అన్వేషించండి

Gehlot Vs Pilot: ఈ సారి గెలిస్తే సచిన్ పైలట్‌కే సీఎం పదవి! నిర్ణయం తీసుకున్న హైకమాండ్?

Rajasthan Elections: రాజస్థాన్‌లో ఈ సారి కాంగ్రెస్ గెలిస్తే సచిన్‌ పైలట్‌కే సీఎం పదవి ఇవ్వాలని హైకమాండ్ భావిస్తున్నట్టు సమాచారం.

Rajasthan Elections:

ఏబీపీ న్యూస్ సోర్సెస్ ద్వారా..

రాజస్థాన్‌లో గహ్లోట్ వర్సెస్ పైలట్ యుద్ధం చాన్నాళ్లుగా నడుస్తోంది. సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు చేశారు సచిన్ పైలట్. తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదన్న అసహనంతో తరచూ గహ్లోట్‌పై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ విభేదాలు అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఖర్గే వచ్చిన తరవాత సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా...ఇద్దరూ వెనక్కి తగ్గడం లేదు. త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి కీలక తరుణంలో పార్టీలో అంతర్గత విభేదాలు కొనసాగితే అధికారం చేజారి పోతుందని భావిస్తోంది హైకమాండ్. అందుకే...దీనికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ABP News సోర్సెస్ ద్వారా ఇప్పుడు ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే సచిన్‌ పైలట్‌కి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేందుకు హైకమాండ్ మొగ్గు చూపుతోందని సమాచారం. దీనిపై గహ్లోట్ అలక వహించకుండా...జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. "ప్రతి సారీ మీకే అవకాశం ఇస్తున్నాం. సీఎం పదవి కోసం పోటీ పడుతున్న వాళ్లున్నారు. వాళ్ల గురించి కూడా కాస్త ఆలోచించాలిగా" అని హైకమాండ్ గహ్లోట్‌కి హితోపదేశం చేసినట్టు తెలుస్తోంది. యువ నేతలకు అవకాశమిస్తే పార్టీ బలం పుంజుకుంటుందని భావిస్తోంది అధిష్ఠానం. సచిన్ పైలట్ పార్టీ వీడిపోయి కొత్త పార్టీ పెడితే తమకే నష్టం అని గ్రహించిన కాంగ్రెస్...ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అయితే...పైలట్ సన్నిహితులు మాత్రం "ఆయనకు కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదు" అని చెబుతున్నారు. గతంలోనూ కాంగ్రెస్ సీనియర్ నేతలు "ఇవన్నీ పుకార్లు మాత్రమే" అని తేల్చి చెప్పారు. 

"సచిన్ పైలట్ కొత్త పార్టీ పెడతున్నారన్న వార్తలు పుకార్లు మాత్రమే. ఆయన పార్టీని వీడతారనడానికి ఎలాంటి సంకేతాలివ్వలేదు. ఈ మధ్యే ఆయనతో మాట్లాడాను. పార్టీ నుంచి వెళ్లిపోతానని ఏమీ చెప్పలేదు. అదిష్ఠానం ఆదేశాల మేరకు సచిన్ పైలట్‌తో చాలా సార్లు చర్చించాను. కలిసికట్టుగా పని చేసేందుకు గహ్లోట్, పైలట్ ఆసక్తి చూపిస్తున్నారు"

- కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ 

ఇప్పటికే రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఈ ఇద్దరు నేతల వాదనలు విన్నారని తెలుస్తోంది. ఆ తరవాతే వాళ్లిద్దరినీ కాంప్రమైజ్ చేసి ఉంటారన్న వార్తలూ వినిపిస్తున్నాయి. సచిన్ పైలట్ గెహ్లాట్ కు వ్యతిరేకంగా సీరియస్ గా రాజకీయాలు చేస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఐదురోజులపాటు పాదయాత్ర  చేశారు.  తమది కూడా 40శాతం కమీషన్‌ ప్రభుత్వమేనని రాజస్థాన్‌లో గెహ్లాట్‌ కూడా 40 శాతం కమీషన్‌ సర్కార్‌ నడిపిస్తున్నారని పైలట్ వర్గానికి చెందిన ఓ మంత్రి చేసిన ఆరోపణ సంచలనం అయింది.  కమీషన్‌ అప్పజెప్పనిదే ఫైళ్లు ముందుకు కదలడం లేదని విమర్శించారు. పైలట్ చేపట్టిన పాదయాత్రలో ఆరోపణలు చేసిన మంత్రి సహా  15 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.   తాము పార్టీ విడిచివెళ్లిపోవాలని గెహ్లాట్‌ అనుకుంటున్నారని, కానీ పార్టీలోనే కొనసాగుతామని, మీ వెంటే ఉంటామని ఎమ్మెల్యేలు పైలట్‌కు మద్దతు పలికారు. ఇలాంటి కీలక తరుణంలో హైకమాండ్‌ ఈ విభేదాలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. 

Also Read: Manipur Violence: మణిపూర్‌లో జూన్ 15 వరకూ ఇంటర్నెట్ బంద్, కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Naga Chaitanya: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Naga Chaitanya: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Vijay Deverakonda: వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
Tummala Nageswararao: తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.2 లక్షలకు పైబడిన వారికి రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.2 లక్షలకు పైబడిన వారికి రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన
Sai Durga Tej : 'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Embed widget