(Source: ECI/ABP News/ABP Majha)
అసలు హిందూమతం అనేదే లేదు, అసమానతలకు బ్రాహ్మణులే కారణం - ఎస్‌పీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
Swami Prasad Maurya: హిందూ మతంపై ఎస్‌పీ నేత స్వామి ప్రసాద్ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Swami Prasad Maurya:
ప్రసాద్ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు
సమాజ్‌వాదీ పార్టీకి చెందిన లీడర్ స్వామి ప్రసాద్ మౌర్య హిందూ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో రాంచరిత్ మానస్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్న మౌర్య..ఇప్పుడు మరోసారి నోరు జారారు. బ్రాహ్మణులు, హిందూ మతంపై చేసిన కామెంట్స్ కాంట్రవర్సీ అవుతున్నాయి. హిందూయిజం అనేదే లేదని అదంతా ఓ బూటకమని తేల్చి చెప్పారు. ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్ చేసిన ఆయన ఓ పెద్ద నోట్ రాశారు. అందులో అసలు హిందూయిజం అనే మతమే లేదని స్పష్టం చేశారు. కేవలం దళితులపై కుట్ర చేసేందుకే ఓ మతం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా హిందూ మతం ఉండి ఉంటే...వెనకబడిన వర్గాలకూ మేలు జరిగి ఉండేదని అన్నారు.
"బ్రాహ్మణవాద మూలాలు చాలా లోతుగా మన సమాజంలో పాతుకుపోయాయి. సంఘంలో అసమానతలకూ ఈ బ్రాహ్మణవాదమే కారణం. హిందూ అనే మతమే మన దేశంలో లేదు. అదంతా ఓ బూటకం. కేవలం దళితులను, గిరిజనులను, వెనక బడిన వర్గాలపై చేసిన కుట్ర ఇది. బ్రాహ్మణ కులాన్నే హిందూ మతంగా ప్రచారం చేసుకున్నారు. నిజంగా హిందూ మతం ఉండి ఉంటే దళితులకు సముచిత గౌరవం దక్కేది. వెనక బడిన వర్గాలూ అభివృద్ధి చెందేవి"
- స్వామి ప్రసాద్ మౌర్య, సమాజ్‌వాదీ పార్టీ నేత
ब्राह्मणवाद की जड़े बहुत गहरी है और सारी विषमता का कारण भी ब्राह्मणवाद ही है। हिंदू नाम का कोई धर्म है ही नहीं, हिंदू धर्म केवल धोखा है। सही मायने में जो ब्राह्मण धर्म है, उसी ब्राह्मण धर्म को हिंदू धर्म कहकर के इस देश के दलितों, आदिवासियों, पिछड़ों को अपने धर्म के मकड़जाल में… pic.twitter.com/351EJeSBlY
— Swami Prasad Maurya (@SwamiPMaurya) August 27, 2023
గతంలోనూ వివాదం..
గతంలో రామ్చరిత్ మానస్పైనా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు మౌర్య. ఈ గ్రంథంలో ఓ వర్గాన్ని దారుణంగా కించపరిచారని, సమాజాన్ని కులం ఆధారంగా చీల్చిందని ఆరోపించారు. వెంటనే ఈ గ్రంథాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. మతం పేరుతో ఓ కులాన్ని అవమానించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా చాలా మంది ఈ గ్రంథాన్ని చదవలేదని అన్నారు. బ్రిటీష్ కాలంలోనే దళితులకు చదువుకునే, రాసే హక్కు వచ్చిందని, మహిళలూ అక్షరాస్యులుగా మారే అవకాశం లభించిందని వెల్లడించారు. బిహార్ మంత్రి చంద్రశేఖర్ సింగ్ కూడా రామ్‌చరిత్‌మానస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ...రామ్ చరిత్ మానస్, మనుస్మృతి లాంటి గ్రంథాలు సమాజాన్ని చీల్చేస్తాయని, విద్వేషాలు వ్యాప్తి చేస్తాయని అన్నారు. అందుకే మనుస్మృతిని కాల్చేశారని చెప్పారు. వెనకబడిన వర్గాలకు విద్య అందించడాన్ని వ్యతిరేకించారని విమర్శించారు. "పాలు తాగాక పాము మనపైనే ఎలా విషం కక్కుతుందో...అలాగే వెనకబడిన వర్గాలు చదువుకుంటే మనపై తిరగబడతారని రామ్చరిత్ మానస్‌లో రాశారు" అని చేసిన వ్యాఖ్యలే ఇంత వివాదానికి కారణమయ్యాయి.
Also Read: నాకు ఎలాంటి పదవిపైనా ఆసక్తి లేదు, విపక్ష కూటమి కన్వీనర్ పోస్ట్‌పై నితీష్ క్లారిటీ