అన్వేషించండి

Viral News: గ‌రం గ‌రం గులాబీ పూల బజ్జీలు - వైరల్ అవుతున్న వీడియో చూశారా

Telugu News: గులాబీ పూల‌తో ప‌కోడీ చేసి వ‌డ్డిస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వీళ్ల‌కి ఇదెక్క‌డి పోయేకాలం అని నెటిజ‌న్లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

Viral Video: మిర‌ప‌కాయ బ‌జ్జీలు, ఆలుగ‌డ్డ‌ బ‌జ్జీలు, ఆనియ‌న్ బ‌జ్జీ, అర‌టికాయ బ‌జ్జీలు, తమలపాకుల  గురించి మ‌నం విన్నాం తిన్నాం. ఆనియ‌న్ ప‌కోడీ, చికెన్ పకోడీ, పాల‌క్ ప‌కోడీ, ఆఖ‌రుకి క్యాలీఫ్ల‌వ‌ర్‌తో ప‌కోడి చేయ‌డం చూశాం. మీరెప్పుడైనా గులాబీల ప‌కోడీ తిన్నారా, క‌నీసం విన్నారా.. పెట్టుకునే పువ్వుల‌తో ప‌కోడీ ఏమిటా అని ఆశ్చ‌ర్య‌పోకండీ.. నిజ‌మేనండీ బాబూ.. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. పూర్తి వివ‌రాలు తెలియ‌లేదు కానీ, చూస్తుంటే మాత్రం నార్త్ ఇండియాలా అనిపిస్తుంది. 

ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి

తయారీ విధానం ఇలా

ఇక్క‌డ ఓ వ్య‌క్తి  బొకే కోసం తెచ్చిన గులాబీ గుత్తిని తీసుకుని వాటికున్న కాడ‌లు క‌త్తిరించి పూలు మాత్రం ఉంచాడు. శ‌నగ‌పిండిలో క‌లిపి ప‌ట్టుకుని నూనెలో వేసుకునేందుకు వీలుగా మిర‌ప‌కాయ‌కు ఉన్న‌ట్టు చిన్న తొడిమ ఉండేలా క‌ట్ చేసి పెట్టుకున్నాడు. ఆ త‌ర్వాత ఒక్కొక్క‌ గులాబీ పూల‌ను శ‌న‌గ‌పిండిలో ముంచి బాగా క‌లిపి అచ్చం మిర‌ప‌కాయ బ‌జ్జీలు వేసిన‌ట్టుగానే స‌ల‌స‌లా కాగే నూనెలో వేయించి బ‌య‌ట‌కు తీశాడు. విన‌డానికి చాలా వింత‌గా ఉంది క‌దూ. తింటే ఇంకెంత క‌ష్టంగా ఉంటుందో మ‌రి. కానీ ఇక్క‌డ వంట‌వాడు తీసి వ‌డ్డించ‌డం ఆల‌స్యం క‌స్ట‌మ‌ర్లు ఆవురావురుమంటూ తెగ లాగించేస్తున్నారు. గులాబీ రేకుల‌ను రంగు, వాస‌న కోసం సుగంధ ప‌రిమ‌ళాలు వెద‌జ‌ల్లే కొన్ని ర‌కాల క్రీములు, స్ప్రేలు లాంటి సౌంద‌ర్య‌సాధ‌నాల్లో వాడ‌టం తెలుసు. నేరుగా తింటే కూడా ఎర్ర‌గా గులాబీ రంగులోకి మారిపోవ‌చ్చ‌ని కాబోలు ఈ వింత వంట‌కం త‌యారు చేస్తున్నారనుకుంటా. 

వీడియో చూసిన వాళ్లకు ఆశ్చర్యం

ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు కాదేదీ ప‌కోడీకి అన‌ర్హం అని కామెంట్లు చేస్తున్నారు. జ‌ల్సా సినిమాలోనూ ఒక సీన్ లో హీరోయిన్ మ‌ద‌ర్  క్యారెక్ట‌ర్ గులాబీ పూలు తింటుంటే ఎవ‌రైనా పూలు తింటారా అంటే క్యాలీ ప్ల‌వ‌ర్ తింటాం క‌దా అలాగే ఇది అంటుంది.. ఈ వంట మాస్ట‌ర్ కూడా ఈ జ‌ల్సా సినిమానే చూసి ఇన్స్పైర్ అయ్యాడేమో అనిపిస్తుంది. 

కొంద‌రేమో బాబోయ్ ఇది కచ్చితంగా ఉత్త‌ర భార‌త‌దేశం వంట‌కం అయ్యుంటుంది. అటువైపు త‌యారు చేసే వింత‌ర‌క‌పు వంట‌లు తిన‌లేంరా నాయ‌నా అని నోరు క‌రుచుకుంటున్నారు. కొంత‌మంది ర‌క‌ర‌కాల ఎమోజీలతో ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. 

వీటిని తింటే ఆరోగ్యం సంగ‌తి ఏమ‌వుతుందో తెలియ‌దు కానీ, చూసినోళ్లు మాత్రం ఇదెక్క‌డి చోద్యంరా బాబూ అని నోరెళ్ల‌బెడుతున్నారు. ఈ వీడియో చూసి మీకూ ట్రై చేయాల‌నిపిస్తే  వైద్యుల స‌ల‌హాతో ముందుకెళ్లండి. నిపుణుల స్వీయ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఇలాంటి ప్ర‌యోగాలు చేయ‌డం ఉత్త‌మ‌మ‌ని కొంద‌రు నెటిజ‌న్లు ఉచితంగా స‌ల‌హా ఇస్తున్నారు. సో.. మీ ఇష్టం మ‌రి. 

Also Read: మనవడిని స్వయంగా స్కూల్‌కు తీసుకువెళ్లిన రజనీ - బెస్ట్‌ గ్రాండ్‌ఫాదర్‌ అంటూ మురిసిపోయిన కూతురు

Also Read: హెచ్‎డీఎఫ్‎సీ బ్యాంకు సొమ్ము రూ.2.5 కోట్లతో ఉద్యోగి పరార్

టాప్ హెడ్ లైన్స్

India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!

వీడియోలు

KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget