Samudrayaan Mission: మరో మహత్తర ప్రయోగానికి భారత్ రెడీ, ప్రత్యేకతలు ఏంటంటే !
Samudrayaan Mission: భారత్ మరో మహత్తర ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఏకంగా సముద్ర గర్భాన్ని శోధించేందుకు భారత్ సన్నాహాలు చేపట్టనుంది.
![Samudrayaan Mission: మరో మహత్తర ప్రయోగానికి భారత్ రెడీ, ప్రత్యేకతలు ఏంటంటే ! Submersible Matsya to take a dip in Bay of Bengal next year Samudrayaan Mission: మరో మహత్తర ప్రయోగానికి భారత్ రెడీ, ప్రత్యేకతలు ఏంటంటే !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/12/f69e108b000b58efff4acc0c10bdff0f1694490881070798_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Samudrayaan Mission: భారత్ మరో మహత్తర ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే చంద్రుడిపైకి చంద్రయాన్, సూర్యుడిపై ప్రయోగాలకు ఆదిత్య L1ను విజయవంతంగా ప్రయోగించిన భారత్ ఈ సారి మరో ప్రయోగం చేసేందుకు సిద్ధమవుతోంది. ఏకంగా సముద్ర గర్భాన్ని శోధించేందుకు భారత్ సన్నాహాలు చేపట్టనుంది. సముద్రయాన్ పేరిట మానవ సహిత సముద్ర యాత్ర చేపట్టేలా సమాయత్తం అవుతోంది. మత్స్య 6000’ పేరిట ఓ సబ్‌మెర్సిబుల్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో భారత శాష్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు.
రెండేళ్ల కృషి
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ (ఎన్‌ఐవోటీ)కి చెందిన శాస్త్రవేత్తలు సబ్‌మెర్సిబుల్ డిజైన్, టెస్టింగ్, మెటిరీయల్స్, సర్టిఫికేషన్స్, రిడండెన్సీ, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ సహా అన్ని బాధ్యతలను తమ భుజాలపై వేసుకున్నారు. వారి రెండేండ్ల కృషి ఫలితంగా ‘మత్స్య 6000’ రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. ఈ ఏడాది జూన్‌లో టైటాన్ సబ్‌మెర్సిబుల్ సముద్రంలో పేలిపోయిన నేపథ్యంలో మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు.
రూ.4,077 కోట్లు ఖర్చు
2024 ప్రథమార్ధంలో ముగ్గురు శాస్త్రవేత్తలతో ఈ సబ్‌మెర్సిబుల్ చెన్నై తీరంలోని సముద్ర గర్భంలో 500 మీటర్ల లోతుల్లో దిగనుంది. అన్ని పరీక్షలు పూర్తయితే 2026లో పూర్తిస్థాయిలో రంగంలోకి దిగుతుంది. ఈ మత్య్స సబ్‌మెరైన్ ముగ్గురు వ్యక్తులను తన సబ్‌మెర్సిబుల్ వాహనంలో 6000 మీటర్ల లోతు వరకు తీసుకువెళుతుంది. మొదటి ట్రయల్‌లో చెన్నై సమీపంలోని సముద్రం నుంచి 500 మీటర్ల లోతుకు ఈ జలాంతర్గామిని పంపనున్నారు. 2026 నాటికి, ఇది ముగ్గురు అక్వానాట్స్ ను సముద్రంలో 6000 మీటర్ల లోతుకు తీసుకువెళుతుంది. ఇప్పటివరకు సముద్ర శోధనలు చేసేందుకు మానవ సహిత సబ్‌మెర్సిబుల్‌ను అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, జపాన్ మాత్రమే రూపొందించాయి.
సముద్ర గర్భంలో శోధన
సముద్రగర్భంలో ఉన్న అత్యంత విలువైన ఖనిజాలు, లోహాల అన్వేషణ, జీవవైవిధ్యంపై పరిశోధనలు చేయడమే లక్ష్యంగా సముద్రయాన్‌ను రూపొందిస్తున్నారు. కోబాల్ట్, నికెల్, మాంగనీస్, హైడ్రో థర్మల్ సల్ఫైడ్స్, గ్యాస్ హైడ్రేట్స్, కిమోసింథటిక్ బయోడైవర్సిటీ, లో టెంపరేచర్ మీథేన్ సీప్స్‌పై శాస్త్రవేత్తలు దృష్టి సారించనున్నారు. సముద్రపు లోతుల్లో లభించే లిథియం, కాపర్, నికెల్‌లను బ్యాటరీలలో ఉపయోగిస్తారు. అదే సమయంలో, ఎలక్ట్రిక్ కార్లకు అవసరమైన కోబాల్ట్, ఉక్కు పరిశ్రమకు అవసరమైన మాంగనీస్ కూడా సముద్రపు లోతులలో లభిస్తాయి.
మత్స్య 6000 ప్రత్యేకతలు
80 మిల్లిమీటర్ల మందమైన టైటానియం మిశ్రమంతో 2.1 మీటర్ల వ్యాసంతో గోళాకారంలో సముద్రయాన్‌ను తయారు చేశారు. ఇందులో ముగ్గురు ప్రయాణించవచ్చు. ఇది సముద్ర ఉపరితలంపై ఉండే ఒత్తిడికి 600 రెట్లు ఎక్కువగా ఉండే 600 బార్ ఒత్తిడిని తట్టుకోగలదు. సుమారు 12-16 గంటల పాటు నిర్విరామంగా సముద్ర గర్భంలో ప్రయాణించగలదు. అంతేకాదు 96 గంటల పాటు ఆక్సిజన్‌ను అందింస్తుంది. ఈ సబ్‌మెర్సిబుల్‌లో గోళం తప్పితే.. అన్ని వ్యవస్థలకు ప్రత్యామ్నాయాలను రూపొందించారు. ఒక వ్యవస్థ విఫలమైనా ఇది సురక్షితంగా బయటపడగలిగేలా సముద్రయాన్‌ను రూపొందిస్తున్నారు.
ఎన్ఐఓటీ డైరెక్టర్ ఏమన్నారంటే..
ఎన్ఐఓటీ (NIOT) డైరెక్టర్ GA రాందాస్ మాట్లాడుతూ.. మత్స్య 6000 కోసం 2.1 మీటర్ల వ్యాసం కలిగిన గోళాన్ని రూపొందించి అభివృద్ధి చేసినట్లు తెలిపారు. దీని లోపలి భాగంలో ముగ్గురు కూర్చునే స్థలం ఉంటుంది. అదే సమయంలో, మత్స్య 6000 బరువు 25 టన్నులు. దాని పొడవు 9 మీటర్లు, వెడల్పు 4 మీటర్లు. ఇది 80mm టైటానియం మిశ్రమంతో తయారు చేసి ఉంటుంది. ఇది సముద్ర మట్టం కంటే 600 రెట్లు ఎక్కువ ఒత్తిడిని తట్టుకోగలదు అంటే 600 బార్ (ఒత్తిడి కొలత యూనిట్) 6000 మీటర్ల లోతులో ఉంటుంది. భారత ప్రభుత్వం 2021లో 'డీప్ ఓషన్ మిషన్'ను ఆమోదించింది. సముద్రయాన్ మిషన్ 2026 నాటికి ప్రారంభమవుతుందని అప్పుడే ప్రకటించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)