By: ABP Desam | Updated at : 26 Aug 2023 09:37 AM (IST)
ట్రైన్‌లో మంటలు - 9 మంది మృతి
తమిళనాడులో వేకువజామున ఘోర రైలుప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 9 మంది చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తమిళనాడులోని మధురై రైల్వేస్టేషన్‌లో ఓ స్పెషల్ ట్రైన్‌లో ప్రమాదం జరిగింది. ఈ ట్రైన్ లక్నో నుంచి రామేశ్వరం వెళ్తున్నట్టు సమాచారం. ఈ రైలులోని కొందరు వ్యక్తులు చేసిన పని 9 మంది ప్రాణాల మీదకు తెచ్చింది. గ్యాస్‌సిలిండర్ తీసుకొచ్చి ప్రాణాలతో చెలగాటం ఆడారు.
మధురై స్టేషన్‌లో రైలు ఆగిన ఉన్న టైంలో కొందరు ప్రయాణికులు టీ కాచుకునేందుకు యత్నించారు. ఇదే ప్రమాదానికి కారణమైంది. సిబ్బందికి తెలియకుండానే రహస్యంగా సిలిండర్‌ను బోగీలోకి తీసుకెళ్లారు. టీ చేస్తున్న టైంలో సిలిండర్ పేలడంతో ప్రమాదం జరిగింది.
సిలిండర్ పేలుడు ధాటికి ఆ బోగీ పూర్తిగా దగ్దమైపోయింది. స్పాట్‌లోనే కొందరు చనిపోగా... మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 20 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ట్రైన్‌లో 63 మంది ఉన్నట్టు తెలుస్తోంది. బోగీలో మంటలు చెలరేగిన వెంటనే చాలా మంది ప్రయాణికులు మెరుపు వేగంతో కిందికి దూకడంతో క్షేమంగా బయటపడ్డారు.
Metallic objects in Stomach: మనిషి కడుపులో ఇయర్ ఫోన్లు, వైర్లు, బోల్ట్లు, వైర్లు-ఆపరేషన్ చేసి బయటకు తీసిన డాక్టర్లు
భారత్తో మైత్రి మాకు చాలా అవసరం, దారికి వచ్చిన కెనడా ప్రధాని ట్రూడో!
PM Modi tour: ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్-వచ్చే వారం మూడు రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన
ముస్లిం విద్యార్థితో హిందూ విద్యార్థిని కొట్టించిన టీచర్, యూపీలోనే మరో సంచలనం
Breaking News Live Telugu Updates: రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ టీం
పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన కేసీఆర్, త్వరలోనే ప్రకటన
Telangana BJP : సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?
Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ - దానం ఇలా కూడా చేయొచ్చు
Cyber Crime: గణేష్ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్ 15-నమ్మితే అకౌంట్ ఖాళీ అయినట్టే
/body>