News
News
X

Wife Exchange: మైండ్‌ పోయేలా ‘భార్యల ఎక్స్‌ఛేంజ్’ గేమ్! ఒప్పుకోలేదని అసహజంగా ప్రవర్తించిన భర్త

తన భర్త వివిధ అమ్మాయిలతోనే కాకుండా అబ్బాయిలతో కూడా లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడని బాధితురాలు తెలిపారు. తన భర్త ద్విలింగ సంపర్కుడని ఫిర్యాదులో పేర్కొంది.

FOLLOW US: 
 

Wife Exchange Game in Rajasthan: రాజస్థాన్‌లోని బికనీర్‌లో భార్యల మార్పిడికి సంబంధించిన షాకింగ్ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒకరి భార్యను మరొకరికి ఇచ్చిపుచ్చుకునే ఈ ఆటలో పాల్గొనడానికి నిరాకరించిందని, ఓ భర్త తన భార్యపై క్రూరత్వానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ షాకింగ్ ఘటనలో, 'వైఫ్ స్వాపింగ్' గేమ్‌లో పాల్గొనలేదనే కోపంతో బాధితురాలిని తన భర్తను కొట్టినట్లు కేసును విచారణ చేస్తున్న అధికారులు తెలిపారు. రాజస్థాన్‌లోని బికనీర్‌లోని ఓ హోటల్ గదిలో ఈ ఘటన జరగ్గా, భోపాల్‌లో కేసు నమోదైంది.

బికనీర్‌లోని 5 స్టార్ హోటల్‌లో..

స్థానిక వార్తా పత్రికలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫిర్యాదు చేసిన మహిళ భర్త బికనీర్‌లోని 5-స్టార్ హోటల్‌లో మేనేజర్‌గా ఉన్నారు. పోలీసులకు బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు.. నిందితుడు అమర్ (భర్త) తనను హోటల్‌ గదిలోకి లాక్కెళ్లి ఫోన్‌ తీసుకెళ్లాడని తెలిపింది. రెండు రోజులుగా మద్యం సేవిస్తూ, డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నాడు. తన భర్త వివిధ అమ్మాయిలతోనే కాకుండా అబ్బాయిలతో కూడా లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నాడని బాధితురాలు తెలిపింది. అంటే ఆమె భర్త ద్విలింగ సంపర్కుడు. తాను తన భర్త ప్రవర్తనతో బాధపడ్డానని, కానీ భార్య మార్పిడి గేమ్‌ కు మాత్రం ఒప్పుకోలేదని చెప్పింది.

తాను భార్య మార్పిడి గేమ్‌లో పాల్గొనడానికి నిరాకరించినప్పుడు, భర్త తనతో గొడవపడ్డాడని, తనను అసభ్యంగా సంభోదించడమే కాక, అసహజ రీతిలో శ్రుంగారంలో పాల్గొన్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ సమయంలో తాను తీవ్రంగా గాయపడినట్లు చెప్పింది. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యల మార్పిడి గేమ్‌లో పాల్గొనబోనని తెగేసి చెప్పినట్లుగా ఫిర్యాదులో పేర్కొంది.

News Reels

వరకట్న వేధింపులు కూడా

అంతేకాక, ఈ మహిళ వరకట్న వేధింపులు కూడా ఎదుర్కొంది. అత్త, మామ, భర్త ఆమె నుంచి రూ.50 లక్షలు కట్నం డిమాండ్ చేశారు. తన భర్త ఘాతుకాల గురించి ఆమె అత్తమామలకు చెప్పింది. కానీ వారు దానిని పట్టించుకోలేదు. పైగా, అది లేటెస్ట్ ట్రెండ్ అంటూ వెనకేసుకొచ్చారు. తన భర్త లైంగిక దాడి తర్వాత తనకు గాయాలు అయ్యాయని, దాంతో తన ఆరోగ్యం క్షీణించిందని మహిళ తెలిపింది. ఇలాంటి దాడులు ఆమెపై నెలల పాటు కొనసాగాయి. అనంతరం బంధువులు వచ్చి ఆమెను పుట్టింటికి తీసుకొని వెళ్లారు. దీంతో అక్కడికి వెళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్‌ 377, 498-ఎ (వధువు వేధింపులు), 323, 506, 34, 3/4 సెక్షన్‌ల కింద నిందితుడైన భర్త, అత్త, ఆమె కోడలుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రాజస్థాన్ హైకోర్టు తీర్పు కీలక తీర్పు

పోక్సో చట్టం కింద జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఓ దోషికి రాజస్థాన్ హైకోర్టు 15 రోజుల పేరోల్ మంజూరు చేసింది. అతని భార్య తాను తల్లి కావాలనుకుంటున్నానని, తన భర్తకు పేరోల్ ఇవ్వాలని పిటిషన్ వేయగా, అందుకు కోర్టు అంగీకరించింది. రాజస్థాన్ హైకోర్టులోని జస్టిస్ సందీప్ మెహ్‌తా, జస్టిస్ సమీర్ జైన్ తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.

వంశ వృద్ధి కోసం దోషి (భర్త) భార్య తరపున పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తులు సందీప్ మెహతా, జస్టిస్ సమీర్ జైన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ దోషి-పిటిషనర్ యొక్క చిన్న వయస్సును పరిగణనలోకి తీసుకుని, రూ.2 లక్షల వ్యక్తిగత బాండ్, ఇద్దరు పూచీకత్తులను అందించడానికి లోబడి పెరోల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది. రాజస్థాన్ జైళ్ల (పెరోల్‌పై విడుదల) రూల్స్, 2021 ప్రకారం.. POCSO చట్టం, IPC సెక్షన్లు 363, 366, 376(3) మరియు 3/4(2) కింద ఆమె భర్తను జూన్ 2022లో కోర్టు దోషిగా తేల్చింది. ప్రస్తుతం అతను జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. 

మతపరమైన, సాంస్కృతిక విశ్వాసాలను తాను బిడ్డను కనగలిగేలా, గర్భం దాల్చడం కోసం దోషిని సాధారణ పెరోల్‌పై విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అయితే, పోలీసులు పిటిషనర్ అభ్యర్థనను వ్యతిరేకించారు.

పోక్సో చట్టం కింద తీవ్రమైన స్వభావం గల నేరంలో మహిళ భర్త దోషిగా ఉన్నందున, అతని విడుదల సమాజంపై ప్రతికూల ప్రభావితం చేస్తుందని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. రాజస్థాన్ జైళ్ల (పెరోల్‌పై విడుదల) రూల్స్, 2021లో సంతానోత్పత్తి కారణంగా పిటిషనర్‌ను సాధారణ పెరోల్‌పై విడుదల చేయడానికి ఎటువంటి నిబంధన లేదని వారు గుర్తు చేశారు.

తన భార్యతో, ముఖ్యంగా పిల్లలను కనే ఉద్దేశ్యంతో, ఒక ఖైదీ వివాహ సంబంధాలను తిరస్కరించడం అతని భార్య హక్కులను హరించినట్లు అవుతుందని అభిప్రాయపడింది. అందుకే సంతానం కోసం దోషికి కోర్టు 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది.

Published at : 18 Oct 2022 08:12 AM (IST) Tags: Bikaner Rajasthan Wife Swap Game Husband Assaulted woman wife exchage wife exchage game wife exchange game in rajasthan

సంబంధిత కథనాలు

Viral News: మొక్కే కదా అని పట్టుకునేరు ప్రాణాలు పోతాయ్- నాగుపాము కంటే డేంజర్

Viral News: మొక్కే కదా అని పట్టుకునేరు ప్రాణాలు పోతాయ్- నాగుపాము కంటే డేంజర్

Tilting Train in India: 'టిల్టింగ్ ట్రైన్' అంటే తెలుసా! 2025 నాటికి భారత్ లోకి ఎంట్రీ!

Tilting Train in India: 'టిల్టింగ్ ట్రైన్' అంటే తెలుసా! 2025 నాటికి భారత్ లోకి ఎంట్రీ!

మిరపకాయలకు ఓ హిస్టరీ ఉందన్న విషయం మీకు తెలుసా.? అసలు మిర్చీ ఎందుకు కారంగా ఉంటుంది?

మిరపకాయలకు ఓ హిస్టరీ ఉందన్న విషయం మీకు తెలుసా.? అసలు మిర్చీ ఎందుకు కారంగా ఉంటుంది?

Shraddha Murder Case: శ్రద్ధా హత్య కేసులో అప్‌డేట్- ఆ కత్తిని కనిపెట్టిన పోలీసులు!

Shraddha Murder Case: శ్రద్ధా హత్య కేసులో అప్‌డేట్- ఆ కత్తిని కనిపెట్టిన పోలీసులు!

UP News: ట్రైన్ విండోసీట్‌లో కూర్చున్న వ్యక్తిపైకి దూసుకొచ్చిన ఐరన్ రాడ్, మెడకు గుచ్చుకుని మృతి

UP News: ట్రైన్ విండోసీట్‌లో కూర్చున్న వ్యక్తిపైకి దూసుకొచ్చిన ఐరన్ రాడ్, మెడకు గుచ్చుకుని మృతి

టాప్ స్టోరీస్

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు  గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

Osmania Hospital : తొలిసారిగా ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో Transgender Doctors | DNN | ABP Desam

Osmania Hospital : తొలిసారిగా ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో Transgender Doctors | DNN | ABP Desam

AP Inter Exam Fee: ఇంటర్‌ సెకండియర్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు 19 వరకు అవకాశం! ఆలస్య రుసుముతో ఎప్పటివరకంటే?

AP Inter Exam Fee: ఇంటర్‌ సెకండియర్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు 19 వరకు అవకాశం! ఆలస్య రుసుముతో ఎప్పటివరకంటే?