయ, తెలివితేటలు, నిరాడంబరత, సృజనాత్మకత గురించి తాను ఎప్పుడూ వింటూ ఉంటానని పేర్కొన్నారు. ఊహించని విధంగా సుధా మూర్తిని నేరుగా కలవడం ఎంతో ఆనందంగా ఉందంటూ పోస్టులో పేర్కొన్నారు. 'పద్మభూషణ్ అవార్డు గ్రహీత, యూకే ప్రధాన మంత్రి రిషి సునాక్ అత్తగారు అయిన సుధా మూర్తి.. ఓ సాధారణ వ్యక్తిలాగా తోటి ప్రయాణికులతో సన్నిహితంగా ఉన్నారు. తన ఫ్లైట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇతర ప్రయాణికులతో ఆప్యాయంగా మాట్లాడారు. వారితో కలిసి సరదాగా గడిపారు' అని జయంతి భట్టాచార్య తన పోస్టులో పేర్కొన్నారు.
Indian Navy: ఇండియన్ నేవీలో సరికొత్త చరిత్ర - తొలి మహిళా కమాండింగ్ ఆఫీసర్ నియామకం
Mizoram Assembly Polls: ఎన్నికల కౌంటింగ్ వాయిదా! అసలు కారణం తెలుసా?
ఇండియాలో మొదటి ఎగ్జిట్ పోల్ సర్వే ఎప్పుడు చేశారు? ఫస్ట్ ఫైవ్ ఇవే
AP Telangana Water Issue: కృష్ణాజలాలపై ఢిల్లీలో నేడు కీలక మీటింగ్ - ఏపీ, తెలంగాణ హాజరవ్వాలని ఆదేశాలు
HSL Recruitment: వైజాగ్ హిందుస్థాన్ షిప్‌యార్డులో 99 మేనేజర్, కన్సల్టెంట్ పోస్టులు - అర్హతలివే
Andhra Telangana Dispute : కేంద్రం అధీనంలోకి సాగర్, శ్రీశైలం డ్యాములు - ఏపీ ప్రభుత్వ దూకుడుతో సాధించిందేంటి ?
Upcoming SUVs in 2024: 2024లో కారు కొనాలనుకుంటున్నారా? - ఈ నాలుగు ఎస్‌యూవీలు ఎంట్రీ ఇస్తున్నాయి - ఒక్కసారి చూడండి!
KCR On Results: హైరానా వద్దు, 3న సంబరాలు చేసుకుందాం- పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ భరోసా
Salaar - Ugramm: 'సలార్' ట్రైలర్ విడుదల తర్వాత కొత్త డౌట్స్ - ప్రశాంత్ నీల్ మోసం చేస్తున్నారా?
/body>