Indian Railways: 'తూచ్, అలాంటిదేం లేదు'- లగేజీ పాలసీపై రైల్వేశాఖ కీలక ప్రకటన
Indian Railways: లగేజీ పాలసీపై మార్పులు చేసినట్లు వస్తోన్న వార్తలపై రైల్వేశాఖ క్లారిటీ ఇచ్చింది.
Indian Railways: లగేజీ పాలసీను మార్చినట్లు వస్తోన్న వార్తలను రైల్వేశాఖ ఖండించింది. రైలు ప్రయాణం సమయంలో లగేజీపై సోషల్ మీడియా సహా డిజిటల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. ప్రస్తుత పాలసీని తాము మార్చలేదని రాబోయే 10 ఏళ్లలో కూడా మార్చబోమని తేల్చిచెప్పింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.
News item covered on some social media/digital news platforms that the luggage policy of railways has recently been changed, is incorrect.
— Ministry of Railways (@RailMinIndia) June 6, 2022
It is hereby clarified that no change has been made in the recent past and the existing luggage policy is enforced for more than 10 years.
ఇవే వార్తలు
రైలులో ప్రయాణించే సమయంలో ఎక్కువ లగేజ్ ఉంటే దానికి కూడా ముందే బుకింగ్ చేసుకోవాలని ఇటీవల వార్తలు వచ్చాయి. ముందు బుక్ చేసుకోకపోతే సాధారణ రేట్ల కన్నా ఆరు రెట్లు ఎక్కువ పెనాల్టీ కట్టాల్సి వస్తుందని ఆ కథనాల్లో పేర్కొన్నారు. లగేజ్ పరిమితి నిబంధనలను ఇక కచ్చితంగా అమలు చేస్తామని రైల్వే శాఖ పేర్కొన్నట్లు ఆ వార్తల సారాంశం. లగేజీపై రైల్వేశాఖ చేసిన ఓ ట్వీట్ ఆధారంగా ఈ వార్తలు వచ్చాయి.
अगर सामान होगा ज्यादा, तो सफर का आनंद होगा आधा!
— Ministry of Railways (@RailMinIndia) May 29, 2022
अधिक सामान ले कर रेल यात्रा ना करें। सामान अधिक होने पर पार्सल कार्यालय जा कर लगेज बुक कराएं। pic.twitter.com/gUuishbqr5
Also Read: CM Mamata Banerjee: నా రక్తాన్ని చిందిస్తా కానీ బంగాల్‌ను ముక్కలు కానివ్వను: దీదీ