Same Gender Marriage: స్వలింగ వివాహాలకు గుర్తింపునివ్వడం కుదరదు, సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్
Same Gender Marriage: స్వలింగ వివాహాలకు చట్టబద్దమైన గుర్తింపునివ్వడం సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పింది.
Same Gender Marriage:
స్వలింగ వివాహాలకు అధికారిక గుర్తింపునివ్వాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. వీటికి గుర్తింపునివ్వడం కుదరదని సర్వోన్నత న్యాయస్థానికి ఇచ్చిన అఫిడవిట్లో తేల్చి చెప్పింది. భారత దేశ సంస్కృతికి ఇది విరుద్ధమని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన చట్టాన్ని రూపొందించేందుకు సిద్ధంగా లేదని వెల్లడించింది. 1954 స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద కూడా ఈ స్వలింగ వివాహాలకు గుర్తింపునివ్వడం కుదరదన్న వాదన ఎప్పటి నుంచో వినిపిస్తోంది. వివాహ వ్యవస్థకు రాజ్యాంగం కల్పించిన భద్రత ఏదీ ఈ స్వలింగ వివాహాలకు వర్తించవని తేల్చి చెబుతున్నారు నిపుణులు. ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అనే హక్కు ఉన్నప్పటికీ...అది స్వలింగ వివాహాలకు వర్తించదు. పైగా...ఈ వివాహాలు ప్రాథమిక హక్కుల్లోనూ లేదు. ఈ విషయాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది.
#BREAKING
— Bar & Bench (@barandbench) March 12, 2023
Central Govt opposes plea seeking recognition of same sex marriage before the #SupremeCourtOfIndia
Says same sex relation "cannot be compared to the Indian family concept of a husband, a wife and children born out of the union" #Samesexmarriage pic.twitter.com/d0JXzhgELr
#BREAKING Central Government opposes pleas in #SupremeCourt seeking recognition of same-sex marriage.
— Live Law (@LiveLawIndia) March 12, 2023
Decriminalisation of Section 377 IPC cannot give rise to a claim to seek recognition for same-sex marriage, Centre says in counter-affidavit.#SupremeCourtOfIndia #LGBT pic.twitter.com/QOMwUqyL2i
ఇటీవల లింగభేదంతో సంబంధం లేకుండా వివాహాలు చేసుకుంటున్నారు. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఇలా ఎవరికి ఇష్టం వచ్చిన వారిని పెళ్లి చేసుకుంటున్నారు. కాలానుగుణంగా సమాజం కూడా వాటిని అంగీకరిస్తోంది. ఇందుకు తగ్గట్లుగా ఎన్నో దేశాలు స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేశాయి. మొన్నామధ్య.. ఒక అమ్మాయి తనను తానే పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించింది. గుజరాత్లో ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు.. ఇటు ఏపీలోనే ఇలాంటి సీన్ రిపీట్ అయింది. ఇద్దరు అమ్మాయిలు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ ట్రెండ్ కొనసాగుతుంది. అంతేకాదు.. స్వలింగ్ సంపర్కాన్ని అడ్డు చెప్పిన పాత చట్టాలను కొట్టేస్తే కొత్త చట్టాలను తిరిగి తీసుకొచ్చాయి చాలా దేశాలు. కొద్ది రోజులక్రితం సింగపూర్ ప్రభుత్వం స్వలింగ సంపర్కాన్ని నేరం కాదని వెల్లడించింది. సింగపూర్ ప్రభుత్వం ఎన్నో దశాబ్దాలుగా వివాదాస్పద 377ఏ చట్టాన్ని అమలుచేస్తోంది. ఇది బ్రిటిష్ పాలన నుంచి సంక్రమించింది చట్టం. ఈ చట్టం ప్రకారం ఇద్దరు పురుషుల మధ్య స్వలింగ సంపర్కం నిషేధం. స్వలింగ సంపర్కం ఆమోదయోగ్యం కాదన్నది సింగపూర్ సమాజం అభిప్రాయమని, ఈ చట్టం దాన్ని ప్రతిబింబిస్తుందని అధికారులు ఏళ్ల తరబడి చెబుతూ వచ్చారు. కానీ, గత వారం సింగపూర్ పార్లమెంట్ ఈ చట్టాన్ని రద్దు చేసింది. అంతకు కొన్ని నెలల క్రితం సింగపూర్ ప్రధానమంత్రి లీ షెన్ లోంగ్ ఈ చట్టాన్ని రద్దు చేయనున్నట్టు ప్రకటించారు.
Also Read: Bengaluru-Mysuru Highway: బెంగళూరు-మైసూరు ఎక్స్ప్రెస్ వే ప్రారంభించిన ప్రధాని మోదీ, మరి కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన